23, జులై 2011, శనివారం

అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1

                
మారేనేమో.. నాకు ఒక ముద్దల తమ్ముడు వున్నాడు అన్నమాట..రాముడు మాట లక్షమణడు జవదాటనట్టు , వీడి మాట కూడా నేను దాటే వాడిని కాదు.. ఇదేంటి అంత రివర్స్ లో వుంది అనుకుంటున్నారా.. అది అంతేయ్.. ఎంతైన నా ముద్దలా తమ్ముడు కదా.. వాడి మాట చెల్లాలి.

                                               గుంటూరు లుత్రెన్ స్కూల్ లో నేను ఫస్ట్ క్లాసు లో వున్నపుడు మా వాడిని LKG కని బలపాల బడిలో వేసారు.ఇక మాకోసం అమ్మ రోజు మధ్యానం బాక్స్ తెచ్చి తినిపించి వెళ్లేది.వీడు స్కూల్ లో జేరక ముందు నేను ఒక్కడినే చిన్నగా అన్నం తింటూ అమ్మ తో కబుర్ల, కాకరకాయల తో, మంచి గా టైం పాస్ చేసేవాడిని. నేను ఇలా అమ్మ తో హ్యాపీ గా వుండటం చూసి అల్లు అర్జున్ – “అదేంటి హ్యాపీ సినిమా లో నేను కదా హీరో వీడు ఎలా హ్యాపీ గా వుంటాడు.” అని వెళ్లి వాళ్ళ మామయ్య చిరు కి చెప్పి.. ఆ చిరు వెళ్లి సోనియా కి చెప్పి..ఆ సోనియా తో.. అర్జెంటు మా తమ్ముడు వెళ్తున్న.బలపాల బడి ని మూపించాడు.. ఇక మా నాన్న గారు వేరే అలోచాలను లేకుండా మా స్కూల్ లోనే వేసారు..

                                               కొత్త వాళ్ళని సులభం గా స్నేహితులని చేసుకోవటం మా వాడికి వెన్నతో కాదు జున్ను తో పెట్టిన విద్య. అదేంటి సామెత మార్చాను అనుకుంటున్నరా.. అది అంతే నాకు వెన్న కంటే జున్ను అంటే ఇష్టం.  మా వాడు తిండి తినటం లో ఫాస్ట్.. త్వరగా తిని.. ఎంత త్వరగా ‘కరెంటు షాక్’’అంటుకునే ఆట ‘ ‘పిచ్చి బంతి’ వగైరా వగైరా ఆటలు ఆడదామా అని.. గబా గబా తినేసే వాడు. అమ్మ నోట్లో ముద్దలు పెడితేయ్..చిన్న ముద్దల కాదు అమ్మ.. పెద్దవి పెద్దవి అంటూ.. చివరికి తిరుపతి లడ్డుల సైజు కి తీసుకువచ్చాడు..నేను ఏమో తినలేక ఆపసోపాలు పడితేయ్, మా వాడు మటుకు తినేసి, లగేతుకుంటూ.. వెళ్లి ఆటల్లో మునిగిపోయేవాడు.. అమ్మ ఏమో.. ఏరా నాని నువ్వు వెళ్లి వాళ్ళతో ఆడుకో.. అని పంపించేసి.. అమ్మ వేంటనే వెళ్ళిపోయేది..అల అమ్మ కూడా త్వరగా వెళ్లటం అలవాటు చేసుకుంది.ఏమి చేస్తాం చెప్పండి.. రాజకీయనాయకులు,ఇంట్లో పెద్ద పిల్లలు ఏమి చేయలేరు.. ఖండించి ముందుకు పోవటం తప్పితేయ్...

                                                నర్సేరి నుంచి మా వాడు ఎల్.కే.జి కి వచ్చాడు..ఇంకా పరిమాణాల గురించి మన వాడికి ఊహ వచ్చేసింది..వాడి లెక్కలో ఎంత పెద్దగా వుంటే అంత ఎక్కువ విలువ అన్నమాట.ఇక చూసుకోండి మా తిప్పలు.. ఇంట్లో నాన్న కి పెద్ద పళ్ళెం లో అన్నం పెడితేయ్ , వాడికి కూడా దాంట్లో నే పెట్టాలి అని గొడవ చేసేవాడు., అన్నం కొంచం పెట్టిన ఊర్కునే వాడు కాదు..పళ్ళెం నిండా పెట్టుకొని సగం కూడా తినకుండా .. మిగిలిస్తేయ్ అమ్మ ఊర్కోదు అని.. ఇది నీ ముద్ద , నాన్న ముద్ద , అమ్మ ముద్ద మాతోనే నే తినిపించే వాడు..

ఇక్కడి తో అవ్వలేదు.. స్కూల్ కి వెళ్తుంటే.. నాన్న వాడికి, నాకు చెరొక పావలా ఇచ్చేవారు.. ఒకసారి వాడు నాన్న జేబు లో “పది పైసల” బిల్ల చూసి.. అది కావాలి అని గొడవ చేసాడు.. వద్దు రా,పావలా నే ఎక్కువ అంటే వినలేదు..ఇంకేం చేస్తారు.. చివరికి వాడి కోరిక మీరకు.. వాడికి పది పైసల బిల్లనే ఇచ్చారు.. స్కూల్ ఇంటర్వల్ టైం.. నేను పావలా ఇచ్చి.. ఐదు.. కిల్లి బిళ్ళలు తీసుకున్న.. మా వాడు పది పైసలు ఇచ్చి పది బిళ్ళలు కావాలి అన్నాడు.. కొట్టు వాడు , రెండే వస్తాయి అంటే.. అదేంటి పావలా కంటే పది పైసల సైజు ఎక్కువ వుంది కదా.. నాకే ఎక్కువ బిళ్ళలు రావాలి అని అరిచి గీ పెట్టి మరి తీసుకునే వాడు.. పాపం ఆ కొట్టు వాడు సాయంత్రం మా అమ్మ కి చెప్తేయ్ .. అమ్మ వాళ్ళు “వాడికి ఎన్ని కావాలి అంటే అన్ని ఇవ్వండి.. డబ్బులు సాయంత్రం మేము ఇస్తాము అని చెప్పారు.


                          ఇంకా మా వాడి డాన్స్.. డాన్స్ వేస్తున్నపుడు , పాటలు పాడుతున్నపుడు చుట్టూ వున్న అందరు చూసి చప్పట్లు కొట్టి తీరాలి.. లేకపోతేయ్ చప్పట్లు కొట్టే దాక డాన్స్ వేస్తూనే వుంటాడు.. .. ఇలా చెప్పుకుంటూ పోతేయ్ ఎన్నో వున్నాయి.. ఇప్పటికీ ఈ టపా పెద్దదయి పోయింది.. మిగిలినవని ఇంకో టపా లో చూద్దాం....

2, మే 2011, సోమవారం

అలా నా పెళ్లి అవుతుంది.. ఆ ఆనంద సమయాన మీ దీవెనలు..కావాలి.

తనని చూడగానే..
ఆకాశం లో మెరుపులు మెరవలేదు..
అలా పూలు కూడా రాలలేదు..

కానీ తనతో వుంటే
నా జీవితం మొత్తం ఆనందం గా ఉండగలను అని అనిపించింది..
ప్రతి విషయం తనతో పంచుకోవాలి అనిపించింది..
తను లేని.. ప్రతి క్షణం ఇక నుంచి అసంపూర్ణం అనిపించింది..
మొత్తం గా తను నా కోసమే పుట్టింది అని అనిపించింది..

అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. వెంటనే మా పెద్దలకి ఒకే చెప్పాను.. వాళ్ళు ముహూర్తం పెట్టి.. ఆ రోజు నుంచి తను నీదీ అనిచెప్పారు..

మీరు తప్పక వచ్చి మీ దీవెనలు.. మాకు అందిస్తేన కదా.. మాకు కూడా మంచిది..

మీ రాక కోసం ఎదురు చూస్తూ మీ శశి..

కింద ఉన్న బొమ్మ మీద క్లిక్ చెయ్యండి..

3, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !!!! ..

అందరికి శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !!!! .. శ్రీ అంటే లక్ష్మి , కావున అందరు భోగ భాగ్యాలతో సంతోషంగా తప్పక వుంటారు.. చుడండి.. :)
©www.myreviews4all.blogspot.com

15, మార్చి 2011, మంగళవారం

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ & ఒక రోజు వారి కూలి ?? వీళ్ళలో ఎవరు గొప్ప?

మాములుగా ఒక మంచి కామెడీ టపా వేద్దాము అనుకున్న.. కానీ నిన్న చూసిన ఒక సంఘటన నా మనుసులో ఇంకా మెదులుతూనే వుంది.. అది మీ తో పంచుకుంటే కానీ నా భారం తగ్గదు అనిపించి వేస్తున్న టపా ఇది.

నిన్న ఆఫీసు లో పని త్వరగా పూర్తి అవ్వటం వాళ్ళ, ఆఫీసు బస్సు లో వెళ్ళకుండా , BMTC (బెంగుళూరు లోకల్ ) బస్సు లో ఇంటికి బయలుదేరా.. సిల్క్ బోర్డు దగ్గర ఒక చాల మంది గుంపు ఎక్కారు.. వాళ్ళలో నా దృష్టి ని ఇద్దరు ఆకర్షించారు.. ఒకడు .. నార్త్ వైపు నుంచి వచ్చి ఇక్కడ జాబు చేస్తున్న సాఫ్ట్ వేర్  ఇంజనీర్, ఇంకొకరు.. అక్కడే కడుతున్న బంగాళా లో పని చేస్తున్న తాతయ్య ( కార్మికుడు) .. 

బస్సు లో కొంత మంది..  తాతయ్య ని ఒక వింత  చూపు చూసారు.. వీడు ఏంటి.. ఈ AC బస్సు ఎక్కటం ఏంటి అని అన్నట్టు గా...నేను చిన్నప్పుడు పల్లెటూరు లో పెరగటం వల్ల ఎవరు అయిన పంచె లో కనిపిస్తేయ్ సొంత మనిషి ని చూసిన భావం కలుగుతుంది.. అందుకే ఆ ముసలయ్యిని చూస్తూ వున్నా.. నా పక్కన్న "SHIT " అన్న పెద్ద అరుపు విని మళ్లీ ఈ లోకం లోకి వచ్చి గమనిస్తే ఏముంది.. పాపం ఆ తాత సంచి.. ఆ నార్త్ వాడి బ్యాగ్  కి అనుకుంది అంట.. మట్టి అవుతుంది అని వాడి ఆ అరుపు అరిసాడు..  పాపం తాతయ్య మొహం చిన్నది అయిపోయింది..

ఈ లోపు కండక్టర్ వచ్చాడు.. తాతయ్య "మర్తహళ్లి బ్రిడ్జి" కి ఒక టికెట్ అంటే.. కండక్టర్  "ముప్పై" అన్నాడు.. వెంటనే.. తాతయ్య డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు..ఆ పక్కన నార్త్ వాడు ఏమో "పాస్" అని చెప్పి టికెట్ తీసుకోలేదు.. తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ వుంటే.. తాతయ్య నా వంకనే చుస్తువున్నాడు. ఫోన్ లో మాట్లాడటం అయిపోయాక ఒక నవ్వు నవ్వాను.. వెంటనే.. తాత "బాబు మీరు తెలుగా అన్నాడు.. ".. "అవునండి తెలుగు వాడిని మాది గుంటూరు అని " చెప్పా..i తాత వాళ్ళది చిత్తూర్ అంట..ఇంకా వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చాడు..ఒక్క సరిగా.. "బాబు... AC బస్సు అంటే మాములు బస్సు కంటే ఒక పది రూపాయలు ఎక్కువ వుంటుంది అని ఎక్కాను.. కానీ ఇంత ఎక్కువ ఏంటి బాబు.. అని బాధగా అన్నాడు.." వెంటనే నేను మీకు డబ్బు ఏమైనా కావాలా అంటే.. చ చ.. నాకు వద్దు బాబు.. అని అన్నారు..

నేను తాతయ్య కంటే ఒక స్టాప్ ముందు , నాతో పాటు ఆ హిందీ కుర్రవాడు కూడా దిగాడు... ఐతేయ్ బస్సు దిగిన వెంటనే.. ఆ హిందీ కుర్రవాడు.. వాళ్ల స్నేహితుడు తో చెపుతున్న మాటలు విని నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను.. వాడి మాటల్లో.. "అరేయ్ దోస్త్ ఇవ్వాళా నేను ముప్పై రూపాయలు సేవ్ చేశాను..బస్సు లో టికెట్ తీసుకోకుండా వచ్చాను." అని చెప్పి పగల పడి నవ్వుతున్నాడు..  వెంటనే.. నాకు బస్సు లో తాత గుర్తువచ్చాడు.. పాపం డబ్బులు లేకపోయినా టికెట్ తీసుకున్నాడు.. కానీ నెలకి ఐదు అంకెల జీతం చేస్తున్న ఈ కుర్రవాడు మటుకు తీసుకోలేదు.. ఎవరు గొప్ప మీరే చెప్పండి.. నేను ఇక్కడ బస్సు లో టికెట్ తీసుకొనే ప్రయాణం చెయ్యండి అని నేను చెప్పటం లేదు.. మనుషులకి ఇచ్చే గౌరవం వాళ్ళ వస్త్రధారణ చూసి ఇవ్వవద్దు.. అని నేర్చుకున్నాను.....ఆ సంఘటన వల్ల

చివరి మాట :- బస్సు ఎక్కుతున్నప్పుడు అందరు ఒక్కసారిగా ఆ తాత ని ఒక వింత చూపు చూసారు.. నాతో సహా.. కానీ.. ఇప్పుడు ఆ తాతయ్య ఎంతో గొప్ప గా కనిపించారు...

7, మార్చి 2011, సోమవారం

నేను..... ఒక ప్రేమ బాధితుడినే



టపా పేరు చూసి నాకు ఒక విషాద ప్రేమ కధ వుంది అనుకున్నారా.. ఐతేయ్ మీరు ఒక కిలో ముద్ద పప్పు లో కాలు వేశారోచ్ ..కానీ నేను ఒక ప్రేమ  బాధితుడినే.. ఎలాగంటారా.. మా క్రాంతి గాడి ప్రేమ వల్ల.. వాడి ప్రేమ వల్ల నేను బాధ ఏమి పడ్డానా  అని ఓఒ తెగ ఆలోచించమాకండి.. కొంచం కొంచం గా మొత్తం చెబుతా...

అస్సలు ఈ క్రాంతి ఎవడు అంటే.. నా ప్రాణ స్నేహితుడు.. వీడు కాకుండా.. ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా వున్నాడు.. వాడు "షరీఫ్".. వీళ్ళు ఇద్దరు లేకుండా.. మనం లేము.. అంత ప్రాణం నాకు వాళ్ళు అంటే.. షరీఫ్ ఏమో కానీ.. క్రాంతి చేసిన కొన్ని పనుల వల్ల ఎన్నో సార్లు.. "ప్రపంచం లో ఇంత మంది వుండగా.. ఈ క్రాంతి నే ఎందుకు నా  ప్రాణ స్నేహితుడు లా అయ్యాడు" అనుకున్న.. కానీ మనలో మన మాట.. వీడి దగ్గర , షరీఫ్ దగ్గర మన వేషాలు సాగినట్టు ఎవ్వరి దగ్గర సాగవు.. నేను ఏమి కావాలంటే అది చేస్తారు.. ఒక్క మాట లో చెప్పాలి అంటే నేను చాల అదృష్టం చేసుకున్నాను..

సరే మనం అస్సలు విషయం లోకి  వచ్చేద్దాం .. క్రాంతి కి "మనసంత నువ్వే " లాగా చిన్నప్పటి ప్రేమ వుంది.. ఇంజనీరింగ్ అప్పుడు నాకు తెలియగానే ఫస్ట్ లో నవ్వేసాను.. కానీ ప్రేమ లో మన వాడి నిజాయతి చూసి.. వాడిని మెచ్చుకోకుండా ఉండలేను..

క్రాంతి వాళ్ళది కూడా గుంటూరు , ఐతేయ్ ఒక్కోసారి..  వాళ్ల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుంటూరు కి వచ్చి మా ఇంట్లో వుంటూ.. తన ప్రేమికురాలని(చెల్లి) ని కలుస్తువుండే వాడు.. ఐతేయ్ చెల్లి వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్.. అందుకని ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు.. రాగానే ఫోన్ చేసేది.. ఆ ఫోన్ రాగానే.. వాడికి ప్రపంచం లో ఎవ్వరు కనపడరు.. నాతో సహా (ఇది మరి దారుణం కదండీ..) , అందుకే అంటారు ఏమో.. "ప్రేమ గుడ్డిది అని" .. ఐతేయ్ వాడి గుడ్డి తనం వల్ల ఎన్నో సార్లు బుక్ అయ్యా..

ఘటన ఒకటి :-  
కొత్త బంగారు లోకం సినిమాకి "నేను , క్రాంతి " ఇద్దరం వెళ్ళాం.. సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిముషాలకి చెల్లి ఫోన్ చేసింది.. ఇప్పుడు వస్తానురా ఫోన్ లో మాట్లాడి అని చెప్పి వెళ్ళాడు.. ఒక ముప్పై నిముషాలు చూసా, రాలేదు.. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమోలే అనుకోని వదిలేశా.. ఇంటర్వల్ లో బయటికి వెళ్లి చూసాను.. కనపడలా.. ఫోన్ చేస్తేయ్... " మామ నేను బయటకి వచ్చాను , సినిమా చూసి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు" , వాడితో వస్తున్న అని purse  కూడా ఇంట్లో లోనే పెట్టి వచ్చా.. చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏమి చేస్తాం ఇంకా.. సినిమా అయిపోయాక ఒక మూడు కిలోమీటర్లు లెఫ్ట్ - రైట్ కొట్టాను.. ఈ విధంగా ప్రేమ వల్ల మొదటి సరి బాధింప పడ్డాను..

ఘటన రెండు :-
బెంగుళూరు కి వచ్చాక.. ఇద్దరం కలిసి బయట నుంచి భోజనం తెప్పిన్చుకున్నాం.. వేడి వేడిగా ఇద్దరికి వడ్డన కూడా చేశా.. సర్రిగా అప్పుడే చెల్లి కాల్ చేసింది వాడికి , అంతెయ్ ఫోన్ కి వాడు అంకితం అయిపోయాడు.. ఇరవై నిముషాలు అయిన తినటానికి రాలేదు.. ఒక్కడినే తినలేను.. చివరగా దొర గారు ఎప్పుడో వచ్చి "ఏంట్రా నువ్వు నాకోసం తినకుండా వున్నావా? " అని అడిగినప్పుడు ఎంత ఒళ్ళు మండిందో..

ఘటన మూడు :-
ఒక రోజు ఫోన్ చేసి.. మనసేం బాలేదురా మా ఆఫీసు కి వచ్చేయి.. అక్కడి నుంచి ఇద్దరం ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు.. సరే కదా అని నేను వాడి కోసం వెళ్ళాను..  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ.. బయలుదేరం.. అలా స్టార్ట్ అయ్యమో లేదో.. చెల్లి ఫోన్ చేసింది..అంతెయ్ మన వాడి అడుగుల వేగం తగ్గింది.. నువ్వు వెళ్ళు మామ.. నేను చిన్నగా వస్తా అని , "తన దైన శైలి లో నను మరిచాడు.." నా చిట్టి హృదయం ఎంత బాధ పడిఉంటుందో.. ఈ పాటికి మీ అందరికి అర్ధం అయ్యే వుంటుంది..

ఇలా వాడి ప్రేమ వల్ల నేను బాధింప పడ్డాన లేదా..మీరే చెప్పండి.. :) అందుకే నేను ఒక ప్రేమ బాధితుడినే..

సంతోషకరమైన విషయం ఏమిటి అంటే.. భగవంతుడి దయ వల్ల.. పోయిన వారమే.. వాడికి , వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యింది.. అలా ఒక సుధీర్గమైన ప్రేమ కథ కి సంతోషకరమైన ముగింపు వచ్చింది.. :)  అలా క్రాంతి గాడి ప్రేమ >>>>> పెళ్లి అయ్యింది, నా బాధలు కంచి కి వెళ్ళాయి.. :)

26, ఫిబ్రవరి 2011, శనివారం

నంది హిల్స్ - ఒక అనుకోని ప్రయాణం - అనుకోని సంఘటనలు

ముంబై తో పోల్చుకుంటే , బెంగుళూరు లో వీకెండ్స్ చాల నిస్తేజం గా , నీరసంగా గడిచిపోతున్నాయి.. దానికి రెండు కారణాలు..

మొదటిది ఇప్పుడు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్.. మార్చిలో రిలీజ్ వుంది అని . జనవరి నుంచి ప్రతి రోజు పని చేపిస్తునే వున్నారు.. మేము చేస్తూనే వున్నాం.. సండే ఖాళీ గానే వున్నా.. విశ్రాంతి కావాలి కదా.. సో సండే మొత్తం నిద్ర కే అంకితం ఇచ్చేసాం..

రెండవది :- మా క్రాంతి గాడు.. వేదవ.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే , ఆ.. వూ.. అంటాడు కానీ..కదలడు.. వాడు లేకుండా మనం వెళ్ళలేం.

మొన్న feb   మొదటి వారం.. ఇంట్లో ఒక పని వుండి , అర్జెంటుగా గుంటూరు రమ్మనారు.. శనివారం ఆఫీసు ఉంది అని.. శనివారం సాయంత్రానికి టికెట్స్ బుక్ చేపించాను.. ఏమైందో.. సడన్ గా మా మేనేజర్ మీటింగ్ పెట్టి, ఈ వీకెండ్ మనం పని చెయ్యటం లేదు.. ఎంజాయ్ 2  డేస్ అని చెప్పగానే.. "అందరం ఎగ్గిరి గంతువేసాం".. మేము అల సంబరాలు జరుపుతున్న టైం లో.. చావు కబురు చల్లగా చెప్పాడు.. సోమవారం onsite  నుంచి client  మేనేజర్ వస్తుంది.. సో వచ్చే వారం నుంచి సండే కూడా పని చెయ్యాలి.. కావున మీ మీ batteries ఛార్జ్ చేసుకోండి అని విషయం చెప్పగానే".. మాలో ఉత్సాహం.. చప్పున చల్లారిపోయింది..

గుంటూరు కి శుక్రవారం టికెట్స్ దొరకటం చాల కష్టం.. అందుకని.. శనివారం టికెట్ నీ ఒకే చేశా.. అంటే మన చేతిలో శనివారం అంత ఖాళీ గా ఉంది అన్నమాట..ఇంటికి వెళ్ళేపాటికి , క్రాంతి , చిన్న (మా తమ్ముడు) , దీపూ(క్రాంతి బావ).. అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.. బయటికి వెళ్దాం అంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు.. ఇంకేం చేస్తాం.. నేను పడుకున్న.. పడుకొని.. క్రాంతి గాడిని బాగా తిట్టాను.. కొత్త బైక్ కొన్నావు కదరా.. కనీసం.. నైట్ ride  కన్నా వెళ్దాం పద అంటే.. వాడు వద్దు అన్నాడు.. ఇంకా నాలో కోపం కట్టలు తెంచుకొని.. సమరసింహా రెడ్డి లో బాలయ్య లా " రేయ్!!! బెంగుళూరు కి రా రా అని అన్నావ్.. వచ్చాక కనీసం ఒక్కసారి అన్న బయటకి వెళ్ళామా?" అని ఘాటు గా అరిచాను.. పాపం.. వాడు కూడా "ఇప్పుడు టైం 12  అయ్యింది .. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటే.. " నంది హిల్స్ కి వెళ్దాం పద.. సూర్యోదయం.. బావుంటుంది అంట.. ఎప్పుడు చూడలేదు అని అడిగా.. సరే అని.. నలుగురం బయలుదేరం..

క్రాంతి బైక్ మీద నేను, దీపూ బైక్ మీద చిన్న .. అల మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. బాగా చలి గా వుండటం వాళ్ళ.. చాల తక్కువ స్పీడ్ లో వెళ్ళాము.. రాత్రి 2 గంటలకి.. "బెంగలూరు అంతర్జాతీయ విమానాశ్రయం" దగ్గరకి వెళ్ళాం.. అక్కడ రోడ్ పక్కన.. టీ అమ్ముతున్నారు.. మా లాగానే నంది హిల్స్ కి వెళ్తున్న ఒక 20 మంది కురాళ్ళు అక్కడ కలిసారు.. ఒక టీ తాగి.. వాళ్ళతో మాటలు కలిపాం .. నంది హిల్స్ పొద్దున 5  కి కానీ ఘాట్ రోడ్ ఓపెన్ చెయ్యరు అని తెలిసింది.. అందుకని ఒక 2  గంటలు ఎక్కడైనా గడపాలని అనుకున్నాం.  నా తమ్ముడు నేను విమానం take off  ఎప్పుడు చూడలేదు..విమానాశ్రయం కి వెళ్దాం అన్నాడు.. సరే ఒకే అని అక్కడికీ వెళ్ళాం.. అక్కడ కాఫీ డే ఉంది.. కాఫీ తాగుతూ బాతాకాని వేసుకుంటూ.. టైం పాస్ చేసాం..

కొన్ని ఫోటోలు.. , దిగిన తర్వత.. నంది హిల్స్ కి బయలుదేరం.. పాపం బాగా చలి గా వుండటం వాళ్ళ. క్రాంతి డ్రైవింగ్ చెయ్యలేక పోయాడు.. నాకేమో బండి రాదు.. వాడి పరిస్థితి చూసి "సర్లేరా.. gears  ఒక్కటే గా నాకు రానిది.. నువ్వు చెప్పు నేను మేనేజ్ చేస్తాను" అని బండి డ్రైవ్ చేశా.. అల నేను మొదటిసారీ బండి డ్రైవింగ్.. బ్రాహ్మి ముహూర్తం లో చేశా ;)".

ఘాట్ రోడ్ కి ఇంకో రెండు కిలోమీటర్లు ఉంది అనగా.. రోడ్ పక్కన కొంత మంది ముసలి వాళ్ళు.. పెద్ద మంట వేసి చలి కాచుకుంటున్నారు.. అది చూసి మేము కూడా టెంప్ట్ అయ్యి.. బండ్లు ఆపేసి.. వాళ్ళతో కలిసి పోయి.. చలి కాచుకున్న.. ఎందుకో.. మా తాత గారు.. గుర్తుకు వచ్చారు.. సంక్రాంతి పండగకి మేము చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.. ఆ మంటల పక్కన ఒక చిన్న హోటల్ ఉంది.. వేడి వేడి గా.. noodles  చేసి ఇస్తున్నారు.. శుబ్రంగా వాటిని కూడా ఒక పట్టు పట్టాము..



6 కి ఘాట్ రోడ్ ఓపెన్ చేసారు.. ఇంకా అంతెయ్ అక్కడ మలాగానే.. ఒక 60  మంది వుంటారు.. అంత ఒకేసారి పైకి వెళ్ళాం.. వెళ్ళే పాటికి అప్పుడే భానుడు.. ఒళ్ళు విరుచుకుంటూ.. బయటకి వస్తున్నాడు.. కొండ పైన కదా.. చల్లని గాలి, సూర్యోదయం.. అబ్బః.. అది అనుభవిస్తేనే కానీ.. మాటల్లో చెప్పలేని ఆనందం.. ఒక గంట.. అల గడిపిన తర్వత..అక్కడికి ఏదో కన్నడ సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చారు.. అస్సలే మనకి సినిమా మేకింగ్  అంటే పిచ్చి.. సో ఇంకో ౩ గంటలు.. వాళ్ళ పని తీరు.. షాట్స్ తీసే విధానం చూస్తూ వుండిపోయ..

సడన్ గా మా తమ్ముడు గుర్తుచేసాడు.. "నీ బస్సు టైం 6 .30  కి.. ఇప్పుడు టైం పదిన్నర అయ్యింది.. ఇక్కడ నుంచి ఇంటికి నాలుగు గంటలు అన్న పడుతుంది.. పద అని చెప్పగానే.. వెన్నకి బయలుదేరం.. ఐతేయ్ ముందు రోజు రాత్రి అంత నిద్ర లేకపోవటం వల్ల.. చాల స్లో డ్రైవింగ్ చేసాం.. ఇంటికి వచ్చేపాటికి 3  అయ్యింది.. వళ్ళు నెప్పులు.. పడుకుంటే నిద్ర రాదు... అల కష్టపడుతూ ఎప్పటికో నిద్ర పోయాను.. నిద్ర పట్టిందో లేదో.. బస్సు టైం అవుతుంది అని నిద్ర లేపేసారు..

సర్లే బస్సు లో పడుకుందాం అనుకున్నాం.. కానీ.. ఏమి చేస్తాం.. విధి మనతో గేమ్స్ ఆడటం మొదలు పెట్టింది.. బస్సు లో నా పక్కన వ్యక్తి.. పెద్ద గురకలు పెడుతూ నిద్ర పోతీ నాకు నిద్ర ఎలా వస్తుంది.. పోదున ఇంటికి వెళ్ళగానే.. పని మీద నాన్న , నేను రోజు మొత్తం బండి మీద తిరుగుతూనే వున్నాం.. సాయంత్రానికి నా వళ్ళు పచ్చి పుండు లా ఒకటే నెప్పులు.. సర్లే.. బెంగుళూరు కి వెళ్తూ అన్న.. రెస్ట్ తీసుకుందాం అనుకున్న.. బస్సు స్టాప్ కి వెళ్ళాను.. విజయవాడ  to  బెంగుళూరు బస్సు వచ్చింది.. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. లిస్టు లో చూస్తే నా పేరు లేదు. టికెట్ ఏమో నా దగ్గరే ఉంది.. మరి ఏంటి ఏమి అయ్యింది అనుకుంటున్నారా?   ఆ ట్విస్ట్ చూస్తే.. మీరే పాపం అనుకుంటారు.. అస్సలు గుంటూరు to బెంగుళూరు రిటర్న్ జర్నీ మీద ఇంకో పోస్ట్ ఎసుకోవచ్చు.. అస్సలు ఏమి జరిగింది, ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది..అని తెలుసుకోవాలి అంటే.. ఇంకో పోస్ట్ కోసం వెయిట్ చెయ్యండి..  
 

24, ఫిబ్రవరి 2011, గురువారం

సెలవు తీసుకున్న ముళ్ళపూడి వెంకట రమణ గారు



నా కెంతో / మనకెంతో ఇష్టమైన "బుడుగు" సృష్టి కర్త "ముళ్ళపూడి వెంకట రమణ" గారు ఇక మన మధ్య లేరు.. స్వాతి బుక్ ని కేవలం "కోతి కొమ్మచి" కోసం కొనే వాడిని. బౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా , తను సృష్టించిన పాత్రలతో.. ఎప్పుడు మన మధ్య నే వుంటారు..

ఈ వార్త ని జీర్ణించుకోవటానికి బాపు గారికి మానసిక బలం కలగాలని ఆశిద్దాం..

ఆయన ఆత్మ కి శాంతి కలగాలని దేవుడిని వేడుకుంటున్న..

2, ఫిబ్రవరి 2011, బుధవారం

ఎలాంటి సాఫ్ట్ వేర్ మొగుడు కావాలంటే

ఇద్దరు పెళ్లి కానీ అమ్మాయిలు.. మాట్లాడుకుంటున్నారు.. మనం వెళ్లి సిక్రెట్ గా విందాం వచ్చేయండి.. వచ్చేసారా.. ఇప్పుడు నాలేగే చెవులని గోడ కి అనించండి.. ఏంటి ఇంకా వినపడటం లేదా.. సరేలెండి ఏమి చేస్తాం వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో.. మీకు లైన్ బై లైన్ రాస్తాను..

విద్య :- హాయ్.. ఎంటే సడన్ గా కాల్ చేసావ్.. ఏదైనా అర్జెంటు విషయమా?
నిత్య :- ఏమి లేదే.. నీకు గుర్తు వుందా.. మా అమ్మ నాన్న నా జాతకాన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, సంబంధాలు ఏమైనా చూస్తారు అని.. చాల సంబంధాలు వచ్చాయి కానీ.. ఒక 4  - 5  సంభంధాలకి మాత్రం నా జాతకం సరిపోయింది అంట..
విద్య :-  మంచిది.. ఆ నాలుగింటి లో నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో..
నిత్య :- ఇక్కడే వచ్చింది , అస్సలు చిక్కు అంత. నలుగురు కూడా software ఇంజనీర్ లే.. కాకపోతేయ్ అంత వేరే positions  లో వున్నారు..
విద్య :- అలాగా.. ఐతేయ్ వాళ్ళ పోసిషన్ చెప్పు.. దాన్ని బట్టి నీకు మంచిది చెప్తా..
నిత్య :- మొదటి వాడు.. "manager".
విద్య :-
"manager". యా వద్దే వద్దు.. వాడు ఎప్పుడు పని లేకపోయినా బిజీ గా వున్నట్టు జీవిస్తాడు.కానీ ఒక్క పని కూడా సర్రిగా చెయ్యడు.. కిలో mutton తెచ్చి చికెన్ 65  చెయ్యమంటాడు.. 2  కిలోల బియ్యం తెచ్చి నెల మొత్తం సరిపెట్టమంటాడు. కుదరదు , వీలుకాదు అని చెప్పిన వినడు.. రాత్రి పగలు పని చేస్తేయ్ ఏది కూడా అసాధ్యం కాదు అంటాడు..
నిత్య :- వామ్మో!!!!!!!!!!! ఐతేయ్ వద్దు.. రెండవ వాడు..
"test engineer".
విద్య :- వీడు ఇంకా డేంజర్ అమ్మ మహా తల్లి.. ఎప్పుడు తప్పులు వెతకటం లో బిజీ గా వుంటాడు.. నువ్వు కష్టపడి 10  కూరలు చేసిన.. దేంట్లో ఉప్పు తగ్గిందో చెపుతాడు.. నీకు వళ్ళుమండి "మీరు అస్సలు మెచ్చుకోర.. కరెక్ట్ గా చేసినవి కనిపించవా??" అని అడిగితేయ్.."సారీ తప్పులని పట్టుకోవటమే నా వృతి" అని సమాధానం వస్తుంది.
నిత్య :- అమ్మో ఐతేయ్ వీడు కూడా వద్దు.. మూడవ వాడు
"performance test engineer".

విద్య:- వీడు ఇంకో ఐటెం. నువ్వు ఎంత పని చేసిన.. అదేంటి ఇంత ఎక్కువ టైం తీసుకున్నావ్.. అయిదు నిమిషాలలో చేసే పనిని ఎందుకు 10  నిమిషాలలో చేస్తున్నావ్.. పని చెయ్యటం ముఖ్యం కాదు.. ఎంత తక్కువ టైం లో చేసామన్నదే ముఖ్యం.. అని చీల్చి చెండాడుతాడు.
నిత్య :- ఎంటే.. అస్సలు software  ఇంజనీర్ నే పెళ్లి చేసుకోకూడదా ఏమిటి?
విద్య :- అల అని ఎవ్వరు చెప్పరే.. వీళ్ల లో వుంటారు.. "
developers" అని.. వాళ్లు ఐతేయ్ మనకు సర్రిగా సరిపోతారు..
నిత్య :- కొంచం అర్ధం అయ్యేలా చెప్పవే..
విద్య :- వీళ్ల కోసం నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు.. అన్ని పనులు వాళ్ళ అంతట వల్లే చేసుకుంటారు.. రాక పోతీ .. గూగుల్ సాయం తీసుకుంటారు కానీ.. మాకు రాదూ అని ఏ పని గురించి చెప్పరు..వాళ్ళకి ఎంత పని చెప్పిన ఏమి అనరు.. టైం కి కాఫీ, పిజ్జాలు , ఇస్తేయ్ చాలు.. పని లో బాగా కష్టపడితేయ్, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.. "నువ్వు నిజం గా గ్రేట్, గొప్ప , కత్తి , తురం " అని పది మంది లో పోగిడితేయ్ చాలు.. వద్దు అన్న ఇంకా ఎక్కువ పని చేస్తారు..
నిత్య :- అబ్బః!!!!! సరిగ్గా మనకు కావాల్సిందీ వీళ్ళు..ఇంకా ఇలాంటి సంబంధాల కోసం చూస్తా.. అని చెప్పింది..

ఇదండీ.. ఇద్దరు అమ్మాయిలు.. తాము ఎలాంటి software  మొగుడని చేసుకోవాలో.. జరుపుకున్న మాట మంతి.. బ్లాగ్ ప్రపంచం లో వున్నా పెళ్లి కానీ , తమకు కాబోయే.. శ్రీవారి.. గురించి కలలు కంటున్నా అమ్మాయిలకి ఉపయోగ పడుతుంది అని ఇక్కడ పోస్ట్ చేశా..

నా మాట :- నేను ఎంతో గర్వం గా చెప్పుకొని.. ఫీల్ అయ్యే.. నా డెవలపర్ జాబ్ గురించి అమ్మాయిలలో ఇంత పాజిటివ్ టాక్ వున్నందుకు బాధపడాలో.. ఆనందపడాలో అర్ధం కావటం లేదు.. అయిన హాప్పీస్ .. నా కోసం ఇద్దరు అమ్మాయిలు.. వెతుకుతున్నారు అంటే.. ఆ త్రిల్ ఏ బలే వుంది..
(కొంచం ఎక్కువ ఐతేయ్ మన్నించాలి అని ప్రార్ధన.. )

నోట్:- నాకు ఇది ఇంగ్లీష్ లో మెయిల్ లో వచ్చింది.. తెలుగు లో అనువదించ.. అక్కడక్కడ తప్పితేయ్ , నేను సొంతం గా రాసింది ఏమి ఏమిలేదు( నా మాట నాదే నండోయ్.)

26, జనవరి 2011, బుధవారం

దేశ భక్తి ని చాటటానికి , ఎలుగు ఎత్తి పాడటానికి బాష రావాల్సిన పని లేదు - నమ్మరా ఐతేయ్ ఈ పోస్ట్ ని చుడండి..

అందరికి కొంచం లేట్ గా "రిపబ్లిక్ డే విషెస్". ఇవ్వాళా మా అమ్మ గారు బెంగుళూరు నుంచి గుంటూరు కి వెళ్లారు , ఆ హడావిడి లో పోస్ట్ కొంచం లేట్ అయ్యింది.. ఇంక ఈ వీడియో గురించి చెప్పే ముందు , ఒక విషయం ని మీతో చెప్పాలి.. నేను ముంబై వెళ్ళిన ఫస్ట్ డే నే, సినిమా కి వెళ్ళాను.. సినిమా స్టార్ట్ అయ్యే ముందు "జన గణ మన" సాంగ్ వేసారు.. ధియేటర్ లో అందరం నుంచొని మేము కూడా శ్రుతి కలిపాము.. ఏంటి ఇవ్వాళా ఏమైనా స్పెషల్ ఆ అని అడిగితేయ్, నా పక్కన అతను "లేదండి ఇది ఇక్కడి rule " అని చెప్పాడు..
                            తర్వాత చాల సినిమాలకి వెళ్ళాను (అంటే నాకు వారానికి కనీసం ఒక సినిమా అయిన చూడకపోతేయ్ ఏదో లా వుంటుంది ) , ప్రతి చోట ఆ కాంప్లెక్స్ వాడు వాడి స్టైల్ లో "జనగణమన" ని ప్రెసెంట్ చేసేవారు.. అంటే "PVR " వాడు ఒకలా, "BIG సినిమాస్" వాడు ఒకలా , "FAME మూవీస్" వాడు ఒకలా.. ఇలా వాళ్ళ styles లో వేసేవారు..
ఇప్పుడు recent గా bigcinemas వాడు చేసిన "జనగణమన" వెర్షన్ నాకు బాగా నచ్చింది.. ఒక రకమైన బావోద్వేగానికి లోను అయ్యాను ఈ పాట. చూసి.. Hatsoff bigcinemas అండ్ ఈ పాట ని తెర పైకి ఎక్కించిన వారికీ ధన్యవాదాలు..

14, జనవరి 2011, శుక్రవారం

మా ఇంట సంక్రాంతి


అందరు.. గతం గతః  అంటారు కానీ.. గతాన్ని తలుచుకుంటే ఎంత బావుంటుందో.. కదా, అందమైన బాల్యం, అమ్మ మూరిపాలు, అల్లరి ఆటలు.. అబ్బో ఒకటి ఏమిటి బలే వుండేది లే.. ఇంతకు ముందు నేను చెప్పిన్నట్టు.. సంక్రాంతి సెలవలు రాగానే.. మేము, చిన్న అమ్మ వాళ్ళం, అత్త వాళ్ళు అందరం తాతయ్య దగ్గరకు వెళ్ళేవాళ్ళం.పండగకి ఒక 3 రోజులు ముందుగానే సందడి మొదలు అయ్యేది..  అరిసెలు, చక్రాలు, మిఠాయి, లడ్డులు వండటం లో అమ్మ , అత్త లు అంత బిజీ గా వుండేవాళ్ళు.. మేము(అంటే పిల్లలు అందరం) కూడా నాన్న, బాబాయి.. పిండి దంచుతుంటే, వాళ్ళకి నీళ్ళు, టీ , కాఫీ ఇవ్వటం లో బిజీ గా వుండేవాళ్ళం. చుట్టూపక్కల అంత వుండేది మా చుట్టాలే.. వాళ్ళు కూడా తల ఒక చెయ్యి వేస్తూ , కబుర్లు చెప్తుంటే బలే వుండేది.
                                                     
ఇక్కడ బియ్యపు పిండి దంచుతుంటే, ఆ పక్క ఆడవాళ్లు బెల్లపు పాకం చేసేవారు.. మేము , పాకం దగ్గరికి , పిండి దగ్గరికి అటు ఇటు తిరుగుతూ.. పిండి ని పక్కని బట్టలకి పూసుకుంటూ, తిట్లు తింటూ.. సిగ్గులేకుండా ఇంకా ఎక్కువ గొడవ చేసేవాళ్ళు..  అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చెయ్యి ఎత్తితేయ్.. దీవార్ సినిమా లో డైలాగ్ లా మేము కూడా "మేరి పాస్ తాతయ్య హై" అని చెప్పి వాళ్ళని బయపెట్టే వాళ్ళం. అరిసెలు చేయాలి అంటే ముందు చలిమిడి చెయ్యాలి కదా.. అలా చేస్తున్నప్పుడు మేము కూడా ఒక చెయ్యి వేసేవాళ్ళం.. సహాయం చెయ్యటం  కోసం అనుకుంటే మీరు పొరపడినట్టే..చెయ్యి పెట్టినట్టే పెట్టి ఒక పెద్ద ముద్ద ని తీసుకొని.. పరుగో పరుగు.. అల అ చలమిడి ముద్ద ని గడ్డివాము మీద తింటూ వుంటే ఆ మాజా నే వేరు.. ఇంక బూంది , లడ్డులు చేస్తున్నప్పుడు కూడా ఇలా మా గొడవ మా తాత గారి సహకారం తో నిరాటంకంగా లేతబెల్లపు పాకం లా సాగుతూఊఊఉ  వుండేది..

భోగి రోజున మా బోగాలు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ముందే రోజే.. ఇంట్లో వున్న పాత సామానుని., బర్రెల కొట్టం లో పాత తట్టలని పోగు చేసి పెట్టేవాళ్ళం. పొద్దునే ఐదు కల్ల లేపేవారు.. అందరం కలిసి ఇంటి వెన్నకి వెళ్లి, పోగు చేసిన సామాను మీద కిరసనాయులు చల్లి నిప్పు పెట్టె వాళ్ళం.. మా ఇంటి వెనకాల అంత పోలలే ఉండేవి.. పొగమంచు లో పచ్చ్చదనం కనిపించి కనిపించక ..ఎంత బావుండేదో.. అంత చలి లో.. తాతయ్య , నేను ఒకే రగ్గు కపోకొని.. చలి కాచుకునే వాళ్ళం..అన్ని కోట్లు ఇచ్చి ఆ ఆనందం ఇప్పటికి రాదూ.. ఈ లోపు అమ్మ వాళ్ళు వేడి వేడి కాఫీ తెచ్చేవారు.. తరవాత ఆ బోగి మంటలలో పెద్ద పెద్ద కాగులు పెట్టి నీళ్ళు కాచుకొని స్నానాలు కానిచ్చే వాళ్ళం. ఇవ్వన్ని కాకుండా ఇంటి ముందు ముగ్గులు , హరిదాసు హడావిడి అంత చెప్పిన తక్కువే..

సంక్రాంతి పండుగ రోజున..అందరికి కుంకుడు రసం తో తలస్నానం చేపించేయ్ వారు, అప్పటి దాక మా పార్టీ వుండే తాత గారు.. ఆ ఒక్క రోజు మటుకు అమ్మ వాళ్ళ తో కలిసి మాతో బలవంతం గా తలస్నానం చేపించేయ్ వారు.. కొత్త బట్టలు వేసుకొని  వచ్చే లోపు, అమ్మ వాళ్ళు బాండి పెట్టి గారెలకి రంగం సిద్ధం చేసే వారు.. అల వేస్తూ వుంటే మేము ఇలా లాగిస్తూ వుండేవాళ్ళం.. అమ్మ ఏమో పిండి ని కవర్ మీద పెట్టి, చక్కగా గా వత్తి , బాండి లో వేస్తే.. చిన్నమ్మ వాటిని నూనె లో వేగించి బయటకు తీసేది.. తీసిన వాటిని మా అత్త మాకు ప్లేటులో పెడుతువుండేది..  ఇక్కడ మా తాత గారు ఎంటర్ ది డ్రాగన్ లా వచ్చి పిల్లలకి పోటి పెట్టేవారు.. ఎవరు ఎక్కువ గారెలు తింటే వాళ్ళకి అన్ని గాలిపటాలు కొనిపిస్త అని చెప్పారు.. ఇంక మేము ఆగుతామా.. "కళ్యాణ్ రామ్ కత్తి స్టైల్ లో " పది , ఇరవయ్ , లెక్కమీ ఓపిక " అన్నట్లు , సెహ్వాగ్ బెట్టింగ్ చేసిన్నట్టు , వాయులు వాయలూ తినేసే వాళ్ళం.. ఇసుగు పుట్టి ఆడవాళ్లు ఇంక ఎన్నిరా . అని ఇసుకు కుంటే  , మా తాత.. "పిల్లలకి దిష్టి పెడతారే" అని గయ్యిన లేగిసే వాళ్ళు..ఇవి కాకుండా..నాకు ఇష్టమైన కొత్త బియం తో చేసిన "పరమాన్నం" కూడా వుండేది. బుజ్జి పొట్టకి ఆ రోజుల్లో ఎన్ని కష్టాలో పాపం.. కొత్త బియం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా వున్నారా ? వున్న లేకపోయినా చెప్పటం నా బాధ్యత.. పొలం నుంచి తెచ్చిన వరిని , రోట్లో వేసి దంచి, పొట్టును మటుకు తీసేసేవారు.. ఏమ్మాతరం పాలిషింగ్, గీలిచింగ్ చెయ్యని మంచి బియం అన్నమాట..  

ఇంక చివరి రోజు , ఒక నాటు కోడి ని తెచ్చేవారు.. ఒక సరి ఏమైంది అంటే.. పండగ కి ఒక రెండు రూజుల ముందే కోడి ని తెచ్చారు.. ఆ రెండు రోజులలో .. ఆ కోడి మాకు మచ్చిక అయ్యింది.. చివరని రోజున చంప పోతుంటే పెల్లంధారం ఒకటే ఏడుపు.. ఇంకేం చేస్తారు.. మా కోసం దానిని చంపలేదు.. ఇంక ఇలాంటివి చాల తీపి గుర్తులు వున్నాయి.. అందరికి పండగలు అంటే వాళ్ళ ఊరు, ఇల్లు గుర్తుకు రావ్వొచ్చు.. కానీ నాకు మా తాత గారే గుర్తుకు వస్తారు.. అంతగా .. చివరికి నేను ఇంజనీరింగ్ చెన్నై లో చేరకకూడా.. సంక్రాంతికి గుంటూరు వెళ్ళకుండా , డైరెక్ట్ గా మా తాత దగ్గరకే వెళ్ళే వాడిని.. ఒక పీడా టీవీ పట్టే డబ్బా నిండా తినుబండారాలు చేసి నాతో పటు స్టేషన్ కి వచ్చి మరి ట్రైన్ ఎక్కించేవారు.ఇవి కాకుండా.. మా అమ్మ చేసే califlower  పచ్చిడి అంటే నాకే కాదు మా హాస్టల్ లో వుండే వాళ్ళ అందరికి ప్రాణం..

ఇవ్వని కాకుండా సంక్రాంతి ముగ్గులు, పక్కంటి వాళ్ళతో పోటి కోసం అమ్మ తో కొట్లాడి మరి ముగ్గులు వేయించేయ్ వాళ్ళం వాటిని మనం ఇంకో పోస్ట్ లో చూదాము..

ఇంక ఇలాంటివి చాల సంగతులు వున్నాయి.. రేపు సంక్రాంతి కదా గుర్తుకువచ్చి ఇవ్వని పోస్ట్ చేశా... ఏదో ఆఫీసు లో వుంది హడావిడి గా రాసాను.. చిన్న చిన్న తప్పులు  వుంటాయి.. చూసి చూడనట్టు వుండాలి.. :)

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..సంక్రాంతి మా లక్ష్మి అందరికి శుభాలు కలుగ చెయ్యాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న..
అన్నటు మరిచాను, పోయిన ఏడాది.. సంక్రాంతి మీద ఒక కవిత రాసాను.. అప్పట్లో తెలుగుని ఇంగ్లీష్ లో రాసే వాడిని.. ఏమి అనుకోవద్దు.. ఆ కవిత ని చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.. 

31, డిసెంబర్ 2010, శుక్రవారం

నా మిత్రులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు


2010  నా జీవితం లో ఒక మరుపురాని సంవత్సరం . కాకపోతేయ్ ఆంధ్ర లోనే ఎప్పుడు చుసిన బందులు , గొడవలు... 2011  లో అయినా గొడవలు లేకుండా అందరం సంతోషం గా వుండాలి అని బాబా ని కోరుకుంటున్న  . 

ఇక నా బ్లాగ్ మిత్రులు అయినా, శిశిర, అపర్ణ , శివరంజని , నేస్తం అక్క , రెడ్డి గారికి , వేణు రామ్ , ఆదిత్య , ప్రవీణ్ , హరి , అశోక్ రెడ్డి .. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీకు , మీ కుటుంబాలకి.. అంత మంచి , శుభం జరగాలి అని కోరుకుంటున్న ..

అందరికి శుభం జరగాలి అని విష్ చేస్తూ.. మీ శశిధర్

15, డిసెంబర్ 2010, బుధవారం

అమ్మలార.. జిందాబాద్..




మొన్న ఒక పేపర్ లో చదివిన వార్త ఇది. ఆ వార్త చదివాకా.. మహిళా నీకు జోహారు అని అనకుండా ఉండలేం..

సాదారణం గా ఒక సగటు మనిషి  తట్టుకునే అత్యంత నెప్పి  42   బెల్ల్స్( నెప్పి ని కొలిచే కొలమానం ఇది)  అంట. కానీ ఒక శిశువుని జన్మ నివ్వటానికి ఆడవారు 57 బెల్ల్స్  నెప్పి ని తట్టుకోవాలి.  అందుకే అంటారు ఏమో.. జన్మ ని ఇవ్వటం .. ఆడదానికి పునర్జన్మ లాంటిది అని..

బాపు - రమణ చెప్పినట్టు , మొగుడు - పెళ్లలలో ఇద్దరు సమానమే.. కానీ మొగుడు కొంచం ఎక్కువ సమానం లాగా.. ఇంత నెప్పి ని ఓర్చుకొని జన్మ ని ఇవ్వటం వల్లనేమో.. పిల్లలకి అమ్మ నాన్న మీద సమానమైన ప్రేమ చూపిస్తారు.. కానీ అమ్మ కి ఇంకొంచం ఎక్కువ సమానం అన్నమాట.. :)

7, డిసెంబర్ 2010, మంగళవారం

నాకు తెలిసినంత లో ప్రశాంతం గా వుండటం ఎలా అంటే..???


 మానసిక ప్రశాంతత వుంటే జీవితం సాఫీగా వెళ్ళినట్టే, కానీ మనలో ఎంత మంది ప్రశాంతం గా వున్నారు..లేకపోతేయ్ ఎందుకు లేరు...అస్సలు మన సమస్యలు ఏమిటి అని ఒక్కసారి
అలోచించి మనం ఇలా చిరాకు గా / లేక బెంగ గా  వుంటే అవ్వన్నీ పరిష్కారం అవుతాయి అంటే ఇలాగే చిరాకు గా వుండండి.

ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పక వుంటుంది, పరిష్కారం లేకపోతేయ్ అస్సలు అది సమస్యే కాదు.. నేను ఇక్కడ మీ సమస్యలకి పరిష్కారం ఏమి చెప్పను కానీ , ఆ సమస్యల వల్ల వచ్చే చిరాకులని ఎలా తరమికొట్టాలో చెపుతా...

-->మనసు ప్రశాంతం గా లేకపోతేయ్ – ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ జీవితం లో ఆనందం గా గడిపిన క్షణాలని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.. లేకపోతేయ్ మీ ప్రాణ స్నేహితడుకి మీ సమస్యని చెప్పండి.. దానితో పాటు మీ మనసు కూడా ఏమి బాలేదు అని చెప్పండి..మీ స్నేహితుడు వెంటనే మీకు సాంత్వన కలిగించేయ్ మాట చెపుతారు.. ఇంకా నీకు నేను వున్నా అని చెప్పే స్నేహితుడు మాటలే కొండంత అండగా గా వుంటాయి..

--> మీరు చిరాకు  లో వున్నారు,,అప్పుడు మీ అమ్మ నాన్నలో , మీ ఆవిడో ఫోన్ చేస్తే. వీలు ఐతేయ్ ఫోన్ తీసి , మల్ల చేస్తాను అర్జెంటు పని లో వున్నా అని చెప్పండి.. చాల మంది ఫోన్ కట్ చేయటమో.. లేకపోతేయ్ ఫోన్ ఎత్తి తమ చిరాకు అంత ఫోన్ లో చూపిస్తారు.

--> ఆఫీసు లో ఎక్కువ పని వుంది , మీకు నేను ఈ పనులన్నీ చేయగలన అని ఒక చిన్న అనుమానం వచ్చింది అనుకోండి. వేంటనే మీ కుటుంబం ఫోటో చుడండి.. నన్ను నమ్మండి మీకు వేంటనే కొండతంత బలం రాకపోతేయ్ ఒట్టు.

--> నా లాగా బ్రహ్మచారులు  ఐతేయ్ , ఇంటికి వెళ్ళగానే సుబ్బరంగా వంట వండేసేయండి. స్త్రెస్స్ మొత్తం అల రిలీజ్ అయ్యిపోద్ది.. మీకు పెళ్లి ఐతేయ్ , హ్యాపీ గా వైఫ్ కి వంట లో సాయం చేయండి.. లేకపోతేయ్ వంటిటిలో వుంది కనిసం కబుర్లు అయిన చెప్పండి.. అంతేయ్ కానీ.. టీవీ చూస్తూ విలువైన టైం లో వేస్ట్ చెయ్యవద్దు.

--> వీకెండ్స్ లో ఇంటి పని తప్పితేయ్ ఇంకా వేరే పని పెట్టుకోవ్వదు.పెళ్లి అయిన వారు.. నెల లో రెండు వారలు అయిన మీ బాగస్వామి కి నచ్చేలా ప్లాన్ చేసుకోండి..ఇంకా చిన్న పిల్లలు వుంటే వాళ్ళతో గేమ్స్ ఆడండి.

--> చివరి గా ఒక విషయం, మనం పని చేసీ కంపెనీ కంటే మన కుటుంబం ఎంతో ముఖ్యం .. ఇది కాకపోతేయ్ ఇంకో కంపెనీ.. కానీ కుటుంబం అల కాదు.. జీవితానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదు
ఇంకా చాల .. ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఫాలో ఐతేయ్ మనం ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ వుంటాం..

నోట్:- కొంచం క్లాసు ఎక్కువ పీకానా ??? స్నేహితుడికి నాలుగు నెలలల క్రితం పెళ్లి అయ్యింది.. పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు చూసిన స్త్రెస్స్ స్త్రెస్స్ అంటున్నాడు.. వాడికి ఒక క్లాసు పీకి , అదీ క్లాసు ని ఇక్కడ రేపెఅట్ చేశా.. 

ఈ సారి ఒక కామెడీ సంఘటనతో మీ ముందు కు వస్తా..

28, నవంబర్ 2010, ఆదివారం

ప్రియురాలి మీద ఒక చిన్న కవిత

అప్పుడే పడుతున్న తొలకరి జల్లు ని చూస్తూ.. తన హృదయ నెచ్చలి గురించి ఎలా ఒక అబ్బాయి ఎలా తలుచుకుంటాడు, అని ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈ కవిత రాసాను..



నీ  మువ్వల  సవ్వడి  లాంటి  ఈ  వర్షపు  జల్లు ...
నీ  అందమైన  నవ్వు ని మరిపించే  ఆ  హరివిల్లు ...
నీ  సొగసైన  కురులను  జ్ఞప్తికి  తెచ్చే  ఆ  నల్లటి మబ్బు తెరలు ...
నీ  సాంగత్యం  లో  హాయిని  గుర్తుకు తెచ్చే  ఈ  మలయ మారుతాలు ...
ఏమని  చెప్పను ఎలాగని చెప్పను.. పడుతున్న ఈ తొలకరి జల్లు లో అడుఅడుగున్నా నీ జ్ఞాపకాలే..


నోట్:-ఇలాంటి కవితలు ఇంతక ముందు రాసే వాడిని.. కానీ నా స్నేహితులు ఎవరు రా ఆ అమ్మాయి అంటే.. నేను ఎవరు లేరు.. నా ఒహలకు రూపం అంటే ఒక్కడు నమ్మే వాడు కాదు.. అందుకే రిస్క్ ఎందుకు లే.. అని రాయటం మానివేస.. ఇది నేను ఇక్కడ ఎందుకు చెపుతున్నాను అంటే. మీరు కూడా నేను ప్రేమ లో వున్నా అని ఫిక్స్ అయ్యి.. కామెంట్స్ పెదతారు ఏమో అని ముందు చూపు అన్న మాట..

చిన్న సహాయం :- పైన నేను చెప్పిన పోలికలతో ఎవరు అయినా అమ్మాయి  కనపడితేయ్ నాకు చెప్పండి.. వెంటనే సంబంధం ఫిక్స్ చేయతంకి మా అమ్మ ని నాన్న ని పంపిస్తా.. :)  ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి..

22, నవంబర్ 2010, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జెండా ఎలా ఉంటుందో మీకు తెలుసా...?

అస్సలు ఒక రాష్ట్ర అవతరణ ఎందుకు చేస్త్తారు..? ఒకే బాష మాట్లాడి, ఒకే సంప్రదాయాన్ని పాటించే వాళ్ళ అందరిని ఒక రాష్ట్రము లాగా చేసారు.. మనం మన తెలుగు వాళ్ళు అందరు కలిసి ,ఎంతో కష్టపడి మనకంటూ ఒక రాష్ట్రాన్ని సంపాదించుకున్నము . తెలుగు వాడు అంటే మద్రాసీ అనుకుంటున్న తరుణం లో మన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. అలాంటిది ఇప్పుడు కొంత మంది రాజకీయ నాయకుల కుటిల రాజికీయాల వాళ్ళ..మరల నేను తెలుగు వాడిని అంటే.. , మీది కోస్తా లేక తెలంగాణా అని అడిగేల చేసుకున్నాం.. ఆ విషయాల లోకి నేను పోవటం లేదు.. ఎన్ని గొడవలు వున్నా.. అవతరణ వేడుకలు అనేది జరగాలి.. కానీ జరిగింది ఏమిటి..?


ఆంధ్ర లో అవతరణ రోజున జరిగిన గొడవల్ని నేను మర్చిపోలేను. అస్సలు రాష్ట్రాని ప్రేమించటం అంటే ఏంటో కన్నడ వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.. మనలానే కన్నడ వాళ్ళకి November 1st   రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాళ్ళు ఎంత గ్రాండ్ గ చేసుకున్నారు అంటే.. ఎక్కడ చూసినా కానీ కర్ణాటక జెండాలే.. ఇన్ఫోసిస్ ,Accenture, IBM లాంటి ఆఫీసుస్ మీద కూడా కర్నాటక జెండాలు ఎగురవేసారు..
మన వాళ్ళు సరే సరి.. హైదరాబాద్ లో అంటే తెలంగాణా గొడవ అనుకుందాం.. మరి విజయవాడ , గుంటూరు , వైజాగ్ లాంటి సిటీస్ లో ఎందుకు చేయలేదు..? చేసిన మన భారత జెండా ఎగురవేసారు కానీ.. మన  జెండా ఎక్కడ ఎగురవేసారు? అస్సలు మనం రాష్ట్రాని కంటూ ఒక జెండా నే లేదా..

ఎంత మందికి మనం రాస్త్రానికి అంటూ ఒక ప్రత్యేక జెండా వుంది అని తెలుసు..? . అస్సలు ఈ పోస్ట్ నేను రాయటానికి కారణం ఏంటో తెలుసా.. మా ఇంటి దగ్గర వున్నా ఒక ఇస్త్రీ బండి..  నిజం.. November 1st ఆ ఇంస్త్రి బండి అబ్బాయి తన బండిని ఒక కర్ణాటక జెండా గ మార్చివేశాడు. ఇదిగో ఈ ఫోటో చుడండి మీకే తెలుస్తుంది.అప్పుడు నాకు అనిపించింది మన రాష్ట్ర జెండా ఎంటా అని.. సరే అని మా తమ్ముడు కి ఫోన్ చేశా , ఏరా సెలవ మీకు ఇవ్వాళా అంటే.. సెలవ ఎందుకు అని అనడిగాడు.? అలా వుంది మన పరిస్థిది..



మన రాష్ట్రానికి వున్నా జెండా ని నా చిన్నప్పుడు విజయవాడ ప్రకాశం బ్యరెజీ దగ్గర చూసా. నీలం రంగు లో వుంటుంది.. గూగుల్ లో కూడా వెతికా .. కనపడుతుంది ఏమో అని.. లేదు.. ఆంధ్ర ఫ్లాగ్ అని టైపు చేస్తే.. ఏదో ఏదో చూపిస్తోంది.. ఎవరి దగ్గర అయిన ఆంధ్ర ఫ్లాగ్ పిక్చర్ వుంటే నాకు పంప గలరు.

రాధా గారికి పేద్ధ థాంక్స్ అండి.. మీ వల్ల నాకు ఇవ్వాళా ఆంధ్ర ఫ్లాగ్ చూసే అదృష్టం కలిగింది.. ఇది కరెక్ట్ , ఏమో తెలియదు... కానీ ఈ జెండా ని చూస్తున్నప్పుడు చాల మంచి ఫీలింగ్ కలిగింది.. 

ఇది అండి ఇప్పటి వరుకు నాకు అందిన సమాచరం ప్రకారం.. మన రాష్ట్ర జెండా ఇది..



15, నవంబర్ 2010, సోమవారం

అమ్మ కి ఆసలు అర్ధం ఏమిటి.. అస్సలు రూపం ఏమిటి...

ఈ మధ్య కాలం లో నేను స్టొరీ చదువుతూ.. నాకు తెలియకుండా.. కళ్ళ వెంట.. చివర్లో నీళ్లు తెప్పించిన కధ ఇది..
"అమ్మ" గురించి ఎవరు ఎన్ని సార్లు రాసిన.. ఎన్ని సార్లు చెప్పిన.. యింక వినాలి చదవాలి అని అనిపిన్స్తుంది.. అదేయ్ "అమ్మ" పేరు లో మహత్తు..
                  ఈ ప్రపంచం లో అమ్మ ఒక్కటే ముందుగ తన బిడ్డ గురించి అలోచించి. తర్వాత తన గూర్చి ఆలోచిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతేయ్ ఎన్నో.. అస్సలు నన్ను ఇంత గా కదిలించిన కధ ఎంట అనుకుంటున్నారా.. ఇది ఇక్కడ పబ్లిష్ చేస్తున్న..  పిక్చర్ మీద క్లిక్ చేస్తేయ్. చదవటానికి సులువు గా వుంటుంది..
కధ చివర్లో.. "అరేయ్ అమ్మ కి పూలు పూచాయి రా , అమ్మ మెత్తగా వుంది రా" అని ఆ బాబు చెపుతుంటే.. ఎందుకో ఆ సన్నివేశాన్ని ఊహించి.. అప్పుడు ఆ మాతృమూర్తి.. హృదయస్పందన ఎలా వుంటుందో.. అని ఆలోచించ గానే.. నా కళ్ళ వెంట నీరు వచ్చేసింది.. 

నిజం గా ఇంత గొప్ప గా రాసిన.. శ్రీనివాస్ గారికి.. నా వందనాలు..

7, నవంబర్ 2010, ఆదివారం

నేను నా వంటలు - 1

టొమాటో - ఉల్లిపాయ పాస్తా  :-
 
రోజు బీరకాయ , పప్పు, క్యాబేజీ, సొరకాయ, వగైరా వగైరా కూరల వండి విసుగు వచ్చేసింది.. సర్లే వెరైటీ గా వుంటుంది అని పాస్తా  చేశా.. ప్రాసెస్ కొంచం చిన్నదే అయినా నూడిల్స్ తో పోలుచుకుంటే కొంచం టైం ఎక్కువ పడుతుంది.. కాకపోతేయ్ నూడిల్స్ తో పోలిస్తే రుచి బావుంటుంది, ఆరోగ్యకరం కూడా.

పాస్తా ఇప్పుడు అన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి.. రెడీమేడ్ గా వస్తున్నా పాస్తా కంటే విడిగా వున్నా గోధుమ , రైస్ తో చేసిన పాస్తా నే తీసుకోండి. మైదా తో చేసిన దానిని తీసుకోవద్దు

ఏంట్రా వీడు ప్రాసెస్ చెప్పకుండా కహాని కొడుతున్నాడు అనుకుంటున్నారా.. వస్తున్న.. వస్తున్నా..

మెట్టు(అంటే స్టెప్ ని తెలుగు లో) ఒకటి - 
ఒక గ్లాస్ (ఇద్దరికి 350ml గ్లాస్)  పాస్తా ని తీసుకొని..శుబ్రం గా కడగండి..తర్వాత.. పోయి  మీద ఒక గిన్నెలో నీళ్లు  పోసుకుపెట్టి వేడి చెయ్యండి.. ఆ నీళ్ళలో పాస్తా ని వేయండి.. పాస్తా కంటే కొంచం పైకి వచ్చేలా నీళ్ళు వుందేలో చూస్కోండి.. నీళ్ళు ఎక్కువ అయినా పర్వాలేదు.. తక్కువ ఐతేయ్ నే కష్టం..

మెట్టు రెండు :-
 అలా ఒక పది- పదిహేను  నిముషాలు బాగా ఉడికించాలి..ఈ  పది నిమిషాలలో మనం ఒక మూడు టొమాటో లని.. ఒక ఉల్లిపాయని.. తరిగి పెట్టుకుందాం.

మెట్టు మూడు :- 
ఇప్పుడు ఆ గిన్నలో వేడి నీళ్ళు  అన్ని ఓంపేసి..  చన్నీలు పోయండి.. అలా ఆ చల్ల నీళ్ళలో వుడికిన పాస్తా ని ఒక అయిదు నిముషాలు నాన నివ్వండి.. అవి నానుతున్న టైం లో మనం చేయాల్సిన పని ఒకటి వుంది.. అది ఏంటో మెట్టు నాలుగు లో చుడండి..

మెట్టు నాలుగు :- 
బాండి తీసుకొని కొంచం నూనె వేసి.. నూనె వేడి అయ్యాక.. అల్లం - వెల్లులి ముద్ద, కొంచం గరంమసాల, వుల్లిపాయల వేసి కలిపి..
ఉల్లిపాయ మాగక.. టొమాటో ముక్కలు వేసి.. మూత పెట్టి.. ఒక అయిదు నిముషాలు.. టొమాటో ని ఉడకనివ్వండి..

మెట్టు అయిదు :- 
టొమాటో ఉడికాక..ఇప్పుడు మనం నాన పెట్టిన పాస్తా లో నీళ్ళు పారపోసి..పాస్తా ని మటుకు బాండి లో వేసి.. గరిటతో బాగా కలియ పెట్టండి.. ఇలా ఒక అయిదు నిమషాలు చేసి.. స్టవ్ కట్టేయండి..

వేడి వేడి టొమాటో పాస్తా రెడీ.. ముందుగానే టొమాటో వెసం కాబట్టి .. సాస్ తో పని లేదు..

నేను పాస్తా చేసినప్పుడు చేసిన ఫొటోస్ పెట్టాను చుడండి.. మనం ఫుడ్ decoration లో కొంచం వీక్ ..


29, సెప్టెంబర్ 2010, బుధవారం

వర్షం తో నా కష్టాలు - పార్ట్ -2



ముందు పోస్ట్ లో వడగళ్ళు పడ్డాయి అని చెప్పా కదా.. తర్వాతి రోజున స్కూల్ కి వెళ్లి "అరేయ్ మా ఇంట్లో లో వడగళ్ళు పడ్డాయి తెలుసా అని" ఒకటే హడావిడి చేయాలి డిసైడ్ అయ్యా. ఐతేయ్.. వెంటనే మా స్నేహితులు నిజమా చా కోతలు  కోయి కోయి అన్నారు అంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదా.. అందుకే వెంటనే కింద పడి వున్నా వడగళ్ళ లో కొన్నిటిని తీసుకొని నా బాగ్ లో వేసుకున్న..
                    కనీసం ఒక కవర్ లో పెట్టాలి అని పెద్ద ఆలోచన వచ్చే వయసు కాదు కదా.. :(. ఇప్పుడు మన కథ లో సన్నివేశం తర్వాతి రోజు ప్రోదున్నే అన్నమాట. స్కూల్ టైం అవుతుంది అని హడావిడి గా రెడీ అవుతూ.. నిన్న పడిన  వర్షాన్నిగురించి నా ఫ్రెండ్స్ ముందు ఏమని గొప్పలు చెప్పాలా??? అని ఓ తెగ ఆలోచిస్తుంటే..అమ్మ ఏమో నా బాగ్ తేవటం కోసం ఇంట్లో కి వెళ్ళింది. ఒక అయిదు నిముషాలు తర్వాత పేద్ద సౌండ్ తో మెరుపు నా దగ్గర లో పడినంత ఫీలింగ్ వచ్చింది. ఎంటా ఆ శబ్దం అని ఆలోచిస్తుంటే... ఈ సారి సౌండ్ తో పాటు నా వీపు మీద నెప్పి కూడా పుట్టింది.. చూస్తే బాగ్ తో అమ్మ నా వీపు విమానం మోత మోగలే కొట్టింది.  వెంటనే నేను " నిన్న నే గా కొట్టను అన్నావ్" మరల ఎన్టింది యువర్ హొనౌర్ అని పెద్ద గా అరిచే లోపే.. "ఏంట్రా ఇది బాగ్ అంత తడి తడి గా వుంది.. వర్షం పడుతుంది అని నేను పైన పెట్ట కదా..మళ్ళ ఎందుకు తడి అయింది నువ్వు ఏమైనా చేసావా? " అని అడిగింది.. అప్పుడు గాని మన మట్టి బుర్ర వెలగాల... వడగళ్ళు కరిగి.. నా బాగ్ తో పాటు నా బాగ్ కింద పెట్టిన తమ్ముడి బాగ్ కూడా తడిసిపోయింది అని.. తర్వాత సీన్ మీ ఊహ కే వదిలేస్తున్న..

ఇలా చిన్నప్పుడు వర్షం వాళ్ళ రెండు సార్లు అమ్మ చేతిలో లో తాయిలం తిన్న.. సో వర్షం తో నేను కటిఫఫ్ .. అలా కటిఫ్ చెప్పాను అని వర్షం నా మీద వేరే లా పగ తీర్చుకుంది..

సరిగ్గా రెండు years  క్రితం.. నాకు బెంగుళూరు నుంచి ముంబై కి transfer  అయ్యింది.. కంపెనీ వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసారు.. అది జూన్ మాసం .. ముంబై వర్షాల గురించి చెప్పాలి అంటే.. జూన్ , జూలై , ఆగష్టు , ఈ మూడు నెలలో అందరి దగ్గర గొడుగులు వుంటాయి.. వర్షం పాడనీ రోజు ఉండదు అంటే అతిసయ్యోక్తి  కాదు.. మనకు ఇది అంత తెలియదు.. ముంబై కి బయలుదేరా..  యింక ముంబై లో ఇంకో   10 నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అనగా.. ఫ్లైట్ మళ్ళ పైకి తీసుకెళ్ళారు.. ఏంట్రా అంటే.. ముంబై లో అప్పుడు భారి వర్షం అంట.. లాండింగ్ కి చాన్సులు తక్కువ వున్నాయి అని ముంబై సిటీ పైన ఒక 30  నిముషాలు.. అలా ఫ్లైట్ ని తిప్పుతూ వున్నారు.. మధ్యలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ లా.. ఉరుమల వల్ల ఫ్లైట్ పైకి కిందకి ఊగుతూ వుంటే.. "దేవుడిని తలవని మనిషి లేడు ఫ్లైట్ లో".. ఆ సమయం లో కూడా నేను వర్షాన్ని తిడుతువున్న .. మరి నా తిట్లకో.. వాళ్ళ ప్రార్ధనలకో వర్షం శాంతించింది..

యింక ముంబై లో నా ఫస్ట్ డే గురించి ఒక పెద్ద బ్లాగ్ పోస్ట్ రాసుకోవచ్చు.. అన్ని విచిత్ర అనుభవాలు అనుభవించ.. అక్కడ...

ముంబై లో ఒక రెండు years  పనిచేయగానే.. మా కంపెనీ వల్లే.. పాపం పెళ్లి కావాల్సిన కుర్రాడు .. ఇక్కడ వుంటే మంచి సంబందాలు రావు ఏమో ఎని.. దయ తలచి.. మళ్ళ నన్ను బెంగుళూరు తిరుగు టపా కట్టించారు..రెండు ఏళ్ళు అక్కడ వుండటం వాళ్ళ ముంబై లో చాల మంది ఫ్రండ్స్ అయ్యారు.. అంత కలిసి గ్రాండ్ గా send ఆఫ్ పార్టీ ప్లాన్ చేసారు.. నేను శని వారము అక్కడి నుంచి బస్సు బుక్ చేసుకున్న.. సో మా వాళ్ళు అంత.. ఫ్రైడే నైట్ కి పార్టీ అన్నారు.. కానీ.. నా ప్రియ మిత్రుడు (వర్షం) ఇక్కడ కూడా నన్ను వదలలేదు..

ఫ్రైడే రాత్రికి స్టార్ట్ అయిన పెద్ద వర్షం.. తగ్గలేదు.. యింక ఒక్కకరే ఫోన్ చేసారు.. "మామ రావటం కష్టం వర్షం పడుతుంది" రేపు పోదున్నే కలుద్దాం అన్నారు.. శనివారం వర్షం యింక తగ్గల.. చూస్తుంటే టైం మధ్యానం అవుతుంది.. luggage  ఏమో చాల వుంది.. ఆ వర్షం లో ఆటో వాళ్ళు కూడా రావటం లేడు.. బస్సు కేమో అట్టే టైం లేదూ... ఫ్రండ్స్ నీ ఆ వర్షం లో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదూ.. ఏమిట్రా దేవుడా ఈ వర్షానికి నా మీద పగ అని ..  యింక చివరికి బాబా ని తలుచుకున్న.. ఒక 5  minutes  లో ఆటో దొరకింది.. కానీ అంత luggage తో నాతో పాటు రావటానికి ఒక్కరికి ఛాన్స్ వుంది.. అందరు వచ్చి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇద్దాము అనుకున్నది వర్షం వాళ్ళ ఇలా అయ్యింది.. :(

 బస్సు స్టాప్ కెళ్ళి పాటికి యింక వర్షం పడుతుంది.. ఎంత గొడుగు పట్టుకున్న.. తడుస్తం కదా.. వర్షం లో అలా తడుస్తూ.. luggage  మీద మటుకు కవర్ వేశా..వర్షం వాళ్ళ బస్సు కూడా గెంట లేట్ గా వచ్చింది.. ఆ పాటికి నేను సగం తడిసిపోయ.:( . వోల్వో బస్సు లో తడి బట్టలతో కోర్చుంటే వుండే నరకం.. ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. వేడి వేడి టీ తాగి నోరు  కాల్చుకున్న వాడికి బజ్జి ఇచ్చి తినమంటే.. ఎలా వుంటుందో.. దాని కంటే దారునాతి దారుణం గా వుంటుంది..

యింక నా వాళ్ళ కాకా.. వర్షం తో రాజి పడ్డ.మనం మనం ఒకటి అని.. అయిన వర్షం నా మాట వింటాం లేదూ.. ఇప్పుడు బెంగుళూరు లో యింక చుక్కలు చూపిస్తోంది.. మొన్న ఫ్రైడే (24 -10  - 2010) ఇంటికి వెల్లదాము అని బయలుదేరి అలా ఆఫీసు నుంచి బయటకి వచ్చానో లేదో.. పెద్ద వర్షం మొదులు అయ్యింది.. యింక తడుస్తూ ఏమి వెళ్తాం లే అని ఆగాను... ఆ ఆగటం ఆగటం మూడు గెంటలు దాక అలా అగేవున్న.. మీరే చెప్పండి.. ఫ్రైడే అందులో వీకెండ్ రూం కి వెళ్లి పండుగచేదాం అనుకుంటే.. ఇలా వర్షం అడ్డుపడి.. చివరికి రాత్రి పదకొండు కి .. ఇంటికి వెల్ల...  ఇలా వర్షం నాతో నిత్యం బాట్టింగ్ చేస్తూనే వుంది..

మీలో ఎవరు అయిన వర్షం లో త్రిష లాగా వర్షం తో మాట్లాడే వాళ్ళు వుంటే నా గోడు నా బాధ చెప్పాడు ప్లీజ్..






అనుభవాలు

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నేను - వర్షం


మనకు చిన్నప్పుడు వుండే ఇష్టాలు కాలక్రమేనా అవి కష్టాలు గా మారుతాయి అని అంటారు. వాన విషయంలో నాకు ఆ అనుభవం అయ్యింది.

స్కూల్ టైం లో వాన పడితేయ్ యింక మనకు పండుగే పండుగ, ఎందుకు అని అడగరే.. వర్షం లో  తడుసుకుంటూ స్కూల్ కి వెళ్తే జ్వరం వస్తుంది అని అమ్మ ఈ పూట కి స్కూల్ వద్దు లేరా అనేది..ఎంచక్కా హోం వర్క్ చేయాల్సిన పని వుండేది కాదు ఆ రోజుకి  అందుకే నాకు వర్షం అంటే చాల ఇష్టం.

                       ఒక సారి నేను 1st  క్లాసు  లో వుండగా , గుంటూరు లో పేద్ద వడగళ్ళ వాన పడింది.. అప్పటికి యింక మా ఇంట్లో fridge  లేదు.. నాకు పై నుంచి పడుతున్న వడగళ్ళ ని చూసి ఒక ఆలోచన orange  కలర్ లో వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి " నాకు rasna కావాలి అని తెగ గొడవ చేశా". వర్షం లో rasna  ఏంట్రా అని అమ్మ విసుక్కుంటే .. " వర్షం లో టీ ఎవడు అయిన తాగుతాడు , rasna తాగాలి అంటే కాల పోషణ వుండాలి" అని చెపుదాం అంటే అప్పటికి యింక "నువ్వే నువ్వే" సినిమా రిలీజ్ కాలేదు.  మన బిక్క బోహం చూసి పోనిలే అని అమ్మ rasna  కలిపి ఇచ్చింది . నేను వెంటనే వరండా లోకి పరిగెతుక్కుంటూ వెళ్లి ఆ rasna  బాటిల్ లో కింద పడుతున్న వడగళ్ళని తీసుకొని గ్లాస్ లో వేసుకొని rasna  ని కొంచం తాగుతూ  పేద్దగా "I Love  You  Rasna " అని అరిచా...

             మన అరుపు విని అమ్మ బయటకి వచ్చి నా వాలకం చూసి , గ్లాస్ లో వున్నా వడగళ్ళ ని చూసి.." వేదవ " అని వీపు విమానం మ్మోత మోగించింది.. నేను వెంటనే అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడి లా " టీవీ లో అమ్మాయి ఇలా అంటే బలే ముద్ద గా వుంది అన్నావ్... నేను చేస్తే కొడుతున్నావ్.. నీకు నేనంటే ఇష్టం లేదా అధ్యక్షా ...." అని గాట్టిగా అరిచా... అరచిన తర్వాత మా అమ్మ మీద అలిగా .

వర్షం పడుతుంది అని అమ్మ వేడి వేడి గా పకోడీ మరియు పాయసం చేసింది.. " నాని గా టిఫిన్ తిందువు రా అని పిలచినా మనం అలిగాం కదా.. నేను అస్సలు మాట్లాడల లేదు.. ఆ వైపు కూడా చూడలేదు. అమ్మ నన్ను ఒక ఐదు నిముషాలు పిలిచి సర్లే ని ఇష్టం ఐతేయ్ తిను లేక పోతేయ్ లేదు అని పిలవటం మానేసింది. నా తమ్ముడు మటుకు "అన్న వైపు నుంచో వాలో.. అమ్మ వైపు నుంచోవాలో చాల సేపు అలోచించి.. పాయసం వాసన ప్రభావం వాళ్ళ అమ్మ వైపు తప్పు లేదు అని తీర్మానించి.. శుబ్రంగా వెళ్లి పలహారాల  పని పడుతున్నాడు..

పిలుస్తారు ఏమో అని ఒక పది నిముషాలు చూసా, అస్సలు నేను ఒకడిని వున్నా అన్న విషయం తెలియనట్టు గా వాళ్ళ పని లో వాళ్ళు వున్నారు.  పాపం నాన్న గారే.. నన్ను చూసి వాడిని కూడా పిలువు అని అమ్మతో అన్నారు..కానీ అమ్మ మటుకు "ఏమి అవసరం లేదు.. ఇలా చేస్తే వాడు మొండి గటం లో మార్తాడు.. మరేం పర్లేదు.. ఒక్క పూట కడుపు మాడినంత మాత్రాన ఏమి కాదు అని అన్నది.. యింక ఏ పక్షం మన దారికి వచ్చేలా లేదు అని.. నేను తగ్గా..ఏమి చేస్తాం చెప్పండి ఈ పేద్ద వాళ్ళు ఉన్నారే చిన్న వాళ్ళ కోరికలు  ఎప్పటి అర్ధం కావు అని సరిపెట్టుకున్న..

చిన్న గా వెళ్లి నేను వాళ్ళో తో జాయిన్ అయ్యా.. తల వంచుకొని.. తింటున్న.. అప్పుడు అమ్మ నా తల మీద చెయ్యి వేసి.. నాని గా కోపం గా వుందా.. అంటే.. నేను నీతో మాట్లాడునుపో.. ఊరికే కొట్టావ్ అని ఏడిచా..(ఇలాంటి టైం లోనే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది).. అమ్మ ఏమో " అల కాదు రా నాని ఆ వడగళ్ళు కింద పడ్డాయి కదా.. వాటిని తింటే కడుపు నెప్పి వస్తుంది రా..  అందుకే కొట్టా రా.. " అని చెప్పి.. వెంటనే నాన్న వైపు తిరిగి " fridge  కొనండి ఒకటి తొందరగా .. నాని కి rasna   చేసిపెట్టాలి అని చెప్పారు". నాన్న fridge  కొంటారు, నాకు బోల్డు రస్నా వస్తుంది అని చిన్న ఊహ మైండ్ లోకి రాగానే. నాకు కోపం అంత పోయి.. గాట్టిగా అమ్మని ముద్దు పెట్టేసుకున్న..

అలా ఆ రోజు వర్షం వల్ల.. మా ఇంట్లో fridge  అని వస్తువు గ్రాంట్ అయ్యింది అన్నమాట.. అందుకే అధ్యక్ష్య.. నాకు వర్షం అంటే చాల ఇష్టం..

ఇందాకట్నుంచి వర్షం అంటే ఇష్టం అని తెగ కబురులు చేపుతున్నావ్.. మరి కష్టాలు కూడా చెప్పు అని అంటారా...చెప్తా.. చెప్తా.. దాని గురించి  తర్వాతి టపా లో చెపుతా.. కానీ వర్షం వాళ్ళ నేను పడిన కష్టాలు పగ వాడికి కూడా వద్దు సుమీ..

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

మేము మా చిట్టి వినాయకుడు



 చిన్నతనం  నాకు బాగా ఇష్టమైన పండుగులు మూడు 1 ) వినాయక చవితి 2 ) దసరా 3 ) సంక్రాంతి . ఎందుకంటే ఈ మూడు పండుగలకు మేము మా చిన్నఅమ్మ(పిన్ని ని నేను ఇంతే పిలుస్తా)   వాళ్ళు  అందరం కలిసి మా తాతా గారి ఊరికి వెళ్తాం కాబట్టి .ఇంకా తాతా గారి ఊరిలో మేము అందరం పంజరం నుంచి బయట పడిన పక్షులం , చైన్ తెగిన బొచ్చు కుక్కలం. పిచ్చ పిచ్చ గా తిరిగివాళ్ళం.  అడ్డుచేప్పేవారు ఎవరు మాకు?  ఏమైనా అంటే మాకు అండ గా మా తాతా గారు సపోర్ట్ కి వచ్చేసేవారు.

                                       నేను , నా తమ్ముడు చిన్న , చిన్నమ్మ  వాళ్ళ  అబ్బాయిలు  " చిన్ను , బాబి ". నలుగురం ఒక జట్టు అన్నమ్మాట.ఒకటి ఒక సరి ఫిక్స్ అయ్యాము అంటే.. ఇంకా అంతెయ్, రచ్చ రచ్చే. చిన్న example  చెప్పనా , ఒక సారి మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయింది, అమ్మ డబ్బులు ఇవ్వు బాల్ పోయింది అంటే.. డబ్బులు లేవు గిబ్బులు లేవు అక్కడ వాడి పడేసిన "prachute " డబ్బా వున్నది దాన్నే బాల్ గా ఆడుకోండి అంది. మేము ఆ డబ్బా కి దారం చుట్టి బాల్ లా చేసి పండగ చేసుకున్నాం. బాల్ కంటే ఆ డబ్బా తోటే మజా వచ్చింది, మా తమ్ముడు కొట్టిన భారి షాట్ కి బాల్ అదేయ్ లెండి డబ్బా పోయింది. ఈసారి మా తాతా మా కోసం బాల్ కొన్నారు కానీ, డబ్బా లో వచ్చిన మజా బాల్ తో రాలేదు. ఇంట్లో అంత వెతికాం డబ్బా దొరికుతుంది ఏమో అని.. కానీ లాబం లేకుండా పోయింది. ఇంకా వెంటనే చిన్న గాడు కార్యరంగం లోకి దిగి అప్పుడే కొని తెచ్చిన పరచుటే డబ్బా లో వున్నా నూనె మొతాన్ని ఓంపేసి, దారాన్ని చుట్టి మాకు ఇచ్చాడు. తర్వాత ఏముంది ఇంట్లో వాళ్ళు కొబ్బరినూనె కోసం వెతికి అస్సలు ఆ డబ్బా నీ మిస్ అయ్యింది అనుకోని ఇంకో కొత్త parachute  కొనుకున్నారు.  ఈ విషయాన్నీ ఎవ్వరు మా అమ్మ కి చెప్పా వద్దు చేపితేయ్ అన్తెయ్ నా పని.

ఇలా పండుగల లో పని లేకుండా ప్రతి పండుగకి ఒకలే (అంటే క్రికెట్ మరియు పొలం మీద గాలి తిరుగుళ్లతో) ఆనందం గా గడుపుకుంటున్న సమయం , ఒక నొక రోజున నా బుర్ర లో మంచి ఆలోచన వచ్చింది.మనం కూడా ఎందుకు ఒక వినాయకుడి  బొమ్మని ని పెట్టి పూజ చేయకూడదు అని. దసరా కి , చవితి కి , మా ఊర్లో బొమ్మలు పెట్టి బాగా హడావిడి చేస్తారు. వాళ్ళ అంత కాకపోయినా కొంచం అయిన బాగా చేయాలి అని ఫిక్స్ అయ్యం. వెంటనే మా ఫైనాన్సు డిపార్టుమెంటు అయిన అమ్మ కి వెళ్లి అర్జి పెట్టుకున్నాం.. కానీ మా మాతృ మూర్తి కరుణ రసం కాకుండా రౌద్ర రసం తో మములని వాయించి , ముందు ఇంట్లో చేస్తున్న పూజుకి సరిగా కూర్చోవటం నేర్చుకోండి తర్వాత మీరు చేయండి అని చిన్న పాటి పెద్ద క్లాసు పీకేపాటికి మేము సైలెంట్ అయిపోయాం. కాని ముందే చెప్పా గా మేము ఒక సరి కమిట్ అయ్యాము అంటే, అమ్మ చిపిరి కట్ట తిరగాతిప్పి  కొట్టిన కూడా  మాట వినం.

అందుకని ముందు గా వినాయకుడి బొమ్మ కోసం తెగ వెతికం.. చివరికి ఒక రాయికి వినాయకుడి రూపం వున్నటు మాకు అనిపించింది. వెంటనే వెళ్లి ఇంట్లో వున్నా పసుపు తెచ్చి ఆ రాయిని కి బాగా పూసి , వినాయకుడి రోప్పం తెప్పించేసాం. ఇప్పుడ విగ్రహ ప్రతిష్ట , ఇంటి వెనకాల కొట్టం లో ఒక మూల పెట్టేసి , చుట్టుత చిన్న చిన్న రాళ్ల తో ఒక బోర్డర్ కట్టాం. పూలు పెద్ద సమస్య కాదు , మా ఇంటి వెనకాలే మల్లె పూలు తోట వుంటుంది, మా పెద్దమ్మ వాళ్ళదే . పత్రి కోసం పోలలలో తెగ తిరిగి తెలిసినవి తెలియనవి అన్ని కోసుకోచ్చం.

తర్వాత పలహారాలు ఏమి చేయాలి..అని తెగ అలోచించి ,  ఇంట్లో నుంచి పంచదార , బెల్లం , చివరికి మా తాతా మాకు కొని ఇచ్చిన కిల్లి బిల్లలని కూడా పలహారం లా మర్చేసం.  అంత అక్కడ సెట్ చేస్తుంటే మా అమ్మ ఒకటే గొడవ. " ఒరేయ్ ఇంట్లో పూజ స్టార్ట్ అవుతుంది" రండి అని.. మేము మా బుల్లి గణపతి దగ్గర అన్ని అలా సర్దేసి..ఇంటిలోకి వెళ్ళాం. పూజ అయ్యి అవ్వగానే పరుగెత్తు కుంటూ మా బొమ్మ దగ్గరికి వచ్చేసాం. చూస్తే ఏముంది పలహారం మొత్తం చీమల మయము. ఇంకా మాకు ఏడుపు ఒక్కటే తక్కువ.. ఈ లోపు చిన్నామ్మ , అమ్మ కొట్టం లోకి వచ్చి మా సెట్ అప్ చూసి నవ్వుకున్నారు.అమ్మ బాగా చేసారు అని మెచ్చుకుంది , కానీ మా ఏడుపు మొహాలు చూసి ఏమైందిరా అని అడిగింది. మేము చీమల తో నిడిన పలహారం చూపించం. అమ్మ నవ్వుతు " పిచ్చి తండ్రి , దేవుడు ఆ రూపం లో వచ్చి మీ పలహారాలు తిన్నాడు అని చెప్పింది".  ఆ మాట వినగానే మేము ఫుల్ గా ఖుషి అయిపోయాం,

అమ్మ ఏమో " మీరు బొమ్మ పెడతాను  అంటే ఏమిటో అనుకున్నాం కానీ పసుపు తో  ఆ రాయికి  వినాయకుడి రూపు ని బాగా తెచ్చారు అని" ఒక కామెంట్ ఇచ్చేసి.. వుండండి ఇంకా మీ గణపతి ని పలహారాలు పెడుదాం అని ఇంట్లో వండిన "పాయసం,పులిహోర, కుడుములు , ఉండ్రాళ్ళు " అన్ని కొంచం కొంచం ప్లేట్ పెట్టి ఇచ్చింది.,

సాయంత్రం మేము చేసిన హడావిడి అంత ఇంత కాదు. వినాయకుడి నేను నా తల మీద మా వీధి అంత ఊరేగించా. ఆ వీధిలో వుండే వాళ్ళు అంత మా చుట్టాలే.. అందరికి తల కొంచం ప్రసాదం (అంటే పంచదార , బెల్లం,కిల్లి బిల్ల mix ) పెట్టం. చివరకి మా వీధిలో చివర్లో వున్నా కలువ లో నిమ్మజనం చేసాం.

తర్వాత సంవత్సరం నుంచి ఇంట్లో వినాయక చవితి టాస్క్ మా తొట్టి గ్యాంగ్ కి ఇచ్చేసారు.

మొన్న చవితి కి కూడా మా ఊరు వెల్ల నాన్నమ్మ ని చూదాము అని. ఐతేయ్ మా ఇంటి దగ్గరే మా లాగే మేము చేసినట్టే ఇప్పుడు అక్కడ మా పెద్దక్క (పెదమ్మ వాళ్ళ అమ్మాయి )పిల్లలు చేస్తున్నారు.. దిన్నె వారసత్వం అంటారు.. కాకపోతేయ్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మా వాళ్ళు dairy milk , cadbury 's  షాట్స్ పెట్టారు.

ఇంకా మా చిన్నప్పటి అల్లర్లు చాల వున్నాయి.. వాటి తో మళ్లీ  మీ ముందుకు వస్తా..