అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2011, సోమవారం

నేను..... ఒక ప్రేమ బాధితుడినే



టపా పేరు చూసి నాకు ఒక విషాద ప్రేమ కధ వుంది అనుకున్నారా.. ఐతేయ్ మీరు ఒక కిలో ముద్ద పప్పు లో కాలు వేశారోచ్ ..కానీ నేను ఒక ప్రేమ  బాధితుడినే.. ఎలాగంటారా.. మా క్రాంతి గాడి ప్రేమ వల్ల.. వాడి ప్రేమ వల్ల నేను బాధ ఏమి పడ్డానా  అని ఓఒ తెగ ఆలోచించమాకండి.. కొంచం కొంచం గా మొత్తం చెబుతా...

అస్సలు ఈ క్రాంతి ఎవడు అంటే.. నా ప్రాణ స్నేహితుడు.. వీడు కాకుండా.. ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా వున్నాడు.. వాడు "షరీఫ్".. వీళ్ళు ఇద్దరు లేకుండా.. మనం లేము.. అంత ప్రాణం నాకు వాళ్ళు అంటే.. షరీఫ్ ఏమో కానీ.. క్రాంతి చేసిన కొన్ని పనుల వల్ల ఎన్నో సార్లు.. "ప్రపంచం లో ఇంత మంది వుండగా.. ఈ క్రాంతి నే ఎందుకు నా  ప్రాణ స్నేహితుడు లా అయ్యాడు" అనుకున్న.. కానీ మనలో మన మాట.. వీడి దగ్గర , షరీఫ్ దగ్గర మన వేషాలు సాగినట్టు ఎవ్వరి దగ్గర సాగవు.. నేను ఏమి కావాలంటే అది చేస్తారు.. ఒక్క మాట లో చెప్పాలి అంటే నేను చాల అదృష్టం చేసుకున్నాను..

సరే మనం అస్సలు విషయం లోకి  వచ్చేద్దాం .. క్రాంతి కి "మనసంత నువ్వే " లాగా చిన్నప్పటి ప్రేమ వుంది.. ఇంజనీరింగ్ అప్పుడు నాకు తెలియగానే ఫస్ట్ లో నవ్వేసాను.. కానీ ప్రేమ లో మన వాడి నిజాయతి చూసి.. వాడిని మెచ్చుకోకుండా ఉండలేను..

క్రాంతి వాళ్ళది కూడా గుంటూరు , ఐతేయ్ ఒక్కోసారి..  వాళ్ల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుంటూరు కి వచ్చి మా ఇంట్లో వుంటూ.. తన ప్రేమికురాలని(చెల్లి) ని కలుస్తువుండే వాడు.. ఐతేయ్ చెల్లి వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్.. అందుకని ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు.. రాగానే ఫోన్ చేసేది.. ఆ ఫోన్ రాగానే.. వాడికి ప్రపంచం లో ఎవ్వరు కనపడరు.. నాతో సహా (ఇది మరి దారుణం కదండీ..) , అందుకే అంటారు ఏమో.. "ప్రేమ గుడ్డిది అని" .. ఐతేయ్ వాడి గుడ్డి తనం వల్ల ఎన్నో సార్లు బుక్ అయ్యా..

ఘటన ఒకటి :-  
కొత్త బంగారు లోకం సినిమాకి "నేను , క్రాంతి " ఇద్దరం వెళ్ళాం.. సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిముషాలకి చెల్లి ఫోన్ చేసింది.. ఇప్పుడు వస్తానురా ఫోన్ లో మాట్లాడి అని చెప్పి వెళ్ళాడు.. ఒక ముప్పై నిముషాలు చూసా, రాలేదు.. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమోలే అనుకోని వదిలేశా.. ఇంటర్వల్ లో బయటికి వెళ్లి చూసాను.. కనపడలా.. ఫోన్ చేస్తేయ్... " మామ నేను బయటకి వచ్చాను , సినిమా చూసి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు" , వాడితో వస్తున్న అని purse  కూడా ఇంట్లో లోనే పెట్టి వచ్చా.. చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏమి చేస్తాం ఇంకా.. సినిమా అయిపోయాక ఒక మూడు కిలోమీటర్లు లెఫ్ట్ - రైట్ కొట్టాను.. ఈ విధంగా ప్రేమ వల్ల మొదటి సరి బాధింప పడ్డాను..

ఘటన రెండు :-
బెంగుళూరు కి వచ్చాక.. ఇద్దరం కలిసి బయట నుంచి భోజనం తెప్పిన్చుకున్నాం.. వేడి వేడిగా ఇద్దరికి వడ్డన కూడా చేశా.. సర్రిగా అప్పుడే చెల్లి కాల్ చేసింది వాడికి , అంతెయ్ ఫోన్ కి వాడు అంకితం అయిపోయాడు.. ఇరవై నిముషాలు అయిన తినటానికి రాలేదు.. ఒక్కడినే తినలేను.. చివరగా దొర గారు ఎప్పుడో వచ్చి "ఏంట్రా నువ్వు నాకోసం తినకుండా వున్నావా? " అని అడిగినప్పుడు ఎంత ఒళ్ళు మండిందో..

ఘటన మూడు :-
ఒక రోజు ఫోన్ చేసి.. మనసేం బాలేదురా మా ఆఫీసు కి వచ్చేయి.. అక్కడి నుంచి ఇద్దరం ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు.. సరే కదా అని నేను వాడి కోసం వెళ్ళాను..  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ.. బయలుదేరం.. అలా స్టార్ట్ అయ్యమో లేదో.. చెల్లి ఫోన్ చేసింది..అంతెయ్ మన వాడి అడుగుల వేగం తగ్గింది.. నువ్వు వెళ్ళు మామ.. నేను చిన్నగా వస్తా అని , "తన దైన శైలి లో నను మరిచాడు.." నా చిట్టి హృదయం ఎంత బాధ పడిఉంటుందో.. ఈ పాటికి మీ అందరికి అర్ధం అయ్యే వుంటుంది..

ఇలా వాడి ప్రేమ వల్ల నేను బాధింప పడ్డాన లేదా..మీరే చెప్పండి.. :) అందుకే నేను ఒక ప్రేమ బాధితుడినే..

సంతోషకరమైన విషయం ఏమిటి అంటే.. భగవంతుడి దయ వల్ల.. పోయిన వారమే.. వాడికి , వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యింది.. అలా ఒక సుధీర్గమైన ప్రేమ కథ కి సంతోషకరమైన ముగింపు వచ్చింది.. :)  అలా క్రాంతి గాడి ప్రేమ >>>>> పెళ్లి అయ్యింది, నా బాధలు కంచి కి వెళ్ళాయి.. :)

26, ఫిబ్రవరి 2011, శనివారం

నంది హిల్స్ - ఒక అనుకోని ప్రయాణం - అనుకోని సంఘటనలు

ముంబై తో పోల్చుకుంటే , బెంగుళూరు లో వీకెండ్స్ చాల నిస్తేజం గా , నీరసంగా గడిచిపోతున్నాయి.. దానికి రెండు కారణాలు..

మొదటిది ఇప్పుడు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్.. మార్చిలో రిలీజ్ వుంది అని . జనవరి నుంచి ప్రతి రోజు పని చేపిస్తునే వున్నారు.. మేము చేస్తూనే వున్నాం.. సండే ఖాళీ గానే వున్నా.. విశ్రాంతి కావాలి కదా.. సో సండే మొత్తం నిద్ర కే అంకితం ఇచ్చేసాం..

రెండవది :- మా క్రాంతి గాడు.. వేదవ.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే , ఆ.. వూ.. అంటాడు కానీ..కదలడు.. వాడు లేకుండా మనం వెళ్ళలేం.

మొన్న feb   మొదటి వారం.. ఇంట్లో ఒక పని వుండి , అర్జెంటుగా గుంటూరు రమ్మనారు.. శనివారం ఆఫీసు ఉంది అని.. శనివారం సాయంత్రానికి టికెట్స్ బుక్ చేపించాను.. ఏమైందో.. సడన్ గా మా మేనేజర్ మీటింగ్ పెట్టి, ఈ వీకెండ్ మనం పని చెయ్యటం లేదు.. ఎంజాయ్ 2  డేస్ అని చెప్పగానే.. "అందరం ఎగ్గిరి గంతువేసాం".. మేము అల సంబరాలు జరుపుతున్న టైం లో.. చావు కబురు చల్లగా చెప్పాడు.. సోమవారం onsite  నుంచి client  మేనేజర్ వస్తుంది.. సో వచ్చే వారం నుంచి సండే కూడా పని చెయ్యాలి.. కావున మీ మీ batteries ఛార్జ్ చేసుకోండి అని విషయం చెప్పగానే".. మాలో ఉత్సాహం.. చప్పున చల్లారిపోయింది..

గుంటూరు కి శుక్రవారం టికెట్స్ దొరకటం చాల కష్టం.. అందుకని.. శనివారం టికెట్ నీ ఒకే చేశా.. అంటే మన చేతిలో శనివారం అంత ఖాళీ గా ఉంది అన్నమాట..ఇంటికి వెళ్ళేపాటికి , క్రాంతి , చిన్న (మా తమ్ముడు) , దీపూ(క్రాంతి బావ).. అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.. బయటికి వెళ్దాం అంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు.. ఇంకేం చేస్తాం.. నేను పడుకున్న.. పడుకొని.. క్రాంతి గాడిని బాగా తిట్టాను.. కొత్త బైక్ కొన్నావు కదరా.. కనీసం.. నైట్ ride  కన్నా వెళ్దాం పద అంటే.. వాడు వద్దు అన్నాడు.. ఇంకా నాలో కోపం కట్టలు తెంచుకొని.. సమరసింహా రెడ్డి లో బాలయ్య లా " రేయ్!!! బెంగుళూరు కి రా రా అని అన్నావ్.. వచ్చాక కనీసం ఒక్కసారి అన్న బయటకి వెళ్ళామా?" అని ఘాటు గా అరిచాను.. పాపం.. వాడు కూడా "ఇప్పుడు టైం 12  అయ్యింది .. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటే.. " నంది హిల్స్ కి వెళ్దాం పద.. సూర్యోదయం.. బావుంటుంది అంట.. ఎప్పుడు చూడలేదు అని అడిగా.. సరే అని.. నలుగురం బయలుదేరం..

క్రాంతి బైక్ మీద నేను, దీపూ బైక్ మీద చిన్న .. అల మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. బాగా చలి గా వుండటం వాళ్ళ.. చాల తక్కువ స్పీడ్ లో వెళ్ళాము.. రాత్రి 2 గంటలకి.. "బెంగలూరు అంతర్జాతీయ విమానాశ్రయం" దగ్గరకి వెళ్ళాం.. అక్కడ రోడ్ పక్కన.. టీ అమ్ముతున్నారు.. మా లాగానే నంది హిల్స్ కి వెళ్తున్న ఒక 20 మంది కురాళ్ళు అక్కడ కలిసారు.. ఒక టీ తాగి.. వాళ్ళతో మాటలు కలిపాం .. నంది హిల్స్ పొద్దున 5  కి కానీ ఘాట్ రోడ్ ఓపెన్ చెయ్యరు అని తెలిసింది.. అందుకని ఒక 2  గంటలు ఎక్కడైనా గడపాలని అనుకున్నాం.  నా తమ్ముడు నేను విమానం take off  ఎప్పుడు చూడలేదు..విమానాశ్రయం కి వెళ్దాం అన్నాడు.. సరే ఒకే అని అక్కడికీ వెళ్ళాం.. అక్కడ కాఫీ డే ఉంది.. కాఫీ తాగుతూ బాతాకాని వేసుకుంటూ.. టైం పాస్ చేసాం..

కొన్ని ఫోటోలు.. , దిగిన తర్వత.. నంది హిల్స్ కి బయలుదేరం.. పాపం బాగా చలి గా వుండటం వాళ్ళ. క్రాంతి డ్రైవింగ్ చెయ్యలేక పోయాడు.. నాకేమో బండి రాదు.. వాడి పరిస్థితి చూసి "సర్లేరా.. gears  ఒక్కటే గా నాకు రానిది.. నువ్వు చెప్పు నేను మేనేజ్ చేస్తాను" అని బండి డ్రైవ్ చేశా.. అల నేను మొదటిసారీ బండి డ్రైవింగ్.. బ్రాహ్మి ముహూర్తం లో చేశా ;)".

ఘాట్ రోడ్ కి ఇంకో రెండు కిలోమీటర్లు ఉంది అనగా.. రోడ్ పక్కన కొంత మంది ముసలి వాళ్ళు.. పెద్ద మంట వేసి చలి కాచుకుంటున్నారు.. అది చూసి మేము కూడా టెంప్ట్ అయ్యి.. బండ్లు ఆపేసి.. వాళ్ళతో కలిసి పోయి.. చలి కాచుకున్న.. ఎందుకో.. మా తాత గారు.. గుర్తుకు వచ్చారు.. సంక్రాంతి పండగకి మేము చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.. ఆ మంటల పక్కన ఒక చిన్న హోటల్ ఉంది.. వేడి వేడి గా.. noodles  చేసి ఇస్తున్నారు.. శుబ్రంగా వాటిని కూడా ఒక పట్టు పట్టాము..



6 కి ఘాట్ రోడ్ ఓపెన్ చేసారు.. ఇంకా అంతెయ్ అక్కడ మలాగానే.. ఒక 60  మంది వుంటారు.. అంత ఒకేసారి పైకి వెళ్ళాం.. వెళ్ళే పాటికి అప్పుడే భానుడు.. ఒళ్ళు విరుచుకుంటూ.. బయటకి వస్తున్నాడు.. కొండ పైన కదా.. చల్లని గాలి, సూర్యోదయం.. అబ్బః.. అది అనుభవిస్తేనే కానీ.. మాటల్లో చెప్పలేని ఆనందం.. ఒక గంట.. అల గడిపిన తర్వత..అక్కడికి ఏదో కన్నడ సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చారు.. అస్సలే మనకి సినిమా మేకింగ్  అంటే పిచ్చి.. సో ఇంకో ౩ గంటలు.. వాళ్ళ పని తీరు.. షాట్స్ తీసే విధానం చూస్తూ వుండిపోయ..

సడన్ గా మా తమ్ముడు గుర్తుచేసాడు.. "నీ బస్సు టైం 6 .30  కి.. ఇప్పుడు టైం పదిన్నర అయ్యింది.. ఇక్కడ నుంచి ఇంటికి నాలుగు గంటలు అన్న పడుతుంది.. పద అని చెప్పగానే.. వెన్నకి బయలుదేరం.. ఐతేయ్ ముందు రోజు రాత్రి అంత నిద్ర లేకపోవటం వల్ల.. చాల స్లో డ్రైవింగ్ చేసాం.. ఇంటికి వచ్చేపాటికి 3  అయ్యింది.. వళ్ళు నెప్పులు.. పడుకుంటే నిద్ర రాదు... అల కష్టపడుతూ ఎప్పటికో నిద్ర పోయాను.. నిద్ర పట్టిందో లేదో.. బస్సు టైం అవుతుంది అని నిద్ర లేపేసారు..

సర్లే బస్సు లో పడుకుందాం అనుకున్నాం.. కానీ.. ఏమి చేస్తాం.. విధి మనతో గేమ్స్ ఆడటం మొదలు పెట్టింది.. బస్సు లో నా పక్కన వ్యక్తి.. పెద్ద గురకలు పెడుతూ నిద్ర పోతీ నాకు నిద్ర ఎలా వస్తుంది.. పోదున ఇంటికి వెళ్ళగానే.. పని మీద నాన్న , నేను రోజు మొత్తం బండి మీద తిరుగుతూనే వున్నాం.. సాయంత్రానికి నా వళ్ళు పచ్చి పుండు లా ఒకటే నెప్పులు.. సర్లే.. బెంగుళూరు కి వెళ్తూ అన్న.. రెస్ట్ తీసుకుందాం అనుకున్న.. బస్సు స్టాప్ కి వెళ్ళాను.. విజయవాడ  to  బెంగుళూరు బస్సు వచ్చింది.. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. లిస్టు లో చూస్తే నా పేరు లేదు. టికెట్ ఏమో నా దగ్గరే ఉంది.. మరి ఏంటి ఏమి అయ్యింది అనుకుంటున్నారా?   ఆ ట్విస్ట్ చూస్తే.. మీరే పాపం అనుకుంటారు.. అస్సలు గుంటూరు to బెంగుళూరు రిటర్న్ జర్నీ మీద ఇంకో పోస్ట్ ఎసుకోవచ్చు.. అస్సలు ఏమి జరిగింది, ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది..అని తెలుసుకోవాలి అంటే.. ఇంకో పోస్ట్ కోసం వెయిట్ చెయ్యండి..  
 

29, సెప్టెంబర్ 2010, బుధవారం

వర్షం తో నా కష్టాలు - పార్ట్ -2



ముందు పోస్ట్ లో వడగళ్ళు పడ్డాయి అని చెప్పా కదా.. తర్వాతి రోజున స్కూల్ కి వెళ్లి "అరేయ్ మా ఇంట్లో లో వడగళ్ళు పడ్డాయి తెలుసా అని" ఒకటే హడావిడి చేయాలి డిసైడ్ అయ్యా. ఐతేయ్.. వెంటనే మా స్నేహితులు నిజమా చా కోతలు  కోయి కోయి అన్నారు అంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదా.. అందుకే వెంటనే కింద పడి వున్నా వడగళ్ళ లో కొన్నిటిని తీసుకొని నా బాగ్ లో వేసుకున్న..
                    కనీసం ఒక కవర్ లో పెట్టాలి అని పెద్ద ఆలోచన వచ్చే వయసు కాదు కదా.. :(. ఇప్పుడు మన కథ లో సన్నివేశం తర్వాతి రోజు ప్రోదున్నే అన్నమాట. స్కూల్ టైం అవుతుంది అని హడావిడి గా రెడీ అవుతూ.. నిన్న పడిన  వర్షాన్నిగురించి నా ఫ్రెండ్స్ ముందు ఏమని గొప్పలు చెప్పాలా??? అని ఓ తెగ ఆలోచిస్తుంటే..అమ్మ ఏమో నా బాగ్ తేవటం కోసం ఇంట్లో కి వెళ్ళింది. ఒక అయిదు నిముషాలు తర్వాత పేద్ద సౌండ్ తో మెరుపు నా దగ్గర లో పడినంత ఫీలింగ్ వచ్చింది. ఎంటా ఆ శబ్దం అని ఆలోచిస్తుంటే... ఈ సారి సౌండ్ తో పాటు నా వీపు మీద నెప్పి కూడా పుట్టింది.. చూస్తే బాగ్ తో అమ్మ నా వీపు విమానం మోత మోగలే కొట్టింది.  వెంటనే నేను " నిన్న నే గా కొట్టను అన్నావ్" మరల ఎన్టింది యువర్ హొనౌర్ అని పెద్ద గా అరిచే లోపే.. "ఏంట్రా ఇది బాగ్ అంత తడి తడి గా వుంది.. వర్షం పడుతుంది అని నేను పైన పెట్ట కదా..మళ్ళ ఎందుకు తడి అయింది నువ్వు ఏమైనా చేసావా? " అని అడిగింది.. అప్పుడు గాని మన మట్టి బుర్ర వెలగాల... వడగళ్ళు కరిగి.. నా బాగ్ తో పాటు నా బాగ్ కింద పెట్టిన తమ్ముడి బాగ్ కూడా తడిసిపోయింది అని.. తర్వాత సీన్ మీ ఊహ కే వదిలేస్తున్న..

ఇలా చిన్నప్పుడు వర్షం వాళ్ళ రెండు సార్లు అమ్మ చేతిలో లో తాయిలం తిన్న.. సో వర్షం తో నేను కటిఫఫ్ .. అలా కటిఫ్ చెప్పాను అని వర్షం నా మీద వేరే లా పగ తీర్చుకుంది..

సరిగ్గా రెండు years  క్రితం.. నాకు బెంగుళూరు నుంచి ముంబై కి transfer  అయ్యింది.. కంపెనీ వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసారు.. అది జూన్ మాసం .. ముంబై వర్షాల గురించి చెప్పాలి అంటే.. జూన్ , జూలై , ఆగష్టు , ఈ మూడు నెలలో అందరి దగ్గర గొడుగులు వుంటాయి.. వర్షం పాడనీ రోజు ఉండదు అంటే అతిసయ్యోక్తి  కాదు.. మనకు ఇది అంత తెలియదు.. ముంబై కి బయలుదేరా..  యింక ముంబై లో ఇంకో   10 నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అనగా.. ఫ్లైట్ మళ్ళ పైకి తీసుకెళ్ళారు.. ఏంట్రా అంటే.. ముంబై లో అప్పుడు భారి వర్షం అంట.. లాండింగ్ కి చాన్సులు తక్కువ వున్నాయి అని ముంబై సిటీ పైన ఒక 30  నిముషాలు.. అలా ఫ్లైట్ ని తిప్పుతూ వున్నారు.. మధ్యలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ లా.. ఉరుమల వల్ల ఫ్లైట్ పైకి కిందకి ఊగుతూ వుంటే.. "దేవుడిని తలవని మనిషి లేడు ఫ్లైట్ లో".. ఆ సమయం లో కూడా నేను వర్షాన్ని తిడుతువున్న .. మరి నా తిట్లకో.. వాళ్ళ ప్రార్ధనలకో వర్షం శాంతించింది..

యింక ముంబై లో నా ఫస్ట్ డే గురించి ఒక పెద్ద బ్లాగ్ పోస్ట్ రాసుకోవచ్చు.. అన్ని విచిత్ర అనుభవాలు అనుభవించ.. అక్కడ...

ముంబై లో ఒక రెండు years  పనిచేయగానే.. మా కంపెనీ వల్లే.. పాపం పెళ్లి కావాల్సిన కుర్రాడు .. ఇక్కడ వుంటే మంచి సంబందాలు రావు ఏమో ఎని.. దయ తలచి.. మళ్ళ నన్ను బెంగుళూరు తిరుగు టపా కట్టించారు..రెండు ఏళ్ళు అక్కడ వుండటం వాళ్ళ ముంబై లో చాల మంది ఫ్రండ్స్ అయ్యారు.. అంత కలిసి గ్రాండ్ గా send ఆఫ్ పార్టీ ప్లాన్ చేసారు.. నేను శని వారము అక్కడి నుంచి బస్సు బుక్ చేసుకున్న.. సో మా వాళ్ళు అంత.. ఫ్రైడే నైట్ కి పార్టీ అన్నారు.. కానీ.. నా ప్రియ మిత్రుడు (వర్షం) ఇక్కడ కూడా నన్ను వదలలేదు..

ఫ్రైడే రాత్రికి స్టార్ట్ అయిన పెద్ద వర్షం.. తగ్గలేదు.. యింక ఒక్కకరే ఫోన్ చేసారు.. "మామ రావటం కష్టం వర్షం పడుతుంది" రేపు పోదున్నే కలుద్దాం అన్నారు.. శనివారం వర్షం యింక తగ్గల.. చూస్తుంటే టైం మధ్యానం అవుతుంది.. luggage  ఏమో చాల వుంది.. ఆ వర్షం లో ఆటో వాళ్ళు కూడా రావటం లేడు.. బస్సు కేమో అట్టే టైం లేదూ... ఫ్రండ్స్ నీ ఆ వర్షం లో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదూ.. ఏమిట్రా దేవుడా ఈ వర్షానికి నా మీద పగ అని ..  యింక చివరికి బాబా ని తలుచుకున్న.. ఒక 5  minutes  లో ఆటో దొరకింది.. కానీ అంత luggage తో నాతో పాటు రావటానికి ఒక్కరికి ఛాన్స్ వుంది.. అందరు వచ్చి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇద్దాము అనుకున్నది వర్షం వాళ్ళ ఇలా అయ్యింది.. :(

 బస్సు స్టాప్ కెళ్ళి పాటికి యింక వర్షం పడుతుంది.. ఎంత గొడుగు పట్టుకున్న.. తడుస్తం కదా.. వర్షం లో అలా తడుస్తూ.. luggage  మీద మటుకు కవర్ వేశా..వర్షం వాళ్ళ బస్సు కూడా గెంట లేట్ గా వచ్చింది.. ఆ పాటికి నేను సగం తడిసిపోయ.:( . వోల్వో బస్సు లో తడి బట్టలతో కోర్చుంటే వుండే నరకం.. ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. వేడి వేడి టీ తాగి నోరు  కాల్చుకున్న వాడికి బజ్జి ఇచ్చి తినమంటే.. ఎలా వుంటుందో.. దాని కంటే దారునాతి దారుణం గా వుంటుంది..

యింక నా వాళ్ళ కాకా.. వర్షం తో రాజి పడ్డ.మనం మనం ఒకటి అని.. అయిన వర్షం నా మాట వింటాం లేదూ.. ఇప్పుడు బెంగుళూరు లో యింక చుక్కలు చూపిస్తోంది.. మొన్న ఫ్రైడే (24 -10  - 2010) ఇంటికి వెల్లదాము అని బయలుదేరి అలా ఆఫీసు నుంచి బయటకి వచ్చానో లేదో.. పెద్ద వర్షం మొదులు అయ్యింది.. యింక తడుస్తూ ఏమి వెళ్తాం లే అని ఆగాను... ఆ ఆగటం ఆగటం మూడు గెంటలు దాక అలా అగేవున్న.. మీరే చెప్పండి.. ఫ్రైడే అందులో వీకెండ్ రూం కి వెళ్లి పండుగచేదాం అనుకుంటే.. ఇలా వర్షం అడ్డుపడి.. చివరికి రాత్రి పదకొండు కి .. ఇంటికి వెల్ల...  ఇలా వర్షం నాతో నిత్యం బాట్టింగ్ చేస్తూనే వుంది..

మీలో ఎవరు అయిన వర్షం లో త్రిష లాగా వర్షం తో మాట్లాడే వాళ్ళు వుంటే నా గోడు నా బాధ చెప్పాడు ప్లీజ్..






అనుభవాలు