7, మార్చి 2011, సోమవారం

నేను..... ఒక ప్రేమ బాధితుడినే



టపా పేరు చూసి నాకు ఒక విషాద ప్రేమ కధ వుంది అనుకున్నారా.. ఐతేయ్ మీరు ఒక కిలో ముద్ద పప్పు లో కాలు వేశారోచ్ ..కానీ నేను ఒక ప్రేమ  బాధితుడినే.. ఎలాగంటారా.. మా క్రాంతి గాడి ప్రేమ వల్ల.. వాడి ప్రేమ వల్ల నేను బాధ ఏమి పడ్డానా  అని ఓఒ తెగ ఆలోచించమాకండి.. కొంచం కొంచం గా మొత్తం చెబుతా...

అస్సలు ఈ క్రాంతి ఎవడు అంటే.. నా ప్రాణ స్నేహితుడు.. వీడు కాకుండా.. ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా వున్నాడు.. వాడు "షరీఫ్".. వీళ్ళు ఇద్దరు లేకుండా.. మనం లేము.. అంత ప్రాణం నాకు వాళ్ళు అంటే.. షరీఫ్ ఏమో కానీ.. క్రాంతి చేసిన కొన్ని పనుల వల్ల ఎన్నో సార్లు.. "ప్రపంచం లో ఇంత మంది వుండగా.. ఈ క్రాంతి నే ఎందుకు నా  ప్రాణ స్నేహితుడు లా అయ్యాడు" అనుకున్న.. కానీ మనలో మన మాట.. వీడి దగ్గర , షరీఫ్ దగ్గర మన వేషాలు సాగినట్టు ఎవ్వరి దగ్గర సాగవు.. నేను ఏమి కావాలంటే అది చేస్తారు.. ఒక్క మాట లో చెప్పాలి అంటే నేను చాల అదృష్టం చేసుకున్నాను..

సరే మనం అస్సలు విషయం లోకి  వచ్చేద్దాం .. క్రాంతి కి "మనసంత నువ్వే " లాగా చిన్నప్పటి ప్రేమ వుంది.. ఇంజనీరింగ్ అప్పుడు నాకు తెలియగానే ఫస్ట్ లో నవ్వేసాను.. కానీ ప్రేమ లో మన వాడి నిజాయతి చూసి.. వాడిని మెచ్చుకోకుండా ఉండలేను..

క్రాంతి వాళ్ళది కూడా గుంటూరు , ఐతేయ్ ఒక్కోసారి..  వాళ్ల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుంటూరు కి వచ్చి మా ఇంట్లో వుంటూ.. తన ప్రేమికురాలని(చెల్లి) ని కలుస్తువుండే వాడు.. ఐతేయ్ చెల్లి వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్.. అందుకని ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు.. రాగానే ఫోన్ చేసేది.. ఆ ఫోన్ రాగానే.. వాడికి ప్రపంచం లో ఎవ్వరు కనపడరు.. నాతో సహా (ఇది మరి దారుణం కదండీ..) , అందుకే అంటారు ఏమో.. "ప్రేమ గుడ్డిది అని" .. ఐతేయ్ వాడి గుడ్డి తనం వల్ల ఎన్నో సార్లు బుక్ అయ్యా..

ఘటన ఒకటి :-  
కొత్త బంగారు లోకం సినిమాకి "నేను , క్రాంతి " ఇద్దరం వెళ్ళాం.. సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిముషాలకి చెల్లి ఫోన్ చేసింది.. ఇప్పుడు వస్తానురా ఫోన్ లో మాట్లాడి అని చెప్పి వెళ్ళాడు.. ఒక ముప్పై నిముషాలు చూసా, రాలేదు.. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమోలే అనుకోని వదిలేశా.. ఇంటర్వల్ లో బయటికి వెళ్లి చూసాను.. కనపడలా.. ఫోన్ చేస్తేయ్... " మామ నేను బయటకి వచ్చాను , సినిమా చూసి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు" , వాడితో వస్తున్న అని purse  కూడా ఇంట్లో లోనే పెట్టి వచ్చా.. చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏమి చేస్తాం ఇంకా.. సినిమా అయిపోయాక ఒక మూడు కిలోమీటర్లు లెఫ్ట్ - రైట్ కొట్టాను.. ఈ విధంగా ప్రేమ వల్ల మొదటి సరి బాధింప పడ్డాను..

ఘటన రెండు :-
బెంగుళూరు కి వచ్చాక.. ఇద్దరం కలిసి బయట నుంచి భోజనం తెప్పిన్చుకున్నాం.. వేడి వేడిగా ఇద్దరికి వడ్డన కూడా చేశా.. సర్రిగా అప్పుడే చెల్లి కాల్ చేసింది వాడికి , అంతెయ్ ఫోన్ కి వాడు అంకితం అయిపోయాడు.. ఇరవై నిముషాలు అయిన తినటానికి రాలేదు.. ఒక్కడినే తినలేను.. చివరగా దొర గారు ఎప్పుడో వచ్చి "ఏంట్రా నువ్వు నాకోసం తినకుండా వున్నావా? " అని అడిగినప్పుడు ఎంత ఒళ్ళు మండిందో..

ఘటన మూడు :-
ఒక రోజు ఫోన్ చేసి.. మనసేం బాలేదురా మా ఆఫీసు కి వచ్చేయి.. అక్కడి నుంచి ఇద్దరం ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు.. సరే కదా అని నేను వాడి కోసం వెళ్ళాను..  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ.. బయలుదేరం.. అలా స్టార్ట్ అయ్యమో లేదో.. చెల్లి ఫోన్ చేసింది..అంతెయ్ మన వాడి అడుగుల వేగం తగ్గింది.. నువ్వు వెళ్ళు మామ.. నేను చిన్నగా వస్తా అని , "తన దైన శైలి లో నను మరిచాడు.." నా చిట్టి హృదయం ఎంత బాధ పడిఉంటుందో.. ఈ పాటికి మీ అందరికి అర్ధం అయ్యే వుంటుంది..

ఇలా వాడి ప్రేమ వల్ల నేను బాధింప పడ్డాన లేదా..మీరే చెప్పండి.. :) అందుకే నేను ఒక ప్రేమ బాధితుడినే..

సంతోషకరమైన విషయం ఏమిటి అంటే.. భగవంతుడి దయ వల్ల.. పోయిన వారమే.. వాడికి , వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యింది.. అలా ఒక సుధీర్గమైన ప్రేమ కథ కి సంతోషకరమైన ముగింపు వచ్చింది.. :)  అలా క్రాంతి గాడి ప్రేమ >>>>> పెళ్లి అయ్యింది, నా బాధలు కంచి కి వెళ్ళాయి.. :)

6 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

పోనీలెండి. మీ బాధలు కంచికి వెళ్ళిపోయాయి కదా. :) మీ మిత్రుడికీ, మీ చెల్లికీ నా శుభాకాంక్షలు.

శివరంజని చెప్పారు...

శశిధర్ గారు మీ ఫ్రెండ్ మనసంతా నువ్వే లో ఉదయ్ కిరణ్ కారెక్టర్ అయితే మరి మీ కేరెక్టర్ ఏమిటీ సునీల్ కాదు కదా ( just joke ..no offense plzz ) పోస్ట్ చాలా హ్యూమరస్ గా రాసారు ..


మీ మిత్రుడికీ, మీ చెల్లికీ నా శుభాకాంక్షలు.మీ ఫ్రెండ్ వాళ్ళ ప్రేమ పది కాలాలు పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

Sasidhar Anne చెప్పారు...

@sivaranjani punch bavundi.. Hero okadey vundali.. ee post ki vadu hero kabbati nenu sunil nee :)

//మీ ఫ్రెండ్ వాళ్ళ ప్రేమ పది కాలాలు పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
yeah andukani.. fridge gift ga iddhamu anukuntunna.. :)

@sisira garu - Mee wishes ki thanks..

శివరంజని చెప్పారు...

నా బాధలు కంచి కి వెళ్ళాయి.. :)>>>>>>>>>>> ఎందుకో నాకు డౌట్ గా ఉందండి....

హహహ మీరు ఫ్రిడ్జ్ కొనివ్వండి వాళ్ళు కూల్ గా ఉంటారు.....
మీ మిత్రుడికీ, మీ చెల్లి ని బ్లెస్స్ చేసి మిమ్మల్ని బ్లెస్స్ చేయకపోతే బాగోదు కదా అందుకే

మీ ఇంకో ఫ్రెండ్ షరీఫ్ కూడా లవ్ లో పడి మళ్ళీ మీ చేతికి ఫుల్ల్ గా పని కల్పించాలని కోరుకుంటున్నాను

Sasidhar Anne చెప్పారు...

//మీ ఇంకో ఫ్రెండ్ షరీఫ్ కూడా లవ్ లో పడి మళ్ళీ మీ చేతికి ఫుల్ల్ గా పని కల్పించాలని కోరుకుంటున్నాను.

aasa dosa appadam vada.. according to statistics abbayilu prema lo maha aithey 24 lopu padatharu.. now we are 26 so no chance annamata.. :) ayina vadu premanchali anna , antha teerika vadiki ledu.. he is managing director of engg college.. so mee korika teeradu ga.. :)

ayina sivaranjani.. nuvvu naaku icchindhi bless kadu.. sapam.. :X

Sobha చెప్పారు...

mothaaniki pelli ayyindhi....vaalla madhya godavalu raakunda meere choodaali.mee bhdyata inka perigindhi.so inka badhalu poledu.