chinnathanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chinnathanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2011, శనివారం

అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1

                
మారేనేమో.. నాకు ఒక ముద్దల తమ్ముడు వున్నాడు అన్నమాట..రాముడు మాట లక్షమణడు జవదాటనట్టు , వీడి మాట కూడా నేను దాటే వాడిని కాదు.. ఇదేంటి అంత రివర్స్ లో వుంది అనుకుంటున్నారా.. అది అంతేయ్.. ఎంతైన నా ముద్దలా తమ్ముడు కదా.. వాడి మాట చెల్లాలి.

                                               గుంటూరు లుత్రెన్ స్కూల్ లో నేను ఫస్ట్ క్లాసు లో వున్నపుడు మా వాడిని LKG కని బలపాల బడిలో వేసారు.ఇక మాకోసం అమ్మ రోజు మధ్యానం బాక్స్ తెచ్చి తినిపించి వెళ్లేది.వీడు స్కూల్ లో జేరక ముందు నేను ఒక్కడినే చిన్నగా అన్నం తింటూ అమ్మ తో కబుర్ల, కాకరకాయల తో, మంచి గా టైం పాస్ చేసేవాడిని. నేను ఇలా అమ్మ తో హ్యాపీ గా వుండటం చూసి అల్లు అర్జున్ – “అదేంటి హ్యాపీ సినిమా లో నేను కదా హీరో వీడు ఎలా హ్యాపీ గా వుంటాడు.” అని వెళ్లి వాళ్ళ మామయ్య చిరు కి చెప్పి.. ఆ చిరు వెళ్లి సోనియా కి చెప్పి..ఆ సోనియా తో.. అర్జెంటు మా తమ్ముడు వెళ్తున్న.బలపాల బడి ని మూపించాడు.. ఇక మా నాన్న గారు వేరే అలోచాలను లేకుండా మా స్కూల్ లోనే వేసారు..

                                               కొత్త వాళ్ళని సులభం గా స్నేహితులని చేసుకోవటం మా వాడికి వెన్నతో కాదు జున్ను తో పెట్టిన విద్య. అదేంటి సామెత మార్చాను అనుకుంటున్నరా.. అది అంతే నాకు వెన్న కంటే జున్ను అంటే ఇష్టం.  మా వాడు తిండి తినటం లో ఫాస్ట్.. త్వరగా తిని.. ఎంత త్వరగా ‘కరెంటు షాక్’’అంటుకునే ఆట ‘ ‘పిచ్చి బంతి’ వగైరా వగైరా ఆటలు ఆడదామా అని.. గబా గబా తినేసే వాడు. అమ్మ నోట్లో ముద్దలు పెడితేయ్..చిన్న ముద్దల కాదు అమ్మ.. పెద్దవి పెద్దవి అంటూ.. చివరికి తిరుపతి లడ్డుల సైజు కి తీసుకువచ్చాడు..నేను ఏమో తినలేక ఆపసోపాలు పడితేయ్, మా వాడు మటుకు తినేసి, లగేతుకుంటూ.. వెళ్లి ఆటల్లో మునిగిపోయేవాడు.. అమ్మ ఏమో.. ఏరా నాని నువ్వు వెళ్లి వాళ్ళతో ఆడుకో.. అని పంపించేసి.. అమ్మ వేంటనే వెళ్ళిపోయేది..అల అమ్మ కూడా త్వరగా వెళ్లటం అలవాటు చేసుకుంది.ఏమి చేస్తాం చెప్పండి.. రాజకీయనాయకులు,ఇంట్లో పెద్ద పిల్లలు ఏమి చేయలేరు.. ఖండించి ముందుకు పోవటం తప్పితేయ్...

                                                నర్సేరి నుంచి మా వాడు ఎల్.కే.జి కి వచ్చాడు..ఇంకా పరిమాణాల గురించి మన వాడికి ఊహ వచ్చేసింది..వాడి లెక్కలో ఎంత పెద్దగా వుంటే అంత ఎక్కువ విలువ అన్నమాట.ఇక చూసుకోండి మా తిప్పలు.. ఇంట్లో నాన్న కి పెద్ద పళ్ళెం లో అన్నం పెడితేయ్ , వాడికి కూడా దాంట్లో నే పెట్టాలి అని గొడవ చేసేవాడు., అన్నం కొంచం పెట్టిన ఊర్కునే వాడు కాదు..పళ్ళెం నిండా పెట్టుకొని సగం కూడా తినకుండా .. మిగిలిస్తేయ్ అమ్మ ఊర్కోదు అని.. ఇది నీ ముద్ద , నాన్న ముద్ద , అమ్మ ముద్ద మాతోనే నే తినిపించే వాడు..

ఇక్కడి తో అవ్వలేదు.. స్కూల్ కి వెళ్తుంటే.. నాన్న వాడికి, నాకు చెరొక పావలా ఇచ్చేవారు.. ఒకసారి వాడు నాన్న జేబు లో “పది పైసల” బిల్ల చూసి.. అది కావాలి అని గొడవ చేసాడు.. వద్దు రా,పావలా నే ఎక్కువ అంటే వినలేదు..ఇంకేం చేస్తారు.. చివరికి వాడి కోరిక మీరకు.. వాడికి పది పైసల బిల్లనే ఇచ్చారు.. స్కూల్ ఇంటర్వల్ టైం.. నేను పావలా ఇచ్చి.. ఐదు.. కిల్లి బిళ్ళలు తీసుకున్న.. మా వాడు పది పైసలు ఇచ్చి పది బిళ్ళలు కావాలి అన్నాడు.. కొట్టు వాడు , రెండే వస్తాయి అంటే.. అదేంటి పావలా కంటే పది పైసల సైజు ఎక్కువ వుంది కదా.. నాకే ఎక్కువ బిళ్ళలు రావాలి అని అరిచి గీ పెట్టి మరి తీసుకునే వాడు.. పాపం ఆ కొట్టు వాడు సాయంత్రం మా అమ్మ కి చెప్తేయ్ .. అమ్మ వాళ్ళు “వాడికి ఎన్ని కావాలి అంటే అన్ని ఇవ్వండి.. డబ్బులు సాయంత్రం మేము ఇస్తాము అని చెప్పారు.


                          ఇంకా మా వాడి డాన్స్.. డాన్స్ వేస్తున్నపుడు , పాటలు పాడుతున్నపుడు చుట్టూ వున్న అందరు చూసి చప్పట్లు కొట్టి తీరాలి.. లేకపోతేయ్ చప్పట్లు కొట్టే దాక డాన్స్ వేస్తూనే వుంటాడు.. .. ఇలా చెప్పుకుంటూ పోతేయ్ ఎన్నో వున్నాయి.. ఇప్పటికీ ఈ టపా పెద్దదయి పోయింది.. మిగిలినవని ఇంకో టపా లో చూద్దాం....

14, జనవరి 2011, శుక్రవారం

మా ఇంట సంక్రాంతి


అందరు.. గతం గతః  అంటారు కానీ.. గతాన్ని తలుచుకుంటే ఎంత బావుంటుందో.. కదా, అందమైన బాల్యం, అమ్మ మూరిపాలు, అల్లరి ఆటలు.. అబ్బో ఒకటి ఏమిటి బలే వుండేది లే.. ఇంతకు ముందు నేను చెప్పిన్నట్టు.. సంక్రాంతి సెలవలు రాగానే.. మేము, చిన్న అమ్మ వాళ్ళం, అత్త వాళ్ళు అందరం తాతయ్య దగ్గరకు వెళ్ళేవాళ్ళం.పండగకి ఒక 3 రోజులు ముందుగానే సందడి మొదలు అయ్యేది..  అరిసెలు, చక్రాలు, మిఠాయి, లడ్డులు వండటం లో అమ్మ , అత్త లు అంత బిజీ గా వుండేవాళ్ళు.. మేము(అంటే పిల్లలు అందరం) కూడా నాన్న, బాబాయి.. పిండి దంచుతుంటే, వాళ్ళకి నీళ్ళు, టీ , కాఫీ ఇవ్వటం లో బిజీ గా వుండేవాళ్ళం. చుట్టూపక్కల అంత వుండేది మా చుట్టాలే.. వాళ్ళు కూడా తల ఒక చెయ్యి వేస్తూ , కబుర్లు చెప్తుంటే బలే వుండేది.
                                                     
ఇక్కడ బియ్యపు పిండి దంచుతుంటే, ఆ పక్క ఆడవాళ్లు బెల్లపు పాకం చేసేవారు.. మేము , పాకం దగ్గరికి , పిండి దగ్గరికి అటు ఇటు తిరుగుతూ.. పిండి ని పక్కని బట్టలకి పూసుకుంటూ, తిట్లు తింటూ.. సిగ్గులేకుండా ఇంకా ఎక్కువ గొడవ చేసేవాళ్ళు..  అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చెయ్యి ఎత్తితేయ్.. దీవార్ సినిమా లో డైలాగ్ లా మేము కూడా "మేరి పాస్ తాతయ్య హై" అని చెప్పి వాళ్ళని బయపెట్టే వాళ్ళం. అరిసెలు చేయాలి అంటే ముందు చలిమిడి చెయ్యాలి కదా.. అలా చేస్తున్నప్పుడు మేము కూడా ఒక చెయ్యి వేసేవాళ్ళం.. సహాయం చెయ్యటం  కోసం అనుకుంటే మీరు పొరపడినట్టే..చెయ్యి పెట్టినట్టే పెట్టి ఒక పెద్ద ముద్ద ని తీసుకొని.. పరుగో పరుగు.. అల అ చలమిడి ముద్ద ని గడ్డివాము మీద తింటూ వుంటే ఆ మాజా నే వేరు.. ఇంక బూంది , లడ్డులు చేస్తున్నప్పుడు కూడా ఇలా మా గొడవ మా తాత గారి సహకారం తో నిరాటంకంగా లేతబెల్లపు పాకం లా సాగుతూఊఊఉ  వుండేది..

భోగి రోజున మా బోగాలు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ముందే రోజే.. ఇంట్లో వున్న పాత సామానుని., బర్రెల కొట్టం లో పాత తట్టలని పోగు చేసి పెట్టేవాళ్ళం. పొద్దునే ఐదు కల్ల లేపేవారు.. అందరం కలిసి ఇంటి వెన్నకి వెళ్లి, పోగు చేసిన సామాను మీద కిరసనాయులు చల్లి నిప్పు పెట్టె వాళ్ళం.. మా ఇంటి వెనకాల అంత పోలలే ఉండేవి.. పొగమంచు లో పచ్చ్చదనం కనిపించి కనిపించక ..ఎంత బావుండేదో.. అంత చలి లో.. తాతయ్య , నేను ఒకే రగ్గు కపోకొని.. చలి కాచుకునే వాళ్ళం..అన్ని కోట్లు ఇచ్చి ఆ ఆనందం ఇప్పటికి రాదూ.. ఈ లోపు అమ్మ వాళ్ళు వేడి వేడి కాఫీ తెచ్చేవారు.. తరవాత ఆ బోగి మంటలలో పెద్ద పెద్ద కాగులు పెట్టి నీళ్ళు కాచుకొని స్నానాలు కానిచ్చే వాళ్ళం. ఇవ్వన్ని కాకుండా ఇంటి ముందు ముగ్గులు , హరిదాసు హడావిడి అంత చెప్పిన తక్కువే..

సంక్రాంతి పండుగ రోజున..అందరికి కుంకుడు రసం తో తలస్నానం చేపించేయ్ వారు, అప్పటి దాక మా పార్టీ వుండే తాత గారు.. ఆ ఒక్క రోజు మటుకు అమ్మ వాళ్ళ తో కలిసి మాతో బలవంతం గా తలస్నానం చేపించేయ్ వారు.. కొత్త బట్టలు వేసుకొని  వచ్చే లోపు, అమ్మ వాళ్ళు బాండి పెట్టి గారెలకి రంగం సిద్ధం చేసే వారు.. అల వేస్తూ వుంటే మేము ఇలా లాగిస్తూ వుండేవాళ్ళం.. అమ్మ ఏమో పిండి ని కవర్ మీద పెట్టి, చక్కగా గా వత్తి , బాండి లో వేస్తే.. చిన్నమ్మ వాటిని నూనె లో వేగించి బయటకు తీసేది.. తీసిన వాటిని మా అత్త మాకు ప్లేటులో పెడుతువుండేది..  ఇక్కడ మా తాత గారు ఎంటర్ ది డ్రాగన్ లా వచ్చి పిల్లలకి పోటి పెట్టేవారు.. ఎవరు ఎక్కువ గారెలు తింటే వాళ్ళకి అన్ని గాలిపటాలు కొనిపిస్త అని చెప్పారు.. ఇంక మేము ఆగుతామా.. "కళ్యాణ్ రామ్ కత్తి స్టైల్ లో " పది , ఇరవయ్ , లెక్కమీ ఓపిక " అన్నట్లు , సెహ్వాగ్ బెట్టింగ్ చేసిన్నట్టు , వాయులు వాయలూ తినేసే వాళ్ళం.. ఇసుగు పుట్టి ఆడవాళ్లు ఇంక ఎన్నిరా . అని ఇసుకు కుంటే  , మా తాత.. "పిల్లలకి దిష్టి పెడతారే" అని గయ్యిన లేగిసే వాళ్ళు..ఇవి కాకుండా..నాకు ఇష్టమైన కొత్త బియం తో చేసిన "పరమాన్నం" కూడా వుండేది. బుజ్జి పొట్టకి ఆ రోజుల్లో ఎన్ని కష్టాలో పాపం.. కొత్త బియం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా వున్నారా ? వున్న లేకపోయినా చెప్పటం నా బాధ్యత.. పొలం నుంచి తెచ్చిన వరిని , రోట్లో వేసి దంచి, పొట్టును మటుకు తీసేసేవారు.. ఏమ్మాతరం పాలిషింగ్, గీలిచింగ్ చెయ్యని మంచి బియం అన్నమాట..  

ఇంక చివరి రోజు , ఒక నాటు కోడి ని తెచ్చేవారు.. ఒక సరి ఏమైంది అంటే.. పండగ కి ఒక రెండు రూజుల ముందే కోడి ని తెచ్చారు.. ఆ రెండు రోజులలో .. ఆ కోడి మాకు మచ్చిక అయ్యింది.. చివరని రోజున చంప పోతుంటే పెల్లంధారం ఒకటే ఏడుపు.. ఇంకేం చేస్తారు.. మా కోసం దానిని చంపలేదు.. ఇంక ఇలాంటివి చాల తీపి గుర్తులు వున్నాయి.. అందరికి పండగలు అంటే వాళ్ళ ఊరు, ఇల్లు గుర్తుకు రావ్వొచ్చు.. కానీ నాకు మా తాత గారే గుర్తుకు వస్తారు.. అంతగా .. చివరికి నేను ఇంజనీరింగ్ చెన్నై లో చేరకకూడా.. సంక్రాంతికి గుంటూరు వెళ్ళకుండా , డైరెక్ట్ గా మా తాత దగ్గరకే వెళ్ళే వాడిని.. ఒక పీడా టీవీ పట్టే డబ్బా నిండా తినుబండారాలు చేసి నాతో పటు స్టేషన్ కి వచ్చి మరి ట్రైన్ ఎక్కించేవారు.ఇవి కాకుండా.. మా అమ్మ చేసే califlower  పచ్చిడి అంటే నాకే కాదు మా హాస్టల్ లో వుండే వాళ్ళ అందరికి ప్రాణం..

ఇవ్వని కాకుండా సంక్రాంతి ముగ్గులు, పక్కంటి వాళ్ళతో పోటి కోసం అమ్మ తో కొట్లాడి మరి ముగ్గులు వేయించేయ్ వాళ్ళం వాటిని మనం ఇంకో పోస్ట్ లో చూదాము..

ఇంక ఇలాంటివి చాల సంగతులు వున్నాయి.. రేపు సంక్రాంతి కదా గుర్తుకువచ్చి ఇవ్వని పోస్ట్ చేశా... ఏదో ఆఫీసు లో వుంది హడావిడి గా రాసాను.. చిన్న చిన్న తప్పులు  వుంటాయి.. చూసి చూడనట్టు వుండాలి.. :)

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..సంక్రాంతి మా లక్ష్మి అందరికి శుభాలు కలుగ చెయ్యాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న..
అన్నటు మరిచాను, పోయిన ఏడాది.. సంక్రాంతి మీద ఒక కవిత రాసాను.. అప్పట్లో తెలుగుని ఇంగ్లీష్ లో రాసే వాడిని.. ఏమి అనుకోవద్దు.. ఆ కవిత ని చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.. 

29, సెప్టెంబర్ 2010, బుధవారం

వర్షం తో నా కష్టాలు - పార్ట్ -2



ముందు పోస్ట్ లో వడగళ్ళు పడ్డాయి అని చెప్పా కదా.. తర్వాతి రోజున స్కూల్ కి వెళ్లి "అరేయ్ మా ఇంట్లో లో వడగళ్ళు పడ్డాయి తెలుసా అని" ఒకటే హడావిడి చేయాలి డిసైడ్ అయ్యా. ఐతేయ్.. వెంటనే మా స్నేహితులు నిజమా చా కోతలు  కోయి కోయి అన్నారు అంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదా.. అందుకే వెంటనే కింద పడి వున్నా వడగళ్ళ లో కొన్నిటిని తీసుకొని నా బాగ్ లో వేసుకున్న..
                    కనీసం ఒక కవర్ లో పెట్టాలి అని పెద్ద ఆలోచన వచ్చే వయసు కాదు కదా.. :(. ఇప్పుడు మన కథ లో సన్నివేశం తర్వాతి రోజు ప్రోదున్నే అన్నమాట. స్కూల్ టైం అవుతుంది అని హడావిడి గా రెడీ అవుతూ.. నిన్న పడిన  వర్షాన్నిగురించి నా ఫ్రెండ్స్ ముందు ఏమని గొప్పలు చెప్పాలా??? అని ఓ తెగ ఆలోచిస్తుంటే..అమ్మ ఏమో నా బాగ్ తేవటం కోసం ఇంట్లో కి వెళ్ళింది. ఒక అయిదు నిముషాలు తర్వాత పేద్ద సౌండ్ తో మెరుపు నా దగ్గర లో పడినంత ఫీలింగ్ వచ్చింది. ఎంటా ఆ శబ్దం అని ఆలోచిస్తుంటే... ఈ సారి సౌండ్ తో పాటు నా వీపు మీద నెప్పి కూడా పుట్టింది.. చూస్తే బాగ్ తో అమ్మ నా వీపు విమానం మోత మోగలే కొట్టింది.  వెంటనే నేను " నిన్న నే గా కొట్టను అన్నావ్" మరల ఎన్టింది యువర్ హొనౌర్ అని పెద్ద గా అరిచే లోపే.. "ఏంట్రా ఇది బాగ్ అంత తడి తడి గా వుంది.. వర్షం పడుతుంది అని నేను పైన పెట్ట కదా..మళ్ళ ఎందుకు తడి అయింది నువ్వు ఏమైనా చేసావా? " అని అడిగింది.. అప్పుడు గాని మన మట్టి బుర్ర వెలగాల... వడగళ్ళు కరిగి.. నా బాగ్ తో పాటు నా బాగ్ కింద పెట్టిన తమ్ముడి బాగ్ కూడా తడిసిపోయింది అని.. తర్వాత సీన్ మీ ఊహ కే వదిలేస్తున్న..

ఇలా చిన్నప్పుడు వర్షం వాళ్ళ రెండు సార్లు అమ్మ చేతిలో లో తాయిలం తిన్న.. సో వర్షం తో నేను కటిఫఫ్ .. అలా కటిఫ్ చెప్పాను అని వర్షం నా మీద వేరే లా పగ తీర్చుకుంది..

సరిగ్గా రెండు years  క్రితం.. నాకు బెంగుళూరు నుంచి ముంబై కి transfer  అయ్యింది.. కంపెనీ వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసారు.. అది జూన్ మాసం .. ముంబై వర్షాల గురించి చెప్పాలి అంటే.. జూన్ , జూలై , ఆగష్టు , ఈ మూడు నెలలో అందరి దగ్గర గొడుగులు వుంటాయి.. వర్షం పాడనీ రోజు ఉండదు అంటే అతిసయ్యోక్తి  కాదు.. మనకు ఇది అంత తెలియదు.. ముంబై కి బయలుదేరా..  యింక ముంబై లో ఇంకో   10 నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అనగా.. ఫ్లైట్ మళ్ళ పైకి తీసుకెళ్ళారు.. ఏంట్రా అంటే.. ముంబై లో అప్పుడు భారి వర్షం అంట.. లాండింగ్ కి చాన్సులు తక్కువ వున్నాయి అని ముంబై సిటీ పైన ఒక 30  నిముషాలు.. అలా ఫ్లైట్ ని తిప్పుతూ వున్నారు.. మధ్యలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ లా.. ఉరుమల వల్ల ఫ్లైట్ పైకి కిందకి ఊగుతూ వుంటే.. "దేవుడిని తలవని మనిషి లేడు ఫ్లైట్ లో".. ఆ సమయం లో కూడా నేను వర్షాన్ని తిడుతువున్న .. మరి నా తిట్లకో.. వాళ్ళ ప్రార్ధనలకో వర్షం శాంతించింది..

యింక ముంబై లో నా ఫస్ట్ డే గురించి ఒక పెద్ద బ్లాగ్ పోస్ట్ రాసుకోవచ్చు.. అన్ని విచిత్ర అనుభవాలు అనుభవించ.. అక్కడ...

ముంబై లో ఒక రెండు years  పనిచేయగానే.. మా కంపెనీ వల్లే.. పాపం పెళ్లి కావాల్సిన కుర్రాడు .. ఇక్కడ వుంటే మంచి సంబందాలు రావు ఏమో ఎని.. దయ తలచి.. మళ్ళ నన్ను బెంగుళూరు తిరుగు టపా కట్టించారు..రెండు ఏళ్ళు అక్కడ వుండటం వాళ్ళ ముంబై లో చాల మంది ఫ్రండ్స్ అయ్యారు.. అంత కలిసి గ్రాండ్ గా send ఆఫ్ పార్టీ ప్లాన్ చేసారు.. నేను శని వారము అక్కడి నుంచి బస్సు బుక్ చేసుకున్న.. సో మా వాళ్ళు అంత.. ఫ్రైడే నైట్ కి పార్టీ అన్నారు.. కానీ.. నా ప్రియ మిత్రుడు (వర్షం) ఇక్కడ కూడా నన్ను వదలలేదు..

ఫ్రైడే రాత్రికి స్టార్ట్ అయిన పెద్ద వర్షం.. తగ్గలేదు.. యింక ఒక్కకరే ఫోన్ చేసారు.. "మామ రావటం కష్టం వర్షం పడుతుంది" రేపు పోదున్నే కలుద్దాం అన్నారు.. శనివారం వర్షం యింక తగ్గల.. చూస్తుంటే టైం మధ్యానం అవుతుంది.. luggage  ఏమో చాల వుంది.. ఆ వర్షం లో ఆటో వాళ్ళు కూడా రావటం లేడు.. బస్సు కేమో అట్టే టైం లేదూ... ఫ్రండ్స్ నీ ఆ వర్షం లో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదూ.. ఏమిట్రా దేవుడా ఈ వర్షానికి నా మీద పగ అని ..  యింక చివరికి బాబా ని తలుచుకున్న.. ఒక 5  minutes  లో ఆటో దొరకింది.. కానీ అంత luggage తో నాతో పాటు రావటానికి ఒక్కరికి ఛాన్స్ వుంది.. అందరు వచ్చి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇద్దాము అనుకున్నది వర్షం వాళ్ళ ఇలా అయ్యింది.. :(

 బస్సు స్టాప్ కెళ్ళి పాటికి యింక వర్షం పడుతుంది.. ఎంత గొడుగు పట్టుకున్న.. తడుస్తం కదా.. వర్షం లో అలా తడుస్తూ.. luggage  మీద మటుకు కవర్ వేశా..వర్షం వాళ్ళ బస్సు కూడా గెంట లేట్ గా వచ్చింది.. ఆ పాటికి నేను సగం తడిసిపోయ.:( . వోల్వో బస్సు లో తడి బట్టలతో కోర్చుంటే వుండే నరకం.. ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. వేడి వేడి టీ తాగి నోరు  కాల్చుకున్న వాడికి బజ్జి ఇచ్చి తినమంటే.. ఎలా వుంటుందో.. దాని కంటే దారునాతి దారుణం గా వుంటుంది..

యింక నా వాళ్ళ కాకా.. వర్షం తో రాజి పడ్డ.మనం మనం ఒకటి అని.. అయిన వర్షం నా మాట వింటాం లేదూ.. ఇప్పుడు బెంగుళూరు లో యింక చుక్కలు చూపిస్తోంది.. మొన్న ఫ్రైడే (24 -10  - 2010) ఇంటికి వెల్లదాము అని బయలుదేరి అలా ఆఫీసు నుంచి బయటకి వచ్చానో లేదో.. పెద్ద వర్షం మొదులు అయ్యింది.. యింక తడుస్తూ ఏమి వెళ్తాం లే అని ఆగాను... ఆ ఆగటం ఆగటం మూడు గెంటలు దాక అలా అగేవున్న.. మీరే చెప్పండి.. ఫ్రైడే అందులో వీకెండ్ రూం కి వెళ్లి పండుగచేదాం అనుకుంటే.. ఇలా వర్షం అడ్డుపడి.. చివరికి రాత్రి పదకొండు కి .. ఇంటికి వెల్ల...  ఇలా వర్షం నాతో నిత్యం బాట్టింగ్ చేస్తూనే వుంది..

మీలో ఎవరు అయిన వర్షం లో త్రిష లాగా వర్షం తో మాట్లాడే వాళ్ళు వుంటే నా గోడు నా బాధ చెప్పాడు ప్లీజ్..






అనుభవాలు

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నేను - వర్షం


మనకు చిన్నప్పుడు వుండే ఇష్టాలు కాలక్రమేనా అవి కష్టాలు గా మారుతాయి అని అంటారు. వాన విషయంలో నాకు ఆ అనుభవం అయ్యింది.

స్కూల్ టైం లో వాన పడితేయ్ యింక మనకు పండుగే పండుగ, ఎందుకు అని అడగరే.. వర్షం లో  తడుసుకుంటూ స్కూల్ కి వెళ్తే జ్వరం వస్తుంది అని అమ్మ ఈ పూట కి స్కూల్ వద్దు లేరా అనేది..ఎంచక్కా హోం వర్క్ చేయాల్సిన పని వుండేది కాదు ఆ రోజుకి  అందుకే నాకు వర్షం అంటే చాల ఇష్టం.

                       ఒక సారి నేను 1st  క్లాసు  లో వుండగా , గుంటూరు లో పేద్ద వడగళ్ళ వాన పడింది.. అప్పటికి యింక మా ఇంట్లో fridge  లేదు.. నాకు పై నుంచి పడుతున్న వడగళ్ళ ని చూసి ఒక ఆలోచన orange  కలర్ లో వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి " నాకు rasna కావాలి అని తెగ గొడవ చేశా". వర్షం లో rasna  ఏంట్రా అని అమ్మ విసుక్కుంటే .. " వర్షం లో టీ ఎవడు అయిన తాగుతాడు , rasna తాగాలి అంటే కాల పోషణ వుండాలి" అని చెపుదాం అంటే అప్పటికి యింక "నువ్వే నువ్వే" సినిమా రిలీజ్ కాలేదు.  మన బిక్క బోహం చూసి పోనిలే అని అమ్మ rasna  కలిపి ఇచ్చింది . నేను వెంటనే వరండా లోకి పరిగెతుక్కుంటూ వెళ్లి ఆ rasna  బాటిల్ లో కింద పడుతున్న వడగళ్ళని తీసుకొని గ్లాస్ లో వేసుకొని rasna  ని కొంచం తాగుతూ  పేద్దగా "I Love  You  Rasna " అని అరిచా...

             మన అరుపు విని అమ్మ బయటకి వచ్చి నా వాలకం చూసి , గ్లాస్ లో వున్నా వడగళ్ళ ని చూసి.." వేదవ " అని వీపు విమానం మ్మోత మోగించింది.. నేను వెంటనే అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడి లా " టీవీ లో అమ్మాయి ఇలా అంటే బలే ముద్ద గా వుంది అన్నావ్... నేను చేస్తే కొడుతున్నావ్.. నీకు నేనంటే ఇష్టం లేదా అధ్యక్షా ...." అని గాట్టిగా అరిచా... అరచిన తర్వాత మా అమ్మ మీద అలిగా .

వర్షం పడుతుంది అని అమ్మ వేడి వేడి గా పకోడీ మరియు పాయసం చేసింది.. " నాని గా టిఫిన్ తిందువు రా అని పిలచినా మనం అలిగాం కదా.. నేను అస్సలు మాట్లాడల లేదు.. ఆ వైపు కూడా చూడలేదు. అమ్మ నన్ను ఒక ఐదు నిముషాలు పిలిచి సర్లే ని ఇష్టం ఐతేయ్ తిను లేక పోతేయ్ లేదు అని పిలవటం మానేసింది. నా తమ్ముడు మటుకు "అన్న వైపు నుంచో వాలో.. అమ్మ వైపు నుంచోవాలో చాల సేపు అలోచించి.. పాయసం వాసన ప్రభావం వాళ్ళ అమ్మ వైపు తప్పు లేదు అని తీర్మానించి.. శుబ్రంగా వెళ్లి పలహారాల  పని పడుతున్నాడు..

పిలుస్తారు ఏమో అని ఒక పది నిముషాలు చూసా, అస్సలు నేను ఒకడిని వున్నా అన్న విషయం తెలియనట్టు గా వాళ్ళ పని లో వాళ్ళు వున్నారు.  పాపం నాన్న గారే.. నన్ను చూసి వాడిని కూడా పిలువు అని అమ్మతో అన్నారు..కానీ అమ్మ మటుకు "ఏమి అవసరం లేదు.. ఇలా చేస్తే వాడు మొండి గటం లో మార్తాడు.. మరేం పర్లేదు.. ఒక్క పూట కడుపు మాడినంత మాత్రాన ఏమి కాదు అని అన్నది.. యింక ఏ పక్షం మన దారికి వచ్చేలా లేదు అని.. నేను తగ్గా..ఏమి చేస్తాం చెప్పండి ఈ పేద్ద వాళ్ళు ఉన్నారే చిన్న వాళ్ళ కోరికలు  ఎప్పటి అర్ధం కావు అని సరిపెట్టుకున్న..

చిన్న గా వెళ్లి నేను వాళ్ళో తో జాయిన్ అయ్యా.. తల వంచుకొని.. తింటున్న.. అప్పుడు అమ్మ నా తల మీద చెయ్యి వేసి.. నాని గా కోపం గా వుందా.. అంటే.. నేను నీతో మాట్లాడునుపో.. ఊరికే కొట్టావ్ అని ఏడిచా..(ఇలాంటి టైం లోనే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది).. అమ్మ ఏమో " అల కాదు రా నాని ఆ వడగళ్ళు కింద పడ్డాయి కదా.. వాటిని తింటే కడుపు నెప్పి వస్తుంది రా..  అందుకే కొట్టా రా.. " అని చెప్పి.. వెంటనే నాన్న వైపు తిరిగి " fridge  కొనండి ఒకటి తొందరగా .. నాని కి rasna   చేసిపెట్టాలి అని చెప్పారు". నాన్న fridge  కొంటారు, నాకు బోల్డు రస్నా వస్తుంది అని చిన్న ఊహ మైండ్ లోకి రాగానే. నాకు కోపం అంత పోయి.. గాట్టిగా అమ్మని ముద్దు పెట్టేసుకున్న..

అలా ఆ రోజు వర్షం వల్ల.. మా ఇంట్లో fridge  అని వస్తువు గ్రాంట్ అయ్యింది అన్నమాట.. అందుకే అధ్యక్ష్య.. నాకు వర్షం అంటే చాల ఇష్టం..

ఇందాకట్నుంచి వర్షం అంటే ఇష్టం అని తెగ కబురులు చేపుతున్నావ్.. మరి కష్టాలు కూడా చెప్పు అని అంటారా...చెప్తా.. చెప్తా.. దాని గురించి  తర్వాతి టపా లో చెపుతా.. కానీ వర్షం వాళ్ళ నేను పడిన కష్టాలు పగ వాడికి కూడా వద్దు సుమీ..

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

మేము మా చిట్టి వినాయకుడు



 చిన్నతనం  నాకు బాగా ఇష్టమైన పండుగులు మూడు 1 ) వినాయక చవితి 2 ) దసరా 3 ) సంక్రాంతి . ఎందుకంటే ఈ మూడు పండుగలకు మేము మా చిన్నఅమ్మ(పిన్ని ని నేను ఇంతే పిలుస్తా)   వాళ్ళు  అందరం కలిసి మా తాతా గారి ఊరికి వెళ్తాం కాబట్టి .ఇంకా తాతా గారి ఊరిలో మేము అందరం పంజరం నుంచి బయట పడిన పక్షులం , చైన్ తెగిన బొచ్చు కుక్కలం. పిచ్చ పిచ్చ గా తిరిగివాళ్ళం.  అడ్డుచేప్పేవారు ఎవరు మాకు?  ఏమైనా అంటే మాకు అండ గా మా తాతా గారు సపోర్ట్ కి వచ్చేసేవారు.

                                       నేను , నా తమ్ముడు చిన్న , చిన్నమ్మ  వాళ్ళ  అబ్బాయిలు  " చిన్ను , బాబి ". నలుగురం ఒక జట్టు అన్నమ్మాట.ఒకటి ఒక సరి ఫిక్స్ అయ్యాము అంటే.. ఇంకా అంతెయ్, రచ్చ రచ్చే. చిన్న example  చెప్పనా , ఒక సారి మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయింది, అమ్మ డబ్బులు ఇవ్వు బాల్ పోయింది అంటే.. డబ్బులు లేవు గిబ్బులు లేవు అక్కడ వాడి పడేసిన "prachute " డబ్బా వున్నది దాన్నే బాల్ గా ఆడుకోండి అంది. మేము ఆ డబ్బా కి దారం చుట్టి బాల్ లా చేసి పండగ చేసుకున్నాం. బాల్ కంటే ఆ డబ్బా తోటే మజా వచ్చింది, మా తమ్ముడు కొట్టిన భారి షాట్ కి బాల్ అదేయ్ లెండి డబ్బా పోయింది. ఈసారి మా తాతా మా కోసం బాల్ కొన్నారు కానీ, డబ్బా లో వచ్చిన మజా బాల్ తో రాలేదు. ఇంట్లో అంత వెతికాం డబ్బా దొరికుతుంది ఏమో అని.. కానీ లాబం లేకుండా పోయింది. ఇంకా వెంటనే చిన్న గాడు కార్యరంగం లోకి దిగి అప్పుడే కొని తెచ్చిన పరచుటే డబ్బా లో వున్నా నూనె మొతాన్ని ఓంపేసి, దారాన్ని చుట్టి మాకు ఇచ్చాడు. తర్వాత ఏముంది ఇంట్లో వాళ్ళు కొబ్బరినూనె కోసం వెతికి అస్సలు ఆ డబ్బా నీ మిస్ అయ్యింది అనుకోని ఇంకో కొత్త parachute  కొనుకున్నారు.  ఈ విషయాన్నీ ఎవ్వరు మా అమ్మ కి చెప్పా వద్దు చేపితేయ్ అన్తెయ్ నా పని.

ఇలా పండుగల లో పని లేకుండా ప్రతి పండుగకి ఒకలే (అంటే క్రికెట్ మరియు పొలం మీద గాలి తిరుగుళ్లతో) ఆనందం గా గడుపుకుంటున్న సమయం , ఒక నొక రోజున నా బుర్ర లో మంచి ఆలోచన వచ్చింది.మనం కూడా ఎందుకు ఒక వినాయకుడి  బొమ్మని ని పెట్టి పూజ చేయకూడదు అని. దసరా కి , చవితి కి , మా ఊర్లో బొమ్మలు పెట్టి బాగా హడావిడి చేస్తారు. వాళ్ళ అంత కాకపోయినా కొంచం అయిన బాగా చేయాలి అని ఫిక్స్ అయ్యం. వెంటనే మా ఫైనాన్సు డిపార్టుమెంటు అయిన అమ్మ కి వెళ్లి అర్జి పెట్టుకున్నాం.. కానీ మా మాతృ మూర్తి కరుణ రసం కాకుండా రౌద్ర రసం తో మములని వాయించి , ముందు ఇంట్లో చేస్తున్న పూజుకి సరిగా కూర్చోవటం నేర్చుకోండి తర్వాత మీరు చేయండి అని చిన్న పాటి పెద్ద క్లాసు పీకేపాటికి మేము సైలెంట్ అయిపోయాం. కాని ముందే చెప్పా గా మేము ఒక సరి కమిట్ అయ్యాము అంటే, అమ్మ చిపిరి కట్ట తిరగాతిప్పి  కొట్టిన కూడా  మాట వినం.

అందుకని ముందు గా వినాయకుడి బొమ్మ కోసం తెగ వెతికం.. చివరికి ఒక రాయికి వినాయకుడి రూపం వున్నటు మాకు అనిపించింది. వెంటనే వెళ్లి ఇంట్లో వున్నా పసుపు తెచ్చి ఆ రాయిని కి బాగా పూసి , వినాయకుడి రోప్పం తెప్పించేసాం. ఇప్పుడ విగ్రహ ప్రతిష్ట , ఇంటి వెనకాల కొట్టం లో ఒక మూల పెట్టేసి , చుట్టుత చిన్న చిన్న రాళ్ల తో ఒక బోర్డర్ కట్టాం. పూలు పెద్ద సమస్య కాదు , మా ఇంటి వెనకాలే మల్లె పూలు తోట వుంటుంది, మా పెద్దమ్మ వాళ్ళదే . పత్రి కోసం పోలలలో తెగ తిరిగి తెలిసినవి తెలియనవి అన్ని కోసుకోచ్చం.

తర్వాత పలహారాలు ఏమి చేయాలి..అని తెగ అలోచించి ,  ఇంట్లో నుంచి పంచదార , బెల్లం , చివరికి మా తాతా మాకు కొని ఇచ్చిన కిల్లి బిల్లలని కూడా పలహారం లా మర్చేసం.  అంత అక్కడ సెట్ చేస్తుంటే మా అమ్మ ఒకటే గొడవ. " ఒరేయ్ ఇంట్లో పూజ స్టార్ట్ అవుతుంది" రండి అని.. మేము మా బుల్లి గణపతి దగ్గర అన్ని అలా సర్దేసి..ఇంటిలోకి వెళ్ళాం. పూజ అయ్యి అవ్వగానే పరుగెత్తు కుంటూ మా బొమ్మ దగ్గరికి వచ్చేసాం. చూస్తే ఏముంది పలహారం మొత్తం చీమల మయము. ఇంకా మాకు ఏడుపు ఒక్కటే తక్కువ.. ఈ లోపు చిన్నామ్మ , అమ్మ కొట్టం లోకి వచ్చి మా సెట్ అప్ చూసి నవ్వుకున్నారు.అమ్మ బాగా చేసారు అని మెచ్చుకుంది , కానీ మా ఏడుపు మొహాలు చూసి ఏమైందిరా అని అడిగింది. మేము చీమల తో నిడిన పలహారం చూపించం. అమ్మ నవ్వుతు " పిచ్చి తండ్రి , దేవుడు ఆ రూపం లో వచ్చి మీ పలహారాలు తిన్నాడు అని చెప్పింది".  ఆ మాట వినగానే మేము ఫుల్ గా ఖుషి అయిపోయాం,

అమ్మ ఏమో " మీరు బొమ్మ పెడతాను  అంటే ఏమిటో అనుకున్నాం కానీ పసుపు తో  ఆ రాయికి  వినాయకుడి రూపు ని బాగా తెచ్చారు అని" ఒక కామెంట్ ఇచ్చేసి.. వుండండి ఇంకా మీ గణపతి ని పలహారాలు పెడుదాం అని ఇంట్లో వండిన "పాయసం,పులిహోర, కుడుములు , ఉండ్రాళ్ళు " అన్ని కొంచం కొంచం ప్లేట్ పెట్టి ఇచ్చింది.,

సాయంత్రం మేము చేసిన హడావిడి అంత ఇంత కాదు. వినాయకుడి నేను నా తల మీద మా వీధి అంత ఊరేగించా. ఆ వీధిలో వుండే వాళ్ళు అంత మా చుట్టాలే.. అందరికి తల కొంచం ప్రసాదం (అంటే పంచదార , బెల్లం,కిల్లి బిల్ల mix ) పెట్టం. చివరకి మా వీధిలో చివర్లో వున్నా కలువ లో నిమ్మజనం చేసాం.

తర్వాత సంవత్సరం నుంచి ఇంట్లో వినాయక చవితి టాస్క్ మా తొట్టి గ్యాంగ్ కి ఇచ్చేసారు.

మొన్న చవితి కి కూడా మా ఊరు వెల్ల నాన్నమ్మ ని చూదాము అని. ఐతేయ్ మా ఇంటి దగ్గరే మా లాగే మేము చేసినట్టే ఇప్పుడు అక్కడ మా పెద్దక్క (పెదమ్మ వాళ్ళ అమ్మాయి )పిల్లలు చేస్తున్నారు.. దిన్నె వారసత్వం అంటారు.. కాకపోతేయ్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మా వాళ్ళు dairy milk , cadbury 's  షాట్స్ పెట్టారు.

ఇంకా మా చిన్నప్పటి అల్లర్లు చాల వున్నాయి.. వాటి తో మళ్లీ  మీ ముందుకు వస్తా..