14, జనవరి 2011, శుక్రవారం

మా ఇంట సంక్రాంతి


అందరు.. గతం గతః  అంటారు కానీ.. గతాన్ని తలుచుకుంటే ఎంత బావుంటుందో.. కదా, అందమైన బాల్యం, అమ్మ మూరిపాలు, అల్లరి ఆటలు.. అబ్బో ఒకటి ఏమిటి బలే వుండేది లే.. ఇంతకు ముందు నేను చెప్పిన్నట్టు.. సంక్రాంతి సెలవలు రాగానే.. మేము, చిన్న అమ్మ వాళ్ళం, అత్త వాళ్ళు అందరం తాతయ్య దగ్గరకు వెళ్ళేవాళ్ళం.పండగకి ఒక 3 రోజులు ముందుగానే సందడి మొదలు అయ్యేది..  అరిసెలు, చక్రాలు, మిఠాయి, లడ్డులు వండటం లో అమ్మ , అత్త లు అంత బిజీ గా వుండేవాళ్ళు.. మేము(అంటే పిల్లలు అందరం) కూడా నాన్న, బాబాయి.. పిండి దంచుతుంటే, వాళ్ళకి నీళ్ళు, టీ , కాఫీ ఇవ్వటం లో బిజీ గా వుండేవాళ్ళం. చుట్టూపక్కల అంత వుండేది మా చుట్టాలే.. వాళ్ళు కూడా తల ఒక చెయ్యి వేస్తూ , కబుర్లు చెప్తుంటే బలే వుండేది.
                                                     
ఇక్కడ బియ్యపు పిండి దంచుతుంటే, ఆ పక్క ఆడవాళ్లు బెల్లపు పాకం చేసేవారు.. మేము , పాకం దగ్గరికి , పిండి దగ్గరికి అటు ఇటు తిరుగుతూ.. పిండి ని పక్కని బట్టలకి పూసుకుంటూ, తిట్లు తింటూ.. సిగ్గులేకుండా ఇంకా ఎక్కువ గొడవ చేసేవాళ్ళు..  అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చెయ్యి ఎత్తితేయ్.. దీవార్ సినిమా లో డైలాగ్ లా మేము కూడా "మేరి పాస్ తాతయ్య హై" అని చెప్పి వాళ్ళని బయపెట్టే వాళ్ళం. అరిసెలు చేయాలి అంటే ముందు చలిమిడి చెయ్యాలి కదా.. అలా చేస్తున్నప్పుడు మేము కూడా ఒక చెయ్యి వేసేవాళ్ళం.. సహాయం చెయ్యటం  కోసం అనుకుంటే మీరు పొరపడినట్టే..చెయ్యి పెట్టినట్టే పెట్టి ఒక పెద్ద ముద్ద ని తీసుకొని.. పరుగో పరుగు.. అల అ చలమిడి ముద్ద ని గడ్డివాము మీద తింటూ వుంటే ఆ మాజా నే వేరు.. ఇంక బూంది , లడ్డులు చేస్తున్నప్పుడు కూడా ఇలా మా గొడవ మా తాత గారి సహకారం తో నిరాటంకంగా లేతబెల్లపు పాకం లా సాగుతూఊఊఉ  వుండేది..

భోగి రోజున మా బోగాలు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ముందే రోజే.. ఇంట్లో వున్న పాత సామానుని., బర్రెల కొట్టం లో పాత తట్టలని పోగు చేసి పెట్టేవాళ్ళం. పొద్దునే ఐదు కల్ల లేపేవారు.. అందరం కలిసి ఇంటి వెన్నకి వెళ్లి, పోగు చేసిన సామాను మీద కిరసనాయులు చల్లి నిప్పు పెట్టె వాళ్ళం.. మా ఇంటి వెనకాల అంత పోలలే ఉండేవి.. పొగమంచు లో పచ్చ్చదనం కనిపించి కనిపించక ..ఎంత బావుండేదో.. అంత చలి లో.. తాతయ్య , నేను ఒకే రగ్గు కపోకొని.. చలి కాచుకునే వాళ్ళం..అన్ని కోట్లు ఇచ్చి ఆ ఆనందం ఇప్పటికి రాదూ.. ఈ లోపు అమ్మ వాళ్ళు వేడి వేడి కాఫీ తెచ్చేవారు.. తరవాత ఆ బోగి మంటలలో పెద్ద పెద్ద కాగులు పెట్టి నీళ్ళు కాచుకొని స్నానాలు కానిచ్చే వాళ్ళం. ఇవ్వన్ని కాకుండా ఇంటి ముందు ముగ్గులు , హరిదాసు హడావిడి అంత చెప్పిన తక్కువే..

సంక్రాంతి పండుగ రోజున..అందరికి కుంకుడు రసం తో తలస్నానం చేపించేయ్ వారు, అప్పటి దాక మా పార్టీ వుండే తాత గారు.. ఆ ఒక్క రోజు మటుకు అమ్మ వాళ్ళ తో కలిసి మాతో బలవంతం గా తలస్నానం చేపించేయ్ వారు.. కొత్త బట్టలు వేసుకొని  వచ్చే లోపు, అమ్మ వాళ్ళు బాండి పెట్టి గారెలకి రంగం సిద్ధం చేసే వారు.. అల వేస్తూ వుంటే మేము ఇలా లాగిస్తూ వుండేవాళ్ళం.. అమ్మ ఏమో పిండి ని కవర్ మీద పెట్టి, చక్కగా గా వత్తి , బాండి లో వేస్తే.. చిన్నమ్మ వాటిని నూనె లో వేగించి బయటకు తీసేది.. తీసిన వాటిని మా అత్త మాకు ప్లేటులో పెడుతువుండేది..  ఇక్కడ మా తాత గారు ఎంటర్ ది డ్రాగన్ లా వచ్చి పిల్లలకి పోటి పెట్టేవారు.. ఎవరు ఎక్కువ గారెలు తింటే వాళ్ళకి అన్ని గాలిపటాలు కొనిపిస్త అని చెప్పారు.. ఇంక మేము ఆగుతామా.. "కళ్యాణ్ రామ్ కత్తి స్టైల్ లో " పది , ఇరవయ్ , లెక్కమీ ఓపిక " అన్నట్లు , సెహ్వాగ్ బెట్టింగ్ చేసిన్నట్టు , వాయులు వాయలూ తినేసే వాళ్ళం.. ఇసుగు పుట్టి ఆడవాళ్లు ఇంక ఎన్నిరా . అని ఇసుకు కుంటే  , మా తాత.. "పిల్లలకి దిష్టి పెడతారే" అని గయ్యిన లేగిసే వాళ్ళు..ఇవి కాకుండా..నాకు ఇష్టమైన కొత్త బియం తో చేసిన "పరమాన్నం" కూడా వుండేది. బుజ్జి పొట్టకి ఆ రోజుల్లో ఎన్ని కష్టాలో పాపం.. కొత్త బియం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా వున్నారా ? వున్న లేకపోయినా చెప్పటం నా బాధ్యత.. పొలం నుంచి తెచ్చిన వరిని , రోట్లో వేసి దంచి, పొట్టును మటుకు తీసేసేవారు.. ఏమ్మాతరం పాలిషింగ్, గీలిచింగ్ చెయ్యని మంచి బియం అన్నమాట..  

ఇంక చివరి రోజు , ఒక నాటు కోడి ని తెచ్చేవారు.. ఒక సరి ఏమైంది అంటే.. పండగ కి ఒక రెండు రూజుల ముందే కోడి ని తెచ్చారు.. ఆ రెండు రోజులలో .. ఆ కోడి మాకు మచ్చిక అయ్యింది.. చివరని రోజున చంప పోతుంటే పెల్లంధారం ఒకటే ఏడుపు.. ఇంకేం చేస్తారు.. మా కోసం దానిని చంపలేదు.. ఇంక ఇలాంటివి చాల తీపి గుర్తులు వున్నాయి.. అందరికి పండగలు అంటే వాళ్ళ ఊరు, ఇల్లు గుర్తుకు రావ్వొచ్చు.. కానీ నాకు మా తాత గారే గుర్తుకు వస్తారు.. అంతగా .. చివరికి నేను ఇంజనీరింగ్ చెన్నై లో చేరకకూడా.. సంక్రాంతికి గుంటూరు వెళ్ళకుండా , డైరెక్ట్ గా మా తాత దగ్గరకే వెళ్ళే వాడిని.. ఒక పీడా టీవీ పట్టే డబ్బా నిండా తినుబండారాలు చేసి నాతో పటు స్టేషన్ కి వచ్చి మరి ట్రైన్ ఎక్కించేవారు.ఇవి కాకుండా.. మా అమ్మ చేసే califlower  పచ్చిడి అంటే నాకే కాదు మా హాస్టల్ లో వుండే వాళ్ళ అందరికి ప్రాణం..

ఇవ్వని కాకుండా సంక్రాంతి ముగ్గులు, పక్కంటి వాళ్ళతో పోటి కోసం అమ్మ తో కొట్లాడి మరి ముగ్గులు వేయించేయ్ వాళ్ళం వాటిని మనం ఇంకో పోస్ట్ లో చూదాము..

ఇంక ఇలాంటివి చాల సంగతులు వున్నాయి.. రేపు సంక్రాంతి కదా గుర్తుకువచ్చి ఇవ్వని పోస్ట్ చేశా... ఏదో ఆఫీసు లో వుంది హడావిడి గా రాసాను.. చిన్న చిన్న తప్పులు  వుంటాయి.. చూసి చూడనట్టు వుండాలి.. :)

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..సంక్రాంతి మా లక్ష్మి అందరికి శుభాలు కలుగ చెయ్యాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న..
అన్నటు మరిచాను, పోయిన ఏడాది.. సంక్రాంతి మీద ఒక కవిత రాసాను.. అప్పట్లో తెలుగుని ఇంగ్లీష్ లో రాసే వాడిని.. ఏమి అనుకోవద్దు.. ఆ కవిత ని చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.. 

19 కామెంట్‌లు:

జయ చెప్పారు...

నిజంగా సంక్రాంతి సంబరాలు ఎప్పటికీ మరిచిపోలేనివే. పండగల్లో జంతు హింస మాత్రం భరించలేనిదే. దాన్ని ఆపినందుకు కంగ్రాట్స్. కవిత కూడా చాలా బాగుంది. పోస్ట్ రాసినట్లే వ్యాఖ్యలు కూడా తెలుగులో రాయొచ్చుకదా. హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Sasidhar Anne చెప్పారు...

అక్క, ఈ బ్లాగ్ తో పాటు నాకు మూవీస్ మీద ఒక బ్లాగ్ వుంది కదా.. బ్లాగ్ మొతాన్ని తెలుగు లో వచ్చేలా చేస్తే.. ఆ మూవీస్ బ్లాగ్ కూడా తెలుగు లోనే వచ్చేస్తుంది.. అందుకే కామెంట్స్ మటుకు ఇంగ్లీష్ లోనే రాస్తున్న.
ఇక నుంచి గూగుల్ transliterate ద్వార కామెంట్స్ కూడా తెలుగు ఇచ్చేలా ప్రయత్నం చేస్తాను.. జంతు హింస ఆపింది ఆ ఒక్క రోజే.. మాములు రోజులలో చికెన్ ని చాల ఇష్టం గా తింటాను..కానీ మరల మొన్న జనవరి ఫస్ట్ నుంచి ఒక నాలుగు నెలలు మాంసాహారం తినకుండా వుండాలి అని ఫిక్స్ అయ్యాను.

కనుమ శుభాకాంక్షలు..

శిశిర చెప్పారు...

చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు. నాలుగు నెలలే తినకూడదని ఫిక్స్ అయ్యారా? ఈ సంక్రాంతి సందర్భంగా నాలుగు నెలలని నాలుగేళ్ళు చేయకూడదూ? ఆ తరువాత అదే అలవాటయిపోతుంది. ప్రయత్నించండి. :)
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Sasidhar Anne చెప్పారు...

శిశిర గారు.. పోయిన ఏడాది కూడా జనవరి - మార్చి దాక, జూలై నుంచి ఆగష్టు దాక మాంసాహారం తినలేదు.. కాకపోతేయ్ ఎప్పటికి మానేయాలి అనుకోవటం కొంచం కష్టమే.. ఇలా రెండు మూడు నెలలు break ఇస్తున్నందుకే. ఇంట్లో అమ్మ , నాన్న లు క్లాసు పీకుతున్నారు. ఇలా breaks వాళ్ళకి కూడా అలవాటు చేసి ఒకేసారి.. మనేసేలా ప్రయత్నిస్తాను..

శివరంజని చెప్పారు...

శశిధర్ గారు మీ సంక్రాంతి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి ..టపా చాలా బాగుంది ... ..... ఈ సంక్రాంతి పండగ అయితే అమ్మాయిలకే ఎసెట్ ..ముగ్గులు , గొబ్బిళ్ళు పెట్టుకోవడం ఈ పండగ మొత్తం మీద అమ్మాయిల హడావిడే ఎక్కువ వుంటుంది

Sasidhar Anne చెప్పారు...

ఒక్క సంక్రాంతి ఏమిటి అండి.. ఏ పండుగకి అయిన అమ్మాయిల హడావిడే ఎక్కువ వుంటుంది.. మీ కంటే సంక్రాంతి మాకు పెద్ద లాభం, ఎందుకంటే.. అమ్మాయిలని లంగా ఓణిలో ఎంచక్కా చూడవచ్చు.. :). తెలుగు అమ్మాయి లంగా ఓణి వేసుకొని.. ముగ్గు వేస్తుంటే.. చూస్తే కళ్ళకి చాల మంచిది అంట..

Ennela చెప్పారు...

తెలుగు అమ్మాయి లంగా ఓణి వేసుకొని.. ముగ్గు వేస్తుంటే.. చూస్తే కళ్ళకి చాల మంచిది అంట..
best quotation..hahaa...baagundi..

Sasidhar Anne చెప్పారు...

Ennela..garu adhi quotation kadu andi nijam ga nijam..
Monna bangalore lo kallaki kagada vesukoni mari vethika langa oni vesukunna telugu ammayi kosam.. kani ekkada kanipaithey ga.. tarvatha telisindhi andharu pandga vacation ki vellaru ani.

శివరంజని చెప్పారు...

అయ్యబాబోయ్ శశిధర్ గారు మీ పోస్ట్ లు చదివి మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా కాని మీ comment చదివాక మీరు చాలా బ్రిలియంట్ సుమండి

Sasidhar Anne చెప్పారు...

sivaranjani garu anthey nantara..Sare alage kannidam.. kani nenu mari antha brillaint ni kadu..
Appuduappudu ila brilliants tho matladuthunnapudu jnana bulb ala velluguddhi annamata..

Ennela చెప్పారు...

hahahha..mari andhra pallello vetakaali kaanee , ekkado city llo kaagada kattukuni vetikinaa yem laabham... mari mee kallu jaagarta..maaku vaatito chala pani undi...ikkada boldu postingulu wrraayali meeru...kaabatti kaneesam internet lo ayina vetiki choostoondandi maa kosam please please....

Sasidhar Anne చెప్పారు...

ennala garu..bangalore kooda boldu telugu santha vundi andi.
Forum mall ki velthey ki mana telugu vallu chala mandi kalisaru.. Manalo mana mata sarvana masam first friday akkada nenu oka ammayi ni langa oni lo choosi telugammayi, teluagammayi ai pedda ga padesa..
Anduke malli monna velli vethika..

internet lo evaru peduthunnaru andi Langa oni photulu..:)

Ennela చెప్పారు...

avuna! meeku comment wrayagaaney sardaga(mee kosam) google lo half saree ani kodite boldu sites vachchayi..hahaha
maaku ikkada canadalo sankranti, ugadi, deepavali jarupukuntaamu telugu associations lo...peddalandaru cheeralu...pillalandaru general ga langa oneelu..vesukostaaru...manchu, chali unnaa lekka cheyyaru...muchchataga untundi chalaa programs avee jarugutaayi.....chala hadavidi....

Ennela చెప్పారు...

meeru ala peddaga paadite elaagandee...paapam bediripoyi raavadam maanesi untaaru...

Sasidhar Anne చెప్పారు...

ha ha ennela garu chala thanks naa kosam photos vethiki nanduku :) rojantha computer munde work chestha.. chivariki ammayilani kooda computer lone chudamante ela cheppandi ;)
yeah, tana akkada associations gurinchi chala vinna.akkada pillalu kuchipoodi chakkaga nerchukunte ikkada matuku western gola lo paddaru..

enthaina.. doorapu kondalu nunupu kada. :)

Sasidhar Anne చెప్పారు...

inko sari naa patalani kani gaathranni kani kinchaparisthey.. "naa pata panchamrutham" ano modalu pedatha mee istam..
hamma.. naa patalani comment chesthara..!

Ennela చెప్పారు...

ayyayyo, mimmalni kinchaparachaledandee...inkedayina sandarbhamlo ala paadunte...tappakundaa mechchukovachchu...but ammayi kanabadagaane...telugu pillo ani paadite..vekkiristunnaranukuni bediriporaa antaa...sorry mimmalni ala baadha pettinanduku...daanki viruguduga...naa comment idigo..

paadavoyi bhaarateeyuda..nee paluke panchadaara chilaka..nee paate chakkera molaka...

kshaminchesaara sir?

Sasidhar Anne చెప్పారు...

Mothaniki nenu "Naa pata" ani raagam etthutha ni grahinchi bane mosesthunnaru.. :)
alanti patalu padithey bedri potharu antara.. okay :) manchi songs enchukoni mari paduthanu lendi ;)

kakapothey manam ee pata padina adhi oka mass song lane vuntundhi.. gonthu mahatyam alantidhi..

repu mee blog meeda danda yatra prakatisthunna.. veelu ayina anni posts chadivi comment pedutha

Ennela చెప్పారు...

kshaminchinanaduku thanks
dandayaatraki inko thanks
manchi paata enchukundamani decision teesukunnanduku maree maree thanks..
thanks andee sasidhar garu