మాములుగా ఒక మంచి కామెడీ టపా వేద్దాము అనుకున్న.. కానీ నిన్న చూసిన ఒక సంఘటన నా మనుసులో ఇంకా మెదులుతూనే వుంది.. అది మీ తో పంచుకుంటే కానీ నా భారం తగ్గదు అనిపించి వేస్తున్న టపా ఇది.
నిన్న ఆఫీసు లో పని త్వరగా పూర్తి అవ్వటం వాళ్ళ, ఆఫీసు బస్సు లో వెళ్ళకుండా , BMTC (బెంగుళూరు లోకల్ ) బస్సు లో ఇంటికి బయలుదేరా.. సిల్క్ బోర్డు దగ్గర ఒక చాల మంది గుంపు ఎక్కారు.. వాళ్ళలో నా దృష్టి ని ఇద్దరు ఆకర్షించారు.. ఒకడు .. నార్త్ వైపు నుంచి వచ్చి ఇక్కడ జాబు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకొకరు.. అక్కడే కడుతున్న బంగాళా లో పని చేస్తున్న తాతయ్య ( కార్మికుడు) ..
బస్సు లో కొంత మంది.. తాతయ్య ని ఒక వింత చూపు చూసారు.. వీడు ఏంటి.. ఈ AC బస్సు ఎక్కటం ఏంటి అని అన్నట్టు గా...నేను చిన్నప్పుడు పల్లెటూరు లో పెరగటం వల్ల ఎవరు అయిన పంచె లో కనిపిస్తేయ్ సొంత మనిషి ని చూసిన భావం కలుగుతుంది.. అందుకే ఆ ముసలయ్యిని చూస్తూ వున్నా.. నా పక్కన్న "SHIT " అన్న పెద్ద అరుపు విని మళ్లీ ఈ లోకం లోకి వచ్చి గమనిస్తే ఏముంది.. పాపం ఆ తాత సంచి.. ఆ నార్త్ వాడి బ్యాగ్ కి అనుకుంది అంట.. మట్టి అవుతుంది అని వాడి ఆ అరుపు అరిసాడు.. పాపం తాతయ్య మొహం చిన్నది అయిపోయింది..
ఈ లోపు కండక్టర్ వచ్చాడు.. తాతయ్య "మర్తహళ్లి బ్రిడ్జి" కి ఒక టికెట్ అంటే.. కండక్టర్ "ముప్పై" అన్నాడు.. వెంటనే.. తాతయ్య డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు..ఆ పక్కన నార్త్ వాడు ఏమో "పాస్" అని చెప్పి టికెట్ తీసుకోలేదు.. తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ వుంటే.. తాతయ్య నా వంకనే చుస్తువున్నాడు. ఫోన్ లో మాట్లాడటం అయిపోయాక ఒక నవ్వు నవ్వాను.. వెంటనే.. తాత "బాబు మీరు తెలుగా అన్నాడు.. ".. "అవునండి తెలుగు వాడిని మాది గుంటూరు అని " చెప్పా..i తాత వాళ్ళది చిత్తూర్ అంట..ఇంకా వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చాడు..ఒక్క సరిగా.. "బాబు... AC బస్సు అంటే మాములు బస్సు కంటే ఒక పది రూపాయలు ఎక్కువ వుంటుంది అని ఎక్కాను.. కానీ ఇంత ఎక్కువ ఏంటి బాబు.. అని బాధగా అన్నాడు.." వెంటనే నేను మీకు డబ్బు ఏమైనా కావాలా అంటే.. చ చ.. నాకు వద్దు బాబు.. అని అన్నారు..
నేను తాతయ్య కంటే ఒక స్టాప్ ముందు , నాతో పాటు ఆ హిందీ కుర్రవాడు కూడా దిగాడు... ఐతేయ్ బస్సు దిగిన వెంటనే.. ఆ హిందీ కుర్రవాడు.. వాళ్ల స్నేహితుడు తో చెపుతున్న మాటలు విని నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను.. వాడి మాటల్లో.. "అరేయ్ దోస్త్ ఇవ్వాళా నేను ముప్పై రూపాయలు సేవ్ చేశాను..బస్సు లో టికెట్ తీసుకోకుండా వచ్చాను." అని చెప్పి పగల పడి నవ్వుతున్నాడు.. వెంటనే.. నాకు బస్సు లో తాత గుర్తువచ్చాడు.. పాపం డబ్బులు లేకపోయినా టికెట్ తీసుకున్నాడు.. కానీ నెలకి ఐదు అంకెల జీతం చేస్తున్న ఈ కుర్రవాడు మటుకు తీసుకోలేదు.. ఎవరు గొప్ప మీరే చెప్పండి.. నేను ఇక్కడ బస్సు లో టికెట్ తీసుకొనే ప్రయాణం చెయ్యండి అని నేను చెప్పటం లేదు.. మనుషులకి ఇచ్చే గౌరవం వాళ్ళ వస్త్రధారణ చూసి ఇవ్వవద్దు.. అని నేర్చుకున్నాను.....ఆ సంఘటన వల్ల
చివరి మాట :- బస్సు ఎక్కుతున్నప్పుడు అందరు ఒక్కసారిగా ఆ తాత ని ఒక వింత చూపు చూసారు.. నాతో సహా.. కానీ.. ఇప్పుడు ఆ తాతయ్య ఎంతో గొప్ప గా కనిపించారు...
25 కామెంట్‌లు:
ఈ మధ్య కాలం లో నేను తెలుసు కున్నది.
చదువుకు, ఉద్యోగానికీ, attitude[తెలుగులో సరైన పదం తట్టడం లేదు] కు ఏవిధంగాను సంబంధం లేదూ అని.
చాలా మంచి టపా.మంచి విషయం నేర్చుకున్నా
ఎందుకో నాకు software engineer ఉద్యోగం మీద గౌరవం తగ్గిపోయిందండి. అది భారతీయయువత వలనో లేక ఆ corporate culture నచ్చకనో తెలియదు.
మీరు చెప్పిన విషయం నిజం.
మనుషులకి ఇచ్చే గౌరవం వాళ్ళ వస్త్రధారణ చూసి ఇవ్వవద్దు.. అని నేర్చుకున్నాను.
నిజమే, అప్పుడెప్పుడో చికాగోలో వివేకానందుడు కూడా ఇలాంటి ప్రవచనాలు చెప్పాడు.
@దిలీప్ గారు.. మీరు చెప్పింది అక్షరాల నిజం...
@సందీప్ గారు .. అవునా. నేను కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నే.. అన్ని సినిమాలు ఒక వుండవు అన్నట్టు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లందరూ.. ఒకలా వుండరు.. కానీ మీరు చెప్పిన విధంగా చాల మంది యువత ఇప్పుడు కొంచం తల తిక్క గా(పొగరు గా) ఆలోచిస్తున్నారు. పక్క వాళ్ళకి సహాయం చేద్దాం అన్న భావన చాల తక్కువ మంది లో వుంది..
@anonymous - konni konni vishayalu goppa varu cheppina talaku ekkavu lendi.. swayam ga okasari anbhavisthe kani manaku ardham kavu.
So sasi , entha sampadana annadi mukyam kaadu , entha neethi ga brathukuthunamu anedi mukyamm.....
ekkda oka vishayam cheptha ...
noth indian pass ani cheppagane conductor athani pass chudaledu... kada..
ade aa thathayya pass chepthe ( athani daggara undi unte) aa conductor paass chupinchamani adige vadu kuda....
@durga- Bellandur aa conductor malla vacchi.. Ticket ani tatayya ni adigadu.. thanu teesukunna already ante.. edhi chupinchu ani adigadu.. :(
I missed this.. in the post.
Nice post :-)
టికెట్ (చీటీ) తీసుకోకుండా వోల్వో బస్సులలో ఊరకే తిరిగే ఇలాంటివారిని నేనూ చూచానండీ. కాకపోతే నేరుగా మొహం మీద చెప్పాను చీటీ తీసుకోమని.
ఎవరినైనా ఇంజినీరుని గౌరవించాలి అంటే అతనికి ఈ చదువు కాక ఇంకా ఏమేమి గౌరవించదగిన లక్షణాలు ఉన్నాయీ అని వెతుక్కోవలసి వస్తోంది. అసలే నాకు ఈ వృత్తి అంటే ఈమధ్యకాలంలో భస్మాసురుడే గుర్తొస్తున్నాడు. ఎక్కడ వీరుంటే అక్కడ సామాన్యజీవితం నాశనమే. ఇంటద్దెలూ కూరగాయల ధరలూ... ఒకటేమిటి అన్నీ పెరిగిపోతాయి, రద్దీతో సహా.
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
@dileep
Attitude అంటె "దృక్పధం" అనుకుంటా..
అహంకారం ఉన్న చోట మానవత విలువలు ఉండవని ఇలాంటి కథలు చదువుతుంటే అర్థమవుతుంది..
శశిధర్.. ముందుగా ఇంత ఆలస్యంగా మీ టపా చూసినందుకు సారీ..
మీ టపా పూర్తిగా చదివేసరికి మనసు భారమయింది. మనం చేసే పని కన్నా, చదివిన చదువు కన్నా మన వ్యక్తిత్వం చాలా ముఖ్యం కదా.. ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు మంచి టపాగా..
very interesting.
check this out:
http://www.eemaata.com/em/issues/200805/1247.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి