టొమాటో - ఉల్లిపాయ పాస్తా :-
రోజు బీరకాయ , పప్పు, క్యాబేజీ, సొరకాయ, వగైరా వగైరా కూరల వండి విసుగు వచ్చేసింది.. సర్లే వెరైటీ గా వుంటుంది అని పాస్తా చేశా.. ప్రాసెస్ కొంచం చిన్నదే అయినా నూడిల్స్ తో పోలుచుకుంటే కొంచం టైం ఎక్కువ పడుతుంది.. కాకపోతేయ్ నూడిల్స్ తో పోలిస్తే రుచి బావుంటుంది, ఆరోగ్యకరం కూడా.
పాస్తా ఇప్పుడు అన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి.. రెడీమేడ్ గా వస్తున్నా పాస్తా కంటే విడిగా వున్నా గోధుమ , రైస్ తో చేసిన పాస్తా నే తీసుకోండి. మైదా తో చేసిన దానిని తీసుకోవద్దు
ఏంట్రా వీడు ప్రాసెస్ చెప్పకుండా కహాని కొడుతున్నాడు అనుకుంటున్నారా.. వస్తున్న.. వస్తున్నా..
మెట్టు(అంటే స్టెప్ ని తెలుగు లో) ఒకటి -
ఒక గ్లాస్ (ఇద్దరికి 350ml గ్లాస్) పాస్తా ని తీసుకొని..శుబ్రం గా కడగండి..తర్వాత.. పోయి మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకుపెట్టి వేడి చెయ్యండి.. ఆ నీళ్ళలో పాస్తా ని వేయండి.. పాస్తా కంటే కొంచం పైకి వచ్చేలా నీళ్ళు వుందేలో చూస్కోండి.. నీళ్ళు ఎక్కువ అయినా పర్వాలేదు.. తక్కువ ఐతేయ్ నే కష్టం..మెట్టు రెండు :-
అలా ఒక పది- పదిహేను నిముషాలు బాగా ఉడికించాలి..ఈ పది నిమిషాలలో మనం ఒక మూడు టొమాటో లని.. ఒక ఉల్లిపాయని.. తరిగి పెట్టుకుందాం.
మెట్టు మూడు :-
ఇప్పుడు ఆ గిన్నలో వేడి నీళ్ళు అన్ని ఓంపేసి.. చన్నీలు పోయండి.. అలా ఆ చల్ల నీళ్ళలో వుడికిన పాస్తా ని ఒక అయిదు నిముషాలు నాన నివ్వండి.. అవి నానుతున్న టైం లో మనం చేయాల్సిన పని ఒకటి వుంది.. అది ఏంటో మెట్టు నాలుగు లో చుడండి..మెట్టు నాలుగు :-
బాండి తీసుకొని కొంచం నూనె వేసి.. నూనె వేడి అయ్యాక.. అల్లం - వెల్లులి ముద్ద, కొంచం గరంమసాల, వుల్లిపాయల వేసి కలిపి..ఉల్లిపాయ మాగక.. టొమాటో ముక్కలు వేసి.. మూత పెట్టి.. ఒక అయిదు నిముషాలు.. టొమాటో ని ఉడకనివ్వండి..
మెట్టు అయిదు :-
టొమాటో ఉడికాక..ఇప్పుడు మనం నాన పెట్టిన పాస్తా లో నీళ్ళు పారపోసి..పాస్తా ని మటుకు బాండి లో వేసి.. గరిటతో బాగా కలియ పెట్టండి.. ఇలా ఒక అయిదు నిమషాలు చేసి.. స్టవ్ కట్టేయండి..
వేడి వేడి టొమాటో పాస్తా రెడీ.. ముందుగానే టొమాటో వెసం కాబట్టి .. సాస్ తో పని లేదు..
నేను పాస్తా చేసినప్పుడు చేసిన ఫొటోస్ పెట్టాను చుడండి.. మనం ఫుడ్ decoration లో కొంచం వీక్ ..