అందరికి కొంచం లేట్ గా "రిపబ్లిక్ డే విషెస్". ఇవ్వాళా మా అమ్మ గారు బెంగుళూరు నుంచి గుంటూరు కి వెళ్లారు , ఆ హడావిడి లో పోస్ట్ కొంచం లేట్ అయ్యింది.. ఇంక ఈ వీడియో గురించి చెప్పే ముందు , ఒక విషయం ని మీతో చెప్పాలి.. నేను ముంబై వెళ్ళిన ఫస్ట్ డే నే, సినిమా కి వెళ్ళాను.. సినిమా స్టార్ట్ అయ్యే ముందు "జన గణ మన" సాంగ్ వేసారు.. ధియేటర్ లో అందరం నుంచొని మేము కూడా శ్రుతి కలిపాము.. ఏంటి ఇవ్వాళా ఏమైనా స్పెషల్ ఆ అని అడిగితేయ్, నా పక్కన అతను "లేదండి ఇది ఇక్కడి rule " అని చెప్పాడు..
తర్వాత చాల సినిమాలకి వెళ్ళాను (అంటే నాకు వారానికి కనీసం ఒక సినిమా అయిన చూడకపోతేయ్ ఏదో లా వుంటుంది ) , ప్రతి చోట ఆ కాంప్లెక్స్ వాడు వాడి స్టైల్ లో "జనగణమన" ని ప్రెసెంట్ చేసేవారు.. అంటే "PVR " వాడు ఒకలా, "BIG సినిమాస్" వాడు ఒకలా , "FAME మూవీస్" వాడు ఒకలా.. ఇలా వాళ్ళ styles లో వేసేవారు..
ఇప్పుడు recent గా bigcinemas వాడు చేసిన "జనగణమన" వెర్షన్ నాకు బాగా నచ్చింది.. ఒక రకమైన బావోద్వేగానికి లోను అయ్యాను ఈ పాట. చూసి.. Hatsoff bigcinemas అండ్ ఈ పాట ని తెర పైకి ఎక్కించిన వారికీ ధన్యవాదాలు..
7 కామెంట్‌లు:
చాలా మంచి టపా పెట్టారు.
కళ్ళల్లో ఆనందబాష్పాలొచ్చాయి.
వావ్... చాలా బాగుంది. నాకు తెలిసి అన్నింటికన్నా అందమైన "భాష"ఇదే. ఇందులో అరిచి గీపెట్టడాలూ గట్రావుండవు.
చాలా బాగుందండి. Thanks for sharing.
@Anonymous - first time naaku kooda same feeling , continuous ga 10 times chusanu andi ee song ni
@indian Minerva - Nijame kada.. valla kallalo anandanni chudandi.. last lo Jai hind annapudu.. flag la chethulu kooda oputharu..
@Sisira garu - Thanks
simply superb
శశిధర్ గారు చాలా బాగుంది simply superb ...
Fantastic.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి