22, నవంబర్ 2010, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జెండా ఎలా ఉంటుందో మీకు తెలుసా...?

అస్సలు ఒక రాష్ట్ర అవతరణ ఎందుకు చేస్త్తారు..? ఒకే బాష మాట్లాడి, ఒకే సంప్రదాయాన్ని పాటించే వాళ్ళ అందరిని ఒక రాష్ట్రము లాగా చేసారు.. మనం మన తెలుగు వాళ్ళు అందరు కలిసి ,ఎంతో కష్టపడి మనకంటూ ఒక రాష్ట్రాన్ని సంపాదించుకున్నము . తెలుగు వాడు అంటే మద్రాసీ అనుకుంటున్న తరుణం లో మన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. అలాంటిది ఇప్పుడు కొంత మంది రాజకీయ నాయకుల కుటిల రాజికీయాల వాళ్ళ..మరల నేను తెలుగు వాడిని అంటే.. , మీది కోస్తా లేక తెలంగాణా అని అడిగేల చేసుకున్నాం.. ఆ విషయాల లోకి నేను పోవటం లేదు.. ఎన్ని గొడవలు వున్నా.. అవతరణ వేడుకలు అనేది జరగాలి.. కానీ జరిగింది ఏమిటి..?


ఆంధ్ర లో అవతరణ రోజున జరిగిన గొడవల్ని నేను మర్చిపోలేను. అస్సలు రాష్ట్రాని ప్రేమించటం అంటే ఏంటో కన్నడ వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.. మనలానే కన్నడ వాళ్ళకి November 1st   రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాళ్ళు ఎంత గ్రాండ్ గ చేసుకున్నారు అంటే.. ఎక్కడ చూసినా కానీ కర్ణాటక జెండాలే.. ఇన్ఫోసిస్ ,Accenture, IBM లాంటి ఆఫీసుస్ మీద కూడా కర్నాటక జెండాలు ఎగురవేసారు..
మన వాళ్ళు సరే సరి.. హైదరాబాద్ లో అంటే తెలంగాణా గొడవ అనుకుందాం.. మరి విజయవాడ , గుంటూరు , వైజాగ్ లాంటి సిటీస్ లో ఎందుకు చేయలేదు..? చేసిన మన భారత జెండా ఎగురవేసారు కానీ.. మన  జెండా ఎక్కడ ఎగురవేసారు? అస్సలు మనం రాష్ట్రాని కంటూ ఒక జెండా నే లేదా..

ఎంత మందికి మనం రాస్త్రానికి అంటూ ఒక ప్రత్యేక జెండా వుంది అని తెలుసు..? . అస్సలు ఈ పోస్ట్ నేను రాయటానికి కారణం ఏంటో తెలుసా.. మా ఇంటి దగ్గర వున్నా ఒక ఇస్త్రీ బండి..  నిజం.. November 1st ఆ ఇంస్త్రి బండి అబ్బాయి తన బండిని ఒక కర్ణాటక జెండా గ మార్చివేశాడు. ఇదిగో ఈ ఫోటో చుడండి మీకే తెలుస్తుంది.అప్పుడు నాకు అనిపించింది మన రాష్ట్ర జెండా ఎంటా అని.. సరే అని మా తమ్ముడు కి ఫోన్ చేశా , ఏరా సెలవ మీకు ఇవ్వాళా అంటే.. సెలవ ఎందుకు అని అనడిగాడు.? అలా వుంది మన పరిస్థిది..



మన రాష్ట్రానికి వున్నా జెండా ని నా చిన్నప్పుడు విజయవాడ ప్రకాశం బ్యరెజీ దగ్గర చూసా. నీలం రంగు లో వుంటుంది.. గూగుల్ లో కూడా వెతికా .. కనపడుతుంది ఏమో అని.. లేదు.. ఆంధ్ర ఫ్లాగ్ అని టైపు చేస్తే.. ఏదో ఏదో చూపిస్తోంది.. ఎవరి దగ్గర అయిన ఆంధ్ర ఫ్లాగ్ పిక్చర్ వుంటే నాకు పంప గలరు.

రాధా గారికి పేద్ధ థాంక్స్ అండి.. మీ వల్ల నాకు ఇవ్వాళా ఆంధ్ర ఫ్లాగ్ చూసే అదృష్టం కలిగింది.. ఇది కరెక్ట్ , ఏమో తెలియదు... కానీ ఈ జెండా ని చూస్తున్నప్పుడు చాల మంచి ఫీలింగ్ కలిగింది.. 

ఇది అండి ఇప్పటి వరుకు నాకు అందిన సమాచరం ప్రకారం.. మన రాష్ట్ర జెండా ఇది..



5 కామెంట్‌లు:

Radha చెప్పారు...

hello sasi gaaru... ivvale mee blog choosanu.. heading choosi meeru AP flag ni choopeduthunnaremo ani interesting ga choosanu.. anyway nenu kooda edo google lo kodithe naaku oka link dorikindi... pdf file..

http://zomilibrary.com/main/archive/files/flags-of-different-states-of-india_f91e6bd6f9.pdf

mee punyama ani nenu kooda choosa ivvala AP flag ni.. hope this is the correct information

శిశిర చెప్పారు...

కన్నడ వాళ్ళనే కదు, తమిళులని చూసినా తెలుస్తుంది వాళ్ళని వాళ్ళు ఎంత గౌరవించుకుంటారో. Good Article.

Sasidhar Anne చెప్పారు...

@Radha garu - Thanks for the info.. Post update chesa chudandi :)

@Sisira garu - tamil vallaki basha meeda entho abhimanam vuntundhi, akkada nenu Tnagar lo oka pedda banner chusa oka sari.. train, chari, pen lanti manam daily vade vasthuvalani tamil lo emantaro.. rasaru..

Goutham Navayan చెప్పారు...

అతి త్వరలో మన ఆంద్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలు గా విడిపోతుంది
అప్పుడు ఒకటి కాదు రెండు రాష్ట్రీయ జండాలను సగర్వంగా ఎగరేసుకుందాం
తమిలిలులకు, కన్నడిగులకు ఒక్కొక్క జన్దాయే వుంటే మన తెలుగు రెండు జండాలు వుంటాయి
తెలుగు భాష అప్పుడు గానీ సర్వతోముఖం గా అభివృధ్హి చెందాడు.
జై తెలంగాణా
జై ఆంద్ర

Sasidhar Anne చెప్పారు...

Jai Andhra anna vallu evaru jai telangana anaru.. Goutham garu.. ee vishayam lo nenu meetho ekibhavimchatam ledu.. kshamichali..

Telugu varam ani garvam ga cheppukoni happy ga feel ayye vallalo nenu okadini..:)