చిన్నతనం నాకు బాగా ఇష్టమైన పండుగులు మూడు 1 ) వినాయక చవితి 2 ) దసరా 3 ) సంక్రాంతి . ఎందుకంటే ఈ మూడు పండుగలకు మేము మా చిన్నఅమ్మ(పిన్ని ని నేను ఇంతే పిలుస్తా) వాళ్ళు అందరం కలిసి మా తాతా గారి ఊరికి వెళ్తాం కాబట్టి .ఇంకా తాతా గారి ఊరిలో మేము అందరం పంజరం నుంచి బయట పడిన పక్షులం , చైన్ తెగిన బొచ్చు కుక్కలం. పిచ్చ పిచ్చ గా తిరిగివాళ్ళం. అడ్డుచేప్పేవారు ఎవరు మాకు? ఏమైనా అంటే మాకు అండ గా మా తాతా గారు సపోర్ట్ కి వచ్చేసేవారు.
నేను , నా తమ్ముడు చిన్న , చిన్నమ్మ వాళ్ళ అబ్బాయిలు " చిన్ను , బాబి ". నలుగురం ఒక జట్టు అన్నమ్మాట.ఒకటి ఒక సరి ఫిక్స్ అయ్యాము అంటే.. ఇంకా అంతెయ్, రచ్చ రచ్చే. చిన్న example చెప్పనా , ఒక సారి మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయింది, అమ్మ డబ్బులు ఇవ్వు బాల్ పోయింది అంటే.. డబ్బులు లేవు గిబ్బులు లేవు అక్కడ వాడి పడేసిన "prachute " డబ్బా వున్నది దాన్నే బాల్ గా ఆడుకోండి అంది. మేము ఆ డబ్బా కి దారం చుట్టి బాల్ లా చేసి పండగ చేసుకున్నాం. బాల్ కంటే ఆ డబ్బా తోటే మజా వచ్చింది, మా తమ్ముడు కొట్టిన భారి షాట్ కి బాల్ అదేయ్ లెండి డబ్బా పోయింది. ఈసారి మా తాతా మా కోసం బాల్ కొన్నారు కానీ, డబ్బా లో వచ్చిన మజా బాల్ తో రాలేదు. ఇంట్లో అంత వెతికాం డబ్బా దొరికుతుంది ఏమో అని.. కానీ లాబం లేకుండా పోయింది. ఇంకా వెంటనే చిన్న గాడు కార్యరంగం లోకి దిగి అప్పుడే కొని తెచ్చిన పరచుటే డబ్బా లో వున్నా నూనె మొతాన్ని ఓంపేసి, దారాన్ని చుట్టి మాకు ఇచ్చాడు. తర్వాత ఏముంది ఇంట్లో వాళ్ళు కొబ్బరినూనె కోసం వెతికి అస్సలు ఆ డబ్బా నీ మిస్ అయ్యింది అనుకోని ఇంకో కొత్త parachute కొనుకున్నారు. ఈ విషయాన్నీ ఎవ్వరు మా అమ్మ కి చెప్పా వద్దు చేపితేయ్ అన్తెయ్ నా పని.
ఇలా పండుగల లో పని లేకుండా ప్రతి పండుగకి ఒకలే (అంటే క్రికెట్ మరియు పొలం మీద గాలి తిరుగుళ్లతో) ఆనందం గా గడుపుకుంటున్న సమయం , ఒక నొక రోజున నా బుర్ర లో మంచి ఆలోచన వచ్చింది.మనం కూడా ఎందుకు ఒక వినాయకుడి బొమ్మని ని పెట్టి పూజ చేయకూడదు అని. దసరా కి , చవితి కి , మా ఊర్లో బొమ్మలు పెట్టి బాగా హడావిడి చేస్తారు. వాళ్ళ అంత కాకపోయినా కొంచం అయిన బాగా చేయాలి అని ఫిక్స్ అయ్యం. వెంటనే మా ఫైనాన్సు డిపార్టుమెంటు అయిన అమ్మ కి వెళ్లి అర్జి పెట్టుకున్నాం.. కానీ మా మాతృ మూర్తి కరుణ రసం కాకుండా రౌద్ర రసం తో మములని వాయించి , ముందు ఇంట్లో చేస్తున్న పూజుకి సరిగా కూర్చోవటం నేర్చుకోండి తర్వాత మీరు చేయండి అని చిన్న పాటి పెద్ద క్లాసు పీకేపాటికి మేము సైలెంట్ అయిపోయాం. కాని ముందే చెప్పా గా మేము ఒక సరి కమిట్ అయ్యాము అంటే, అమ్మ చిపిరి కట్ట తిరగాతిప్పి కొట్టిన కూడా మాట వినం.
అందుకని ముందు గా వినాయకుడి బొమ్మ కోసం తెగ వెతికం.. చివరికి ఒక రాయికి వినాయకుడి రూపం వున్నటు మాకు అనిపించింది. వెంటనే వెళ్లి ఇంట్లో వున్నా పసుపు తెచ్చి ఆ రాయిని కి బాగా పూసి , వినాయకుడి రోప్పం తెప్పించేసాం. ఇప్పుడ విగ్రహ ప్రతిష్ట , ఇంటి వెనకాల కొట్టం లో ఒక మూల పెట్టేసి , చుట్టుత చిన్న చిన్న రాళ్ల తో ఒక బోర్డర్ కట్టాం. పూలు పెద్ద సమస్య కాదు , మా ఇంటి వెనకాలే మల్లె పూలు తోట వుంటుంది, మా పెద్దమ్మ వాళ్ళదే . పత్రి కోసం పోలలలో తెగ తిరిగి తెలిసినవి తెలియనవి అన్ని కోసుకోచ్చం.
తర్వాత పలహారాలు ఏమి చేయాలి..అని తెగ అలోచించి , ఇంట్లో నుంచి పంచదార , బెల్లం , చివరికి మా తాతా మాకు కొని ఇచ్చిన కిల్లి బిల్లలని కూడా పలహారం లా మర్చేసం. అంత అక్కడ సెట్ చేస్తుంటే మా అమ్మ ఒకటే గొడవ. " ఒరేయ్ ఇంట్లో పూజ స్టార్ట్ అవుతుంది" రండి అని.. మేము మా బుల్లి గణపతి దగ్గర అన్ని అలా సర్దేసి..ఇంటిలోకి వెళ్ళాం. పూజ అయ్యి అవ్వగానే పరుగెత్తు కుంటూ మా బొమ్మ దగ్గరికి వచ్చేసాం. చూస్తే ఏముంది పలహారం మొత్తం చీమల మయము. ఇంకా మాకు ఏడుపు ఒక్కటే తక్కువ.. ఈ లోపు చిన్నామ్మ , అమ్మ కొట్టం లోకి వచ్చి మా సెట్ అప్ చూసి నవ్వుకున్నారు.అమ్మ బాగా చేసారు అని మెచ్చుకుంది , కానీ మా ఏడుపు మొహాలు చూసి ఏమైందిరా అని అడిగింది. మేము చీమల తో నిడిన పలహారం చూపించం. అమ్మ నవ్వుతు " పిచ్చి తండ్రి , దేవుడు ఆ రూపం లో వచ్చి మీ పలహారాలు తిన్నాడు అని చెప్పింది". ఆ మాట వినగానే మేము ఫుల్ గా ఖుషి అయిపోయాం,
అమ్మ ఏమో " మీరు బొమ్మ పెడతాను అంటే ఏమిటో అనుకున్నాం కానీ పసుపు తో ఆ రాయికి వినాయకుడి రూపు ని బాగా తెచ్చారు అని" ఒక కామెంట్ ఇచ్చేసి.. వుండండి ఇంకా మీ గణపతి ని పలహారాలు పెడుదాం అని ఇంట్లో వండిన "పాయసం,పులిహోర, కుడుములు , ఉండ్రాళ్ళు " అన్ని కొంచం కొంచం ప్లేట్ పెట్టి ఇచ్చింది.,
సాయంత్రం మేము చేసిన హడావిడి అంత ఇంత కాదు. వినాయకుడి నేను నా తల మీద మా వీధి అంత ఊరేగించా. ఆ వీధిలో వుండే వాళ్ళు అంత మా చుట్టాలే.. అందరికి తల కొంచం ప్రసాదం (అంటే పంచదార , బెల్లం,కిల్లి బిల్ల mix ) పెట్టం. చివరకి మా వీధిలో చివర్లో వున్నా కలువ లో నిమ్మజనం చేసాం.
తర్వాత సంవత్సరం నుంచి ఇంట్లో వినాయక చవితి టాస్క్ మా తొట్టి గ్యాంగ్ కి ఇచ్చేసారు.
మొన్న చవితి కి కూడా మా ఊరు వెల్ల నాన్నమ్మ ని చూదాము అని. ఐతేయ్ మా ఇంటి దగ్గరే మా లాగే మేము చేసినట్టే ఇప్పుడు అక్కడ మా పెద్దక్క (పెదమ్మ వాళ్ళ అమ్మాయి )పిల్లలు చేస్తున్నారు.. దిన్నె వారసత్వం అంటారు.. కాకపోతేయ్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మా వాళ్ళు dairy milk , cadbury 's షాట్స్ పెట్టారు.
ఇంకా మా చిన్నప్పటి అల్లర్లు చాల వున్నాయి.. వాటి తో మళ్లీ మీ ముందుకు వస్తా..
11 కామెంట్‌లు:
హహ్హహ్హా.. శశిధర్ గారూ, భలే ఉన్నాయి మీ చిన్న నాటి అల్లర్లు. ఎంతైనా గడిచిపోయిన కాలం ఎంతో అందంగా ఉంటుంది కదా..:) నా చిట్టాలో కూడా ఇలాంటి బాల్య స్మృతులు చాలా ఉన్నాయి. అవన్నీ మీలాగే ఒక పోస్ట్ లో రాసేస్తా..:))
ఇంకా మీ వారసత్వం బాగుంది.. generations కి తగ్గట్టుగా..:))
inka enduku alasyam.. twaraga start cheyandi mari mee allari kooda.
ఒహ్ మొదటి తెలుగు టపా వినాయకుని తోనా..ఇకనేం అవిఘ్నం గా ముందుకు సాగిపోతుంది ...బాగా రాసావు
hmm baga chesaru mama
memukuda anthe chinnapudu but
ela pala ledu epudu padthe apudu pettevalam mattitho chesi
malli anni ipudu gurthu vachay nee valla
hmm baga chesaru mama
memukuda anthe chinnapudu but
ela pala ledu epudu padthe apudu pettevalam mattitho chesi
malli anni ipudu gurthu vachay nee valla
Gud one boss.
ఇది చదివి చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో cousins and neighbours తో చేసిన అల్లరి పనులు గుర్తొచ్చాయి. వారసత్వం concept బాగుంది. కొత్త trend ఇంకా బాగుంది :)
hmm baga chesaru mama
memukuda anthe chinnapudu but
ela pala ledu epudu padthe apudu pettevalam mattitho chesi
malli anni ipudu gurthu vachay nee valla
hmm baga chesaru mama
memukuda anthe chinnapudu but
ela pala ledu epudu padthe apudu pettevalam mattitho chesi
malli anni ipudu gurthu vachay nee valla
@Thanks Nestham akka..
@mani, sai praveen - nijam aa rojulu chala saradaga vundevi.. :)
ఆంధ్ర ప్రదేశ్ కి కె ఎ పాల్
బ్లాగర్స్ కి శశి అన్నె
వాస్తవం గా చెప్పాలి అంటే అద్భుతం రా తమ్ముడు... ఇరగతియ్యి
KA Paul antha comedy ni post lo maintain chesanu ani pogidi nanduku thanks annaya.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి