15, మార్చి 2011, మంగళవారం

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ & ఒక రోజు వారి కూలి ?? వీళ్ళలో ఎవరు గొప్ప?

మాములుగా ఒక మంచి కామెడీ టపా వేద్దాము అనుకున్న.. కానీ నిన్న చూసిన ఒక సంఘటన నా మనుసులో ఇంకా మెదులుతూనే వుంది.. అది మీ తో పంచుకుంటే కానీ నా భారం తగ్గదు అనిపించి వేస్తున్న టపా ఇది.

నిన్న ఆఫీసు లో పని త్వరగా పూర్తి అవ్వటం వాళ్ళ, ఆఫీసు బస్సు లో వెళ్ళకుండా , BMTC (బెంగుళూరు లోకల్ ) బస్సు లో ఇంటికి బయలుదేరా.. సిల్క్ బోర్డు దగ్గర ఒక చాల మంది గుంపు ఎక్కారు.. వాళ్ళలో నా దృష్టి ని ఇద్దరు ఆకర్షించారు.. ఒకడు .. నార్త్ వైపు నుంచి వచ్చి ఇక్కడ జాబు చేస్తున్న సాఫ్ట్ వేర్  ఇంజనీర్, ఇంకొకరు.. అక్కడే కడుతున్న బంగాళా లో పని చేస్తున్న తాతయ్య ( కార్మికుడు) .. 

బస్సు లో కొంత మంది..  తాతయ్య ని ఒక వింత  చూపు చూసారు.. వీడు ఏంటి.. ఈ AC బస్సు ఎక్కటం ఏంటి అని అన్నట్టు గా...నేను చిన్నప్పుడు పల్లెటూరు లో పెరగటం వల్ల ఎవరు అయిన పంచె లో కనిపిస్తేయ్ సొంత మనిషి ని చూసిన భావం కలుగుతుంది.. అందుకే ఆ ముసలయ్యిని చూస్తూ వున్నా.. నా పక్కన్న "SHIT " అన్న పెద్ద అరుపు విని మళ్లీ ఈ లోకం లోకి వచ్చి గమనిస్తే ఏముంది.. పాపం ఆ తాత సంచి.. ఆ నార్త్ వాడి బ్యాగ్  కి అనుకుంది అంట.. మట్టి అవుతుంది అని వాడి ఆ అరుపు అరిసాడు..  పాపం తాతయ్య మొహం చిన్నది అయిపోయింది..

ఈ లోపు కండక్టర్ వచ్చాడు.. తాతయ్య "మర్తహళ్లి బ్రిడ్జి" కి ఒక టికెట్ అంటే.. కండక్టర్  "ముప్పై" అన్నాడు.. వెంటనే.. తాతయ్య డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు..ఆ పక్కన నార్త్ వాడు ఏమో "పాస్" అని చెప్పి టికెట్ తీసుకోలేదు.. తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ వుంటే.. తాతయ్య నా వంకనే చుస్తువున్నాడు. ఫోన్ లో మాట్లాడటం అయిపోయాక ఒక నవ్వు నవ్వాను.. వెంటనే.. తాత "బాబు మీరు తెలుగా అన్నాడు.. ".. "అవునండి తెలుగు వాడిని మాది గుంటూరు అని " చెప్పా..i తాత వాళ్ళది చిత్తూర్ అంట..ఇంకా వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చాడు..ఒక్క సరిగా.. "బాబు... AC బస్సు అంటే మాములు బస్సు కంటే ఒక పది రూపాయలు ఎక్కువ వుంటుంది అని ఎక్కాను.. కానీ ఇంత ఎక్కువ ఏంటి బాబు.. అని బాధగా అన్నాడు.." వెంటనే నేను మీకు డబ్బు ఏమైనా కావాలా అంటే.. చ చ.. నాకు వద్దు బాబు.. అని అన్నారు..

నేను తాతయ్య కంటే ఒక స్టాప్ ముందు , నాతో పాటు ఆ హిందీ కుర్రవాడు కూడా దిగాడు... ఐతేయ్ బస్సు దిగిన వెంటనే.. ఆ హిందీ కుర్రవాడు.. వాళ్ల స్నేహితుడు తో చెపుతున్న మాటలు విని నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను.. వాడి మాటల్లో.. "అరేయ్ దోస్త్ ఇవ్వాళా నేను ముప్పై రూపాయలు సేవ్ చేశాను..బస్సు లో టికెట్ తీసుకోకుండా వచ్చాను." అని చెప్పి పగల పడి నవ్వుతున్నాడు..  వెంటనే.. నాకు బస్సు లో తాత గుర్తువచ్చాడు.. పాపం డబ్బులు లేకపోయినా టికెట్ తీసుకున్నాడు.. కానీ నెలకి ఐదు అంకెల జీతం చేస్తున్న ఈ కుర్రవాడు మటుకు తీసుకోలేదు.. ఎవరు గొప్ప మీరే చెప్పండి.. నేను ఇక్కడ బస్సు లో టికెట్ తీసుకొనే ప్రయాణం చెయ్యండి అని నేను చెప్పటం లేదు.. మనుషులకి ఇచ్చే గౌరవం వాళ్ళ వస్త్రధారణ చూసి ఇవ్వవద్దు.. అని నేర్చుకున్నాను.....ఆ సంఘటన వల్ల

చివరి మాట :- బస్సు ఎక్కుతున్నప్పుడు అందరు ఒక్కసారిగా ఆ తాత ని ఒక వింత చూపు చూసారు.. నాతో సహా.. కానీ.. ఇప్పుడు ఆ తాతయ్య ఎంతో గొప్ప గా కనిపించారు...

7, మార్చి 2011, సోమవారం

నేను..... ఒక ప్రేమ బాధితుడినే



టపా పేరు చూసి నాకు ఒక విషాద ప్రేమ కధ వుంది అనుకున్నారా.. ఐతేయ్ మీరు ఒక కిలో ముద్ద పప్పు లో కాలు వేశారోచ్ ..కానీ నేను ఒక ప్రేమ  బాధితుడినే.. ఎలాగంటారా.. మా క్రాంతి గాడి ప్రేమ వల్ల.. వాడి ప్రేమ వల్ల నేను బాధ ఏమి పడ్డానా  అని ఓఒ తెగ ఆలోచించమాకండి.. కొంచం కొంచం గా మొత్తం చెబుతా...

అస్సలు ఈ క్రాంతి ఎవడు అంటే.. నా ప్రాణ స్నేహితుడు.. వీడు కాకుండా.. ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా వున్నాడు.. వాడు "షరీఫ్".. వీళ్ళు ఇద్దరు లేకుండా.. మనం లేము.. అంత ప్రాణం నాకు వాళ్ళు అంటే.. షరీఫ్ ఏమో కానీ.. క్రాంతి చేసిన కొన్ని పనుల వల్ల ఎన్నో సార్లు.. "ప్రపంచం లో ఇంత మంది వుండగా.. ఈ క్రాంతి నే ఎందుకు నా  ప్రాణ స్నేహితుడు లా అయ్యాడు" అనుకున్న.. కానీ మనలో మన మాట.. వీడి దగ్గర , షరీఫ్ దగ్గర మన వేషాలు సాగినట్టు ఎవ్వరి దగ్గర సాగవు.. నేను ఏమి కావాలంటే అది చేస్తారు.. ఒక్క మాట లో చెప్పాలి అంటే నేను చాల అదృష్టం చేసుకున్నాను..

సరే మనం అస్సలు విషయం లోకి  వచ్చేద్దాం .. క్రాంతి కి "మనసంత నువ్వే " లాగా చిన్నప్పటి ప్రేమ వుంది.. ఇంజనీరింగ్ అప్పుడు నాకు తెలియగానే ఫస్ట్ లో నవ్వేసాను.. కానీ ప్రేమ లో మన వాడి నిజాయతి చూసి.. వాడిని మెచ్చుకోకుండా ఉండలేను..

క్రాంతి వాళ్ళది కూడా గుంటూరు , ఐతేయ్ ఒక్కోసారి..  వాళ్ల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుంటూరు కి వచ్చి మా ఇంట్లో వుంటూ.. తన ప్రేమికురాలని(చెల్లి) ని కలుస్తువుండే వాడు.. ఐతేయ్ చెల్లి వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్.. అందుకని ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు.. రాగానే ఫోన్ చేసేది.. ఆ ఫోన్ రాగానే.. వాడికి ప్రపంచం లో ఎవ్వరు కనపడరు.. నాతో సహా (ఇది మరి దారుణం కదండీ..) , అందుకే అంటారు ఏమో.. "ప్రేమ గుడ్డిది అని" .. ఐతేయ్ వాడి గుడ్డి తనం వల్ల ఎన్నో సార్లు బుక్ అయ్యా..

ఘటన ఒకటి :-  
కొత్త బంగారు లోకం సినిమాకి "నేను , క్రాంతి " ఇద్దరం వెళ్ళాం.. సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిముషాలకి చెల్లి ఫోన్ చేసింది.. ఇప్పుడు వస్తానురా ఫోన్ లో మాట్లాడి అని చెప్పి వెళ్ళాడు.. ఒక ముప్పై నిముషాలు చూసా, రాలేదు.. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమోలే అనుకోని వదిలేశా.. ఇంటర్వల్ లో బయటికి వెళ్లి చూసాను.. కనపడలా.. ఫోన్ చేస్తేయ్... " మామ నేను బయటకి వచ్చాను , సినిమా చూసి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు" , వాడితో వస్తున్న అని purse  కూడా ఇంట్లో లోనే పెట్టి వచ్చా.. చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏమి చేస్తాం ఇంకా.. సినిమా అయిపోయాక ఒక మూడు కిలోమీటర్లు లెఫ్ట్ - రైట్ కొట్టాను.. ఈ విధంగా ప్రేమ వల్ల మొదటి సరి బాధింప పడ్డాను..

ఘటన రెండు :-
బెంగుళూరు కి వచ్చాక.. ఇద్దరం కలిసి బయట నుంచి భోజనం తెప్పిన్చుకున్నాం.. వేడి వేడిగా ఇద్దరికి వడ్డన కూడా చేశా.. సర్రిగా అప్పుడే చెల్లి కాల్ చేసింది వాడికి , అంతెయ్ ఫోన్ కి వాడు అంకితం అయిపోయాడు.. ఇరవై నిముషాలు అయిన తినటానికి రాలేదు.. ఒక్కడినే తినలేను.. చివరగా దొర గారు ఎప్పుడో వచ్చి "ఏంట్రా నువ్వు నాకోసం తినకుండా వున్నావా? " అని అడిగినప్పుడు ఎంత ఒళ్ళు మండిందో..

ఘటన మూడు :-
ఒక రోజు ఫోన్ చేసి.. మనసేం బాలేదురా మా ఆఫీసు కి వచ్చేయి.. అక్కడి నుంచి ఇద్దరం ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు.. సరే కదా అని నేను వాడి కోసం వెళ్ళాను..  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ.. బయలుదేరం.. అలా స్టార్ట్ అయ్యమో లేదో.. చెల్లి ఫోన్ చేసింది..అంతెయ్ మన వాడి అడుగుల వేగం తగ్గింది.. నువ్వు వెళ్ళు మామ.. నేను చిన్నగా వస్తా అని , "తన దైన శైలి లో నను మరిచాడు.." నా చిట్టి హృదయం ఎంత బాధ పడిఉంటుందో.. ఈ పాటికి మీ అందరికి అర్ధం అయ్యే వుంటుంది..

ఇలా వాడి ప్రేమ వల్ల నేను బాధింప పడ్డాన లేదా..మీరే చెప్పండి.. :) అందుకే నేను ఒక ప్రేమ బాధితుడినే..

సంతోషకరమైన విషయం ఏమిటి అంటే.. భగవంతుడి దయ వల్ల.. పోయిన వారమే.. వాడికి , వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యింది.. అలా ఒక సుధీర్గమైన ప్రేమ కథ కి సంతోషకరమైన ముగింపు వచ్చింది.. :)  అలా క్రాంతి గాడి ప్రేమ >>>>> పెళ్లి అయ్యింది, నా బాధలు కంచి కి వెళ్ళాయి.. :)