ముంబై తో పోల్చుకుంటే , బెంగుళూరు లో వీకెండ్స్ చాల నిస్తేజం గా , నీరసంగా గడిచిపోతున్నాయి.. దానికి రెండు కారణాలు..
మొదటిది ఇప్పుడు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్.. మార్చిలో రిలీజ్ వుంది అని . జనవరి నుంచి ప్రతి రోజు పని చేపిస్తునే వున్నారు.. మేము చేస్తూనే వున్నాం.. సండే ఖాళీ గానే వున్నా.. విశ్రాంతి కావాలి కదా.. సో సండే మొత్తం నిద్ర కే అంకితం ఇచ్చేసాం..
రెండవది :- మా క్రాంతి గాడు.. వేదవ.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే , ఆ.. వూ.. అంటాడు కానీ..కదలడు.. వాడు లేకుండా మనం వెళ్ళలేం.
మొన్న feb మొదటి వారం.. ఇంట్లో ఒక పని వుండి , అర్జెంటుగా గుంటూరు రమ్మనారు.. శనివారం ఆఫీసు ఉంది అని.. శనివారం సాయంత్రానికి టికెట్స్ బుక్ చేపించాను.. ఏమైందో.. సడన్ గా మా మేనేజర్ మీటింగ్ పెట్టి, ఈ వీకెండ్ మనం పని చెయ్యటం లేదు.. ఎంజాయ్ 2 డేస్ అని చెప్పగానే.. "అందరం ఎగ్గిరి గంతువేసాం".. మేము అల సంబరాలు జరుపుతున్న టైం లో.. చావు కబురు చల్లగా చెప్పాడు.. సోమవారం onsite నుంచి client మేనేజర్ వస్తుంది.. సో వచ్చే వారం నుంచి సండే కూడా పని చెయ్యాలి.. కావున మీ మీ batteries ఛార్జ్ చేసుకోండి అని విషయం చెప్పగానే".. మాలో ఉత్సాహం.. చప్పున చల్లారిపోయింది..
గుంటూరు కి శుక్రవారం టికెట్స్ దొరకటం చాల కష్టం.. అందుకని.. శనివారం టికెట్ నీ ఒకే చేశా.. అంటే మన చేతిలో శనివారం అంత ఖాళీ గా ఉంది అన్నమాట..ఇంటికి వెళ్ళేపాటికి , క్రాంతి , చిన్న (మా తమ్ముడు) , దీపూ(క్రాంతి బావ).. అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.. బయటికి వెళ్దాం అంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు.. ఇంకేం చేస్తాం.. నేను పడుకున్న.. పడుకొని.. క్రాంతి గాడిని బాగా తిట్టాను.. కొత్త బైక్ కొన్నావు కదరా.. కనీసం.. నైట్ ride కన్నా వెళ్దాం పద అంటే.. వాడు వద్దు అన్నాడు.. ఇంకా నాలో కోపం కట్టలు తెంచుకొని.. సమరసింహా రెడ్డి లో బాలయ్య లా " రేయ్!!! బెంగుళూరు కి రా రా అని అన్నావ్.. వచ్చాక కనీసం ఒక్కసారి అన్న బయటకి వెళ్ళామా?" అని ఘాటు గా అరిచాను.. పాపం.. వాడు కూడా "ఇప్పుడు టైం 12 అయ్యింది .. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటే.. " నంది హిల్స్ కి వెళ్దాం పద.. సూర్యోదయం.. బావుంటుంది అంట.. ఎప్పుడు చూడలేదు అని అడిగా.. సరే అని.. నలుగురం బయలుదేరం..
క్రాంతి బైక్ మీద నేను, దీపూ బైక్ మీద చిన్న .. అల మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. బాగా చలి గా వుండటం వాళ్ళ.. చాల తక్కువ స్పీడ్ లో వెళ్ళాము.. రాత్రి 2 గంటలకి.. "బెంగలూరు అంతర్జాతీయ విమానాశ్రయం" దగ్గరకి వెళ్ళాం.. అక్కడ రోడ్ పక్కన.. టీ అమ్ముతున్నారు.. మా లాగానే నంది హిల్స్ కి వెళ్తున్న ఒక 20 మంది కురాళ్ళు అక్కడ కలిసారు.. ఒక టీ తాగి.. వాళ్ళతో మాటలు కలిపాం .. నంది హిల్స్ పొద్దున 5 కి కానీ ఘాట్ రోడ్ ఓపెన్ చెయ్యరు అని తెలిసింది.. అందుకని ఒక 2 గంటలు ఎక్కడైనా గడపాలని అనుకున్నాం. నా తమ్ముడు నేను విమానం take off ఎప్పుడు చూడలేదు..విమానాశ్రయం కి వెళ్దాం అన్నాడు.. సరే ఒకే అని అక్కడికీ వెళ్ళాం.. అక్కడ కాఫీ డే ఉంది.. కాఫీ తాగుతూ బాతాకాని వేసుకుంటూ.. టైం పాస్ చేసాం..
కొన్ని ఫోటోలు.. , దిగిన తర్వత.. నంది హిల్స్ కి బయలుదేరం.. పాపం బాగా చలి గా వుండటం వాళ్ళ. క్రాంతి డ్రైవింగ్ చెయ్యలేక పోయాడు.. నాకేమో బండి రాదు.. వాడి పరిస్థితి చూసి "సర్లేరా.. gears ఒక్కటే గా నాకు రానిది.. నువ్వు చెప్పు నేను మేనేజ్ చేస్తాను" అని బండి డ్రైవ్ చేశా.. అల నేను మొదటిసారీ బండి డ్రైవింగ్.. బ్రాహ్మి ముహూర్తం లో చేశా ;)".
ఘాట్ రోడ్ కి ఇంకో రెండు కిలోమీటర్లు ఉంది అనగా.. రోడ్ పక్కన కొంత మంది ముసలి వాళ్ళు.. పెద్ద మంట వేసి చలి కాచుకుంటున్నారు.. అది చూసి మేము కూడా టెంప్ట్ అయ్యి.. బండ్లు ఆపేసి.. వాళ్ళతో కలిసి పోయి.. చలి కాచుకున్న.. ఎందుకో.. మా తాత గారు.. గుర్తుకు వచ్చారు.. సంక్రాంతి పండగకి మేము చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.. ఆ మంటల పక్కన ఒక చిన్న హోటల్ ఉంది.. వేడి వేడి గా.. noodles చేసి ఇస్తున్నారు.. శుబ్రంగా వాటిని కూడా ఒక పట్టు పట్టాము..
6 కి ఘాట్ రోడ్ ఓపెన్ చేసారు.. ఇంకా అంతెయ్ అక్కడ మలాగానే.. ఒక 60 మంది వుంటారు.. అంత ఒకేసారి పైకి వెళ్ళాం.. వెళ్ళే పాటికి అప్పుడే భానుడు.. ఒళ్ళు విరుచుకుంటూ.. బయటకి వస్తున్నాడు.. కొండ పైన కదా.. చల్లని గాలి, సూర్యోదయం.. అబ్బః.. అది అనుభవిస్తేనే కానీ.. మాటల్లో చెప్పలేని ఆనందం.. ఒక గంట.. అల గడిపిన తర్వత..అక్కడికి ఏదో కన్నడ సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చారు.. అస్సలే మనకి సినిమా మేకింగ్ అంటే పిచ్చి.. సో ఇంకో ౩ గంటలు.. వాళ్ళ పని తీరు.. షాట్స్ తీసే విధానం చూస్తూ వుండిపోయ..
సడన్ గా మా తమ్ముడు గుర్తుచేసాడు.. "నీ బస్సు టైం 6 .30 కి.. ఇప్పుడు టైం పదిన్నర అయ్యింది.. ఇక్కడ నుంచి ఇంటికి నాలుగు గంటలు అన్న పడుతుంది.. పద అని చెప్పగానే.. వెన్నకి బయలుదేరం.. ఐతేయ్ ముందు రోజు రాత్రి అంత నిద్ర లేకపోవటం వల్ల.. చాల స్లో డ్రైవింగ్ చేసాం.. ఇంటికి వచ్చేపాటికి 3 అయ్యింది.. వళ్ళు నెప్పులు.. పడుకుంటే నిద్ర రాదు... అల కష్టపడుతూ ఎప్పటికో నిద్ర పోయాను.. నిద్ర పట్టిందో లేదో.. బస్సు టైం అవుతుంది అని నిద్ర లేపేసారు..
సర్లే బస్సు లో పడుకుందాం అనుకున్నాం.. కానీ.. ఏమి చేస్తాం.. విధి మనతో గేమ్స్ ఆడటం మొదలు పెట్టింది.. బస్సు లో నా పక్కన వ్యక్తి.. పెద్ద గురకలు పెడుతూ నిద్ర పోతీ నాకు నిద్ర ఎలా వస్తుంది.. పోదున ఇంటికి వెళ్ళగానే.. పని మీద నాన్న , నేను రోజు మొత్తం బండి మీద తిరుగుతూనే వున్నాం.. సాయంత్రానికి నా వళ్ళు పచ్చి పుండు లా ఒకటే నెప్పులు.. సర్లే.. బెంగుళూరు కి వెళ్తూ అన్న.. రెస్ట్ తీసుకుందాం అనుకున్న.. బస్సు స్టాప్ కి వెళ్ళాను.. విజయవాడ to బెంగుళూరు బస్సు వచ్చింది.. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. లిస్టు లో చూస్తే నా పేరు లేదు. టికెట్ ఏమో నా దగ్గరే ఉంది.. మరి ఏంటి ఏమి అయ్యింది అనుకుంటున్నారా? ఆ ట్విస్ట్ చూస్తే.. మీరే పాపం అనుకుంటారు.. అస్సలు గుంటూరు to బెంగుళూరు రిటర్న్ జర్నీ మీద ఇంకో పోస్ట్ ఎసుకోవచ్చు.. అస్సలు ఏమి జరిగింది, ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది..అని తెలుసుకోవాలి అంటే.. ఇంకో పోస్ట్ కోసం వెయిట్ చెయ్యండి..
7 కామెంట్లు:
నంది హిల్ల్స్ చాలా మంచి లొకేషన్. మేము ఈవినింగ్ వెళ్ళి లేట్ నైట్ వరకు వుంఢె వాళ్ళం.
ఈసారి ఉదయం వెళ్ళ్లాలి.
baagundamma sasi baagundi ... nandi hilld trip and nee ticket story... anduke ticket teesuketappudu date sarigga chukovali.......................................................................................
నందిహిల్స్ ట్రిప్ బాగుంది, కాని అర్ధరాత్రి ప్రయాణాలు డేంజర్ కదూ... సో, రిటర్న్ జర్నీ సస్పెన్స్ అన్నమాట. ఓ.కే.
Midnight journeys danger ee kani.. Nandi hills ki chala mandi midnight bayaladertharu.. manam adharathri prayanam chesthunnam anna bavana raadu.. antha mandi vuntaru aa road meeda :)
ఇది సీరియల్స్ సీజనా? అందరూ ఇలా సశేషం రాస్తే యెలా శశీ... సరే మరి అందరూ తొందరగా తరవాత కథ వ్రాయండి..యీ సస్పెన్సులు భరించలేక గుండె పోటు వచ్చేట్లుంది. అర్థం చేసుకోరూ!
ఇదెప్పుడు రాశారు? నాకు కనిపించలేదు!!! ఏమిటీ సాహసాలు? అర్థరాత్రి ప్రయాణాలు, బైక్ మీద. ప్రమాదం కదూ. మీరనుకున్నట్టు నంది హిల్స్ చూసేశారుగా. మరి తిరుగుప్రయాణం టపా ఎప్పుడు?
@sisira garu last month rasanu lendi.. ardharathri sahasalu lanti pedda matalu vaddhu lendi :) appudappudu ila chesthu vundali lekapothey life bore kottesthondi..nandi hills kakunda.. inko place kooda chudali ani eppati nuncho korika.. "vennallo godavari.. vamsi gari rachanala valla akkada place gurinchi enno kallalu kantunna :)"
tiruguprayanam gurinchi next tapa lo pedathanu..
కామెంట్‌ను పోస్ట్ చేయండి