అప్పుడే పడుతున్న తొలకరి జల్లు ని చూస్తూ.. తన హృదయ నెచ్చలి గురించి ఎలా ఒక అబ్బాయి ఎలా తలుచుకుంటాడు, అని ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈ కవిత రాసాను..
నీ మువ్వల సవ్వడి లాంటి ఈ వర్షపు జల్లు ...
నీ అందమైన నవ్వు ని మరిపించే ఆ హరివిల్లు ...
నీ సొగసైన కురులను జ్ఞప్తికి తెచ్చే ఆ నల్లటి మబ్బు తెరలు ...
నీ సాంగత్యం లో హాయిని గుర్తుకు తెచ్చే ఈ మలయ మారుతాలు ...
ఏమని చెప్పను ఎలాగని చెప్పను.. పడుతున్న ఈ తొలకరి జల్లు లో అడుఅడుగున్నా నీ జ్ఞాపకాలే..
నోట్:-ఇలాంటి కవితలు ఇంతక ముందు రాసే వాడిని.. కానీ నా స్నేహితులు ఎవరు రా ఆ అమ్మాయి అంటే.. నేను ఎవరు లేరు.. నా ఒహలకు రూపం అంటే ఒక్కడు నమ్మే వాడు కాదు.. అందుకే రిస్క్ ఎందుకు లే.. అని రాయటం మానివేస.. ఇది నేను ఇక్కడ ఎందుకు చెపుతున్నాను అంటే. మీరు కూడా నేను ప్రేమ లో వున్నా అని ఫిక్స్ అయ్యి.. కామెంట్స్ పెదతారు ఏమో అని ముందు చూపు అన్న మాట..
చిన్న సహాయం :- పైన నేను చెప్పిన పోలికలతో ఎవరు అయినా అమ్మాయి కనపడితేయ్ నాకు చెప్పండి.. వెంటనే సంబంధం ఫిక్స్ చేయతంకి మా అమ్మ ని నాన్న ని పంపిస్తా.. :) ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి..