మానసిక ప్రశాంతత వుంటే జీవితం సాఫీగా వెళ్ళినట్టే, కానీ మనలో ఎంత మంది ప్రశాంతం గా వున్నారు..లేకపోతేయ్ ఎందుకు లేరు...అస్సలు మన సమస్యలు ఏమిటి అని ఒక్కసారి
అలోచించి మనం ఇలా చిరాకు గా / లేక బెంగ గా వుంటే అవ్వన్నీ పరిష్కారం అవుతాయి అంటే ఇలాగే చిరాకు గా వుండండి.
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పక వుంటుంది, పరిష్కారం లేకపోతేయ్ అస్సలు అది సమస్యే కాదు.. నేను ఇక్కడ మీ సమస్యలకి పరిష్కారం ఏమి చెప్పను కానీ , ఆ సమస్యల వల్ల వచ్చే చిరాకులని ఎలా తరమికొట్టాలో చెపుతా...
-->మనసు ప్రశాంతం గా లేకపోతేయ్ – ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ జీవితం లో ఆనందం గా గడిపిన క్షణాలని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.. లేకపోతేయ్ మీ ప్రాణ స్నేహితడుకి మీ సమస్యని చెప్పండి.. దానితో పాటు మీ మనసు కూడా ఏమి బాలేదు అని చెప్పండి..మీ స్నేహితుడు వెంటనే మీకు సాంత్వన కలిగించేయ్ మాట చెపుతారు.. ఇంకా నీకు నేను వున్నా అని చెప్పే స్నేహితుడు మాటలే కొండంత అండగా గా వుంటాయి..
--> మీరు చిరాకు లో వున్నారు,,అప్పుడు మీ అమ్మ నాన్నలో , మీ ఆవిడో ఫోన్ చేస్తే. వీలు ఐతేయ్ ఫోన్ తీసి , మల్ల చేస్తాను అర్జెంటు పని లో వున్నా అని చెప్పండి.. చాల మంది ఫోన్ కట్ చేయటమో.. లేకపోతేయ్ ఫోన్ ఎత్తి తమ చిరాకు అంత ఫోన్ లో చూపిస్తారు.
--> ఆఫీసు లో ఎక్కువ పని వుంది , మీకు నేను ఈ పనులన్నీ చేయగలన అని ఒక చిన్న అనుమానం వచ్చింది అనుకోండి. వేంటనే మీ కుటుంబం ఫోటో చుడండి.. నన్ను నమ్మండి మీకు వేంటనే కొండతంత బలం రాకపోతేయ్ ఒట్టు.
--> నా లాగా బ్రహ్మచారులు ఐతేయ్ , ఇంటికి వెళ్ళగానే సుబ్బరంగా వంట వండేసేయండి. స్త్రెస్స్ మొత్తం అల రిలీజ్ అయ్యిపోద్ది.. మీకు పెళ్లి ఐతేయ్ , హ్యాపీ గా వైఫ్ కి వంట లో సాయం చేయండి.. లేకపోతేయ్ వంటిటిలో వుంది కనిసం కబుర్లు అయిన చెప్పండి.. అంతేయ్ కానీ.. టీవీ చూస్తూ విలువైన టైం లో వేస్ట్ చెయ్యవద్దు.
--> వీకెండ్స్ లో ఇంటి పని తప్పితేయ్ ఇంకా వేరే పని పెట్టుకోవ్వదు.పెళ్లి అయిన వారు.. నెల లో రెండు వారలు అయిన మీ బాగస్వామి కి నచ్చేలా ప్లాన్ చేసుకోండి..ఇంకా చిన్న పిల్లలు వుంటే వాళ్ళతో గేమ్స్ ఆడండి.
--> చివరి గా ఒక విషయం, మనం పని చేసీ కంపెనీ కంటే మన కుటుంబం ఎంతో ముఖ్యం .. ఇది కాకపోతేయ్ ఇంకో కంపెనీ.. కానీ కుటుంబం అల కాదు.. జీవితానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదు
ఇంకా చాల .. ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఫాలో ఐతేయ్ మనం ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ వుంటాం..
నోట్:- కొంచం క్లాసు ఎక్కువ పీకానా ??? స్నేహితుడికి నాలుగు నెలలల క్రితం పెళ్లి అయ్యింది.. పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు చూసిన స్త్రెస్స్ స్త్రెస్స్ అంటున్నాడు.. వాడికి ఒక క్లాసు పీకి , అదీ క్లాసు ని ఇక్కడ రేపెఅట్ చేశా..
ఈ సారి ఒక కామెడీ సంఘటనతో మీ ముందు కు వస్తా..
5 కామెంట్లు:
తెలిసినవే అయిన.. చాల చక్కగా చెప్పారు.మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్.. ఇంట్లో హ్యాపీగా వుంటే, పని లో వుండే సమస్యలు అంత గా బయపెట్టావు.
బాగా చెప్పారు. అవును నిజమే. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నాలాంటి వారికి మరీ ముఖ్యం. చిన్నచిన్న వాటికే చాలా టెన్షన్ పడిపోతుంటాను నేను.
Thanks Anonymous for the comment.
@sisira garu - chinna chinna vatikey tensions paduthara... mee posts chusthe ala anipinchadu :)
super bro
good class
కామెంట్‌ను పోస్ట్ చేయండి