23, జులై 2011, శనివారం

అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1

                
మారేనేమో.. నాకు ఒక ముద్దల తమ్ముడు వున్నాడు అన్నమాట..రాముడు మాట లక్షమణడు జవదాటనట్టు , వీడి మాట కూడా నేను దాటే వాడిని కాదు.. ఇదేంటి అంత రివర్స్ లో వుంది అనుకుంటున్నారా.. అది అంతేయ్.. ఎంతైన నా ముద్దలా తమ్ముడు కదా.. వాడి మాట చెల్లాలి.

                                               గుంటూరు లుత్రెన్ స్కూల్ లో నేను ఫస్ట్ క్లాసు లో వున్నపుడు మా వాడిని LKG కని బలపాల బడిలో వేసారు.ఇక మాకోసం అమ్మ రోజు మధ్యానం బాక్స్ తెచ్చి తినిపించి వెళ్లేది.వీడు స్కూల్ లో జేరక ముందు నేను ఒక్కడినే చిన్నగా అన్నం తింటూ అమ్మ తో కబుర్ల, కాకరకాయల తో, మంచి గా టైం పాస్ చేసేవాడిని. నేను ఇలా అమ్మ తో హ్యాపీ గా వుండటం చూసి అల్లు అర్జున్ – “అదేంటి హ్యాపీ సినిమా లో నేను కదా హీరో వీడు ఎలా హ్యాపీ గా వుంటాడు.” అని వెళ్లి వాళ్ళ మామయ్య చిరు కి చెప్పి.. ఆ చిరు వెళ్లి సోనియా కి చెప్పి..ఆ సోనియా తో.. అర్జెంటు మా తమ్ముడు వెళ్తున్న.బలపాల బడి ని మూపించాడు.. ఇక మా నాన్న గారు వేరే అలోచాలను లేకుండా మా స్కూల్ లోనే వేసారు..

                                               కొత్త వాళ్ళని సులభం గా స్నేహితులని చేసుకోవటం మా వాడికి వెన్నతో కాదు జున్ను తో పెట్టిన విద్య. అదేంటి సామెత మార్చాను అనుకుంటున్నరా.. అది అంతే నాకు వెన్న కంటే జున్ను అంటే ఇష్టం.  మా వాడు తిండి తినటం లో ఫాస్ట్.. త్వరగా తిని.. ఎంత త్వరగా ‘కరెంటు షాక్’’అంటుకునే ఆట ‘ ‘పిచ్చి బంతి’ వగైరా వగైరా ఆటలు ఆడదామా అని.. గబా గబా తినేసే వాడు. అమ్మ నోట్లో ముద్దలు పెడితేయ్..చిన్న ముద్దల కాదు అమ్మ.. పెద్దవి పెద్దవి అంటూ.. చివరికి తిరుపతి లడ్డుల సైజు కి తీసుకువచ్చాడు..నేను ఏమో తినలేక ఆపసోపాలు పడితేయ్, మా వాడు మటుకు తినేసి, లగేతుకుంటూ.. వెళ్లి ఆటల్లో మునిగిపోయేవాడు.. అమ్మ ఏమో.. ఏరా నాని నువ్వు వెళ్లి వాళ్ళతో ఆడుకో.. అని పంపించేసి.. అమ్మ వేంటనే వెళ్ళిపోయేది..అల అమ్మ కూడా త్వరగా వెళ్లటం అలవాటు చేసుకుంది.ఏమి చేస్తాం చెప్పండి.. రాజకీయనాయకులు,ఇంట్లో పెద్ద పిల్లలు ఏమి చేయలేరు.. ఖండించి ముందుకు పోవటం తప్పితేయ్...

                                                నర్సేరి నుంచి మా వాడు ఎల్.కే.జి కి వచ్చాడు..ఇంకా పరిమాణాల గురించి మన వాడికి ఊహ వచ్చేసింది..వాడి లెక్కలో ఎంత పెద్దగా వుంటే అంత ఎక్కువ విలువ అన్నమాట.ఇక చూసుకోండి మా తిప్పలు.. ఇంట్లో నాన్న కి పెద్ద పళ్ళెం లో అన్నం పెడితేయ్ , వాడికి కూడా దాంట్లో నే పెట్టాలి అని గొడవ చేసేవాడు., అన్నం కొంచం పెట్టిన ఊర్కునే వాడు కాదు..పళ్ళెం నిండా పెట్టుకొని సగం కూడా తినకుండా .. మిగిలిస్తేయ్ అమ్మ ఊర్కోదు అని.. ఇది నీ ముద్ద , నాన్న ముద్ద , అమ్మ ముద్ద మాతోనే నే తినిపించే వాడు..

ఇక్కడి తో అవ్వలేదు.. స్కూల్ కి వెళ్తుంటే.. నాన్న వాడికి, నాకు చెరొక పావలా ఇచ్చేవారు.. ఒకసారి వాడు నాన్న జేబు లో “పది పైసల” బిల్ల చూసి.. అది కావాలి అని గొడవ చేసాడు.. వద్దు రా,పావలా నే ఎక్కువ అంటే వినలేదు..ఇంకేం చేస్తారు.. చివరికి వాడి కోరిక మీరకు.. వాడికి పది పైసల బిల్లనే ఇచ్చారు.. స్కూల్ ఇంటర్వల్ టైం.. నేను పావలా ఇచ్చి.. ఐదు.. కిల్లి బిళ్ళలు తీసుకున్న.. మా వాడు పది పైసలు ఇచ్చి పది బిళ్ళలు కావాలి అన్నాడు.. కొట్టు వాడు , రెండే వస్తాయి అంటే.. అదేంటి పావలా కంటే పది పైసల సైజు ఎక్కువ వుంది కదా.. నాకే ఎక్కువ బిళ్ళలు రావాలి అని అరిచి గీ పెట్టి మరి తీసుకునే వాడు.. పాపం ఆ కొట్టు వాడు సాయంత్రం మా అమ్మ కి చెప్తేయ్ .. అమ్మ వాళ్ళు “వాడికి ఎన్ని కావాలి అంటే అన్ని ఇవ్వండి.. డబ్బులు సాయంత్రం మేము ఇస్తాము అని చెప్పారు.


                          ఇంకా మా వాడి డాన్స్.. డాన్స్ వేస్తున్నపుడు , పాటలు పాడుతున్నపుడు చుట్టూ వున్న అందరు చూసి చప్పట్లు కొట్టి తీరాలి.. లేకపోతేయ్ చప్పట్లు కొట్టే దాక డాన్స్ వేస్తూనే వుంటాడు.. .. ఇలా చెప్పుకుంటూ పోతేయ్ ఎన్నో వున్నాయి.. ఇప్పటికీ ఈ టపా పెద్దదయి పోయింది.. మిగిలినవని ఇంకో టపా లో చూద్దాం....

3 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

>>>రాజకీయనాయకులు,ఇంట్లో పెద్ద పిల్లలు ఏమి చేయలేరు.. ఖండించి ముందుకు పోవటం తప్పితే<<<

నిజ్జంగా నిజం. ఎంత బాగా చెప్పారు. భగవంతుడా! ఈ టపా చిన్న పిల్లల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు (ఇంకా ఉందో, మరే సంఘంలోనైనా విలీనం చేసేశారో తెలియదు) వంశీ కంట పడేలా చేయితండ్రీ.

మిగిలిన టపాలకోసం వేచి చూస్తున్నాం శశిగారూ.

శశి కళ చెప్పారు...

అన్నయ్యా.....జిందాబాద్...

Ennela చెప్పారు...

Dear SaSi,
penDing lo unna Tapaalannee chadivEsaa..annee baagunnaayi...peLLi paarty maatram due meeru..eppudu raavaalo chepte, bandhu mitra saparivaaram gaa vachchEstaa...