26, ఫిబ్రవరి 2011, శనివారం

నంది హిల్స్ - ఒక అనుకోని ప్రయాణం - అనుకోని సంఘటనలు

ముంబై తో పోల్చుకుంటే , బెంగుళూరు లో వీకెండ్స్ చాల నిస్తేజం గా , నీరసంగా గడిచిపోతున్నాయి.. దానికి రెండు కారణాలు..

మొదటిది ఇప్పుడు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్.. మార్చిలో రిలీజ్ వుంది అని . జనవరి నుంచి ప్రతి రోజు పని చేపిస్తునే వున్నారు.. మేము చేస్తూనే వున్నాం.. సండే ఖాళీ గానే వున్నా.. విశ్రాంతి కావాలి కదా.. సో సండే మొత్తం నిద్ర కే అంకితం ఇచ్చేసాం..

రెండవది :- మా క్రాంతి గాడు.. వేదవ.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే , ఆ.. వూ.. అంటాడు కానీ..కదలడు.. వాడు లేకుండా మనం వెళ్ళలేం.

మొన్న feb   మొదటి వారం.. ఇంట్లో ఒక పని వుండి , అర్జెంటుగా గుంటూరు రమ్మనారు.. శనివారం ఆఫీసు ఉంది అని.. శనివారం సాయంత్రానికి టికెట్స్ బుక్ చేపించాను.. ఏమైందో.. సడన్ గా మా మేనేజర్ మీటింగ్ పెట్టి, ఈ వీకెండ్ మనం పని చెయ్యటం లేదు.. ఎంజాయ్ 2  డేస్ అని చెప్పగానే.. "అందరం ఎగ్గిరి గంతువేసాం".. మేము అల సంబరాలు జరుపుతున్న టైం లో.. చావు కబురు చల్లగా చెప్పాడు.. సోమవారం onsite  నుంచి client  మేనేజర్ వస్తుంది.. సో వచ్చే వారం నుంచి సండే కూడా పని చెయ్యాలి.. కావున మీ మీ batteries ఛార్జ్ చేసుకోండి అని విషయం చెప్పగానే".. మాలో ఉత్సాహం.. చప్పున చల్లారిపోయింది..

గుంటూరు కి శుక్రవారం టికెట్స్ దొరకటం చాల కష్టం.. అందుకని.. శనివారం టికెట్ నీ ఒకే చేశా.. అంటే మన చేతిలో శనివారం అంత ఖాళీ గా ఉంది అన్నమాట..ఇంటికి వెళ్ళేపాటికి , క్రాంతి , చిన్న (మా తమ్ముడు) , దీపూ(క్రాంతి బావ).. అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.. బయటికి వెళ్దాం అంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు.. ఇంకేం చేస్తాం.. నేను పడుకున్న.. పడుకొని.. క్రాంతి గాడిని బాగా తిట్టాను.. కొత్త బైక్ కొన్నావు కదరా.. కనీసం.. నైట్ ride  కన్నా వెళ్దాం పద అంటే.. వాడు వద్దు అన్నాడు.. ఇంకా నాలో కోపం కట్టలు తెంచుకొని.. సమరసింహా రెడ్డి లో బాలయ్య లా " రేయ్!!! బెంగుళూరు కి రా రా అని అన్నావ్.. వచ్చాక కనీసం ఒక్కసారి అన్న బయటకి వెళ్ళామా?" అని ఘాటు గా అరిచాను.. పాపం.. వాడు కూడా "ఇప్పుడు టైం 12  అయ్యింది .. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటే.. " నంది హిల్స్ కి వెళ్దాం పద.. సూర్యోదయం.. బావుంటుంది అంట.. ఎప్పుడు చూడలేదు అని అడిగా.. సరే అని.. నలుగురం బయలుదేరం..

క్రాంతి బైక్ మీద నేను, దీపూ బైక్ మీద చిన్న .. అల మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. బాగా చలి గా వుండటం వాళ్ళ.. చాల తక్కువ స్పీడ్ లో వెళ్ళాము.. రాత్రి 2 గంటలకి.. "బెంగలూరు అంతర్జాతీయ విమానాశ్రయం" దగ్గరకి వెళ్ళాం.. అక్కడ రోడ్ పక్కన.. టీ అమ్ముతున్నారు.. మా లాగానే నంది హిల్స్ కి వెళ్తున్న ఒక 20 మంది కురాళ్ళు అక్కడ కలిసారు.. ఒక టీ తాగి.. వాళ్ళతో మాటలు కలిపాం .. నంది హిల్స్ పొద్దున 5  కి కానీ ఘాట్ రోడ్ ఓపెన్ చెయ్యరు అని తెలిసింది.. అందుకని ఒక 2  గంటలు ఎక్కడైనా గడపాలని అనుకున్నాం.  నా తమ్ముడు నేను విమానం take off  ఎప్పుడు చూడలేదు..విమానాశ్రయం కి వెళ్దాం అన్నాడు.. సరే ఒకే అని అక్కడికీ వెళ్ళాం.. అక్కడ కాఫీ డే ఉంది.. కాఫీ తాగుతూ బాతాకాని వేసుకుంటూ.. టైం పాస్ చేసాం..

కొన్ని ఫోటోలు.. , దిగిన తర్వత.. నంది హిల్స్ కి బయలుదేరం.. పాపం బాగా చలి గా వుండటం వాళ్ళ. క్రాంతి డ్రైవింగ్ చెయ్యలేక పోయాడు.. నాకేమో బండి రాదు.. వాడి పరిస్థితి చూసి "సర్లేరా.. gears  ఒక్కటే గా నాకు రానిది.. నువ్వు చెప్పు నేను మేనేజ్ చేస్తాను" అని బండి డ్రైవ్ చేశా.. అల నేను మొదటిసారీ బండి డ్రైవింగ్.. బ్రాహ్మి ముహూర్తం లో చేశా ;)".

ఘాట్ రోడ్ కి ఇంకో రెండు కిలోమీటర్లు ఉంది అనగా.. రోడ్ పక్కన కొంత మంది ముసలి వాళ్ళు.. పెద్ద మంట వేసి చలి కాచుకుంటున్నారు.. అది చూసి మేము కూడా టెంప్ట్ అయ్యి.. బండ్లు ఆపేసి.. వాళ్ళతో కలిసి పోయి.. చలి కాచుకున్న.. ఎందుకో.. మా తాత గారు.. గుర్తుకు వచ్చారు.. సంక్రాంతి పండగకి మేము చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.. ఆ మంటల పక్కన ఒక చిన్న హోటల్ ఉంది.. వేడి వేడి గా.. noodles  చేసి ఇస్తున్నారు.. శుబ్రంగా వాటిని కూడా ఒక పట్టు పట్టాము..



6 కి ఘాట్ రోడ్ ఓపెన్ చేసారు.. ఇంకా అంతెయ్ అక్కడ మలాగానే.. ఒక 60  మంది వుంటారు.. అంత ఒకేసారి పైకి వెళ్ళాం.. వెళ్ళే పాటికి అప్పుడే భానుడు.. ఒళ్ళు విరుచుకుంటూ.. బయటకి వస్తున్నాడు.. కొండ పైన కదా.. చల్లని గాలి, సూర్యోదయం.. అబ్బః.. అది అనుభవిస్తేనే కానీ.. మాటల్లో చెప్పలేని ఆనందం.. ఒక గంట.. అల గడిపిన తర్వత..అక్కడికి ఏదో కన్నడ సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చారు.. అస్సలే మనకి సినిమా మేకింగ్  అంటే పిచ్చి.. సో ఇంకో ౩ గంటలు.. వాళ్ళ పని తీరు.. షాట్స్ తీసే విధానం చూస్తూ వుండిపోయ..

సడన్ గా మా తమ్ముడు గుర్తుచేసాడు.. "నీ బస్సు టైం 6 .30  కి.. ఇప్పుడు టైం పదిన్నర అయ్యింది.. ఇక్కడ నుంచి ఇంటికి నాలుగు గంటలు అన్న పడుతుంది.. పద అని చెప్పగానే.. వెన్నకి బయలుదేరం.. ఐతేయ్ ముందు రోజు రాత్రి అంత నిద్ర లేకపోవటం వల్ల.. చాల స్లో డ్రైవింగ్ చేసాం.. ఇంటికి వచ్చేపాటికి 3  అయ్యింది.. వళ్ళు నెప్పులు.. పడుకుంటే నిద్ర రాదు... అల కష్టపడుతూ ఎప్పటికో నిద్ర పోయాను.. నిద్ర పట్టిందో లేదో.. బస్సు టైం అవుతుంది అని నిద్ర లేపేసారు..

సర్లే బస్సు లో పడుకుందాం అనుకున్నాం.. కానీ.. ఏమి చేస్తాం.. విధి మనతో గేమ్స్ ఆడటం మొదలు పెట్టింది.. బస్సు లో నా పక్కన వ్యక్తి.. పెద్ద గురకలు పెడుతూ నిద్ర పోతీ నాకు నిద్ర ఎలా వస్తుంది.. పోదున ఇంటికి వెళ్ళగానే.. పని మీద నాన్న , నేను రోజు మొత్తం బండి మీద తిరుగుతూనే వున్నాం.. సాయంత్రానికి నా వళ్ళు పచ్చి పుండు లా ఒకటే నెప్పులు.. సర్లే.. బెంగుళూరు కి వెళ్తూ అన్న.. రెస్ట్ తీసుకుందాం అనుకున్న.. బస్సు స్టాప్ కి వెళ్ళాను.. విజయవాడ  to  బెంగుళూరు బస్సు వచ్చింది.. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. లిస్టు లో చూస్తే నా పేరు లేదు. టికెట్ ఏమో నా దగ్గరే ఉంది.. మరి ఏంటి ఏమి అయ్యింది అనుకుంటున్నారా?   ఆ ట్విస్ట్ చూస్తే.. మీరే పాపం అనుకుంటారు.. అస్సలు గుంటూరు to బెంగుళూరు రిటర్న్ జర్నీ మీద ఇంకో పోస్ట్ ఎసుకోవచ్చు.. అస్సలు ఏమి జరిగింది, ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది..అని తెలుసుకోవాలి అంటే.. ఇంకో పోస్ట్ కోసం వెయిట్ చెయ్యండి..  
 

24, ఫిబ్రవరి 2011, గురువారం

సెలవు తీసుకున్న ముళ్ళపూడి వెంకట రమణ గారు



నా కెంతో / మనకెంతో ఇష్టమైన "బుడుగు" సృష్టి కర్త "ముళ్ళపూడి వెంకట రమణ" గారు ఇక మన మధ్య లేరు.. స్వాతి బుక్ ని కేవలం "కోతి కొమ్మచి" కోసం కొనే వాడిని. బౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా , తను సృష్టించిన పాత్రలతో.. ఎప్పుడు మన మధ్య నే వుంటారు..

ఈ వార్త ని జీర్ణించుకోవటానికి బాపు గారికి మానసిక బలం కలగాలని ఆశిద్దాం..

ఆయన ఆత్మ కి శాంతి కలగాలని దేవుడిని వేడుకుంటున్న..

2, ఫిబ్రవరి 2011, బుధవారం

ఎలాంటి సాఫ్ట్ వేర్ మొగుడు కావాలంటే

ఇద్దరు పెళ్లి కానీ అమ్మాయిలు.. మాట్లాడుకుంటున్నారు.. మనం వెళ్లి సిక్రెట్ గా విందాం వచ్చేయండి.. వచ్చేసారా.. ఇప్పుడు నాలేగే చెవులని గోడ కి అనించండి.. ఏంటి ఇంకా వినపడటం లేదా.. సరేలెండి ఏమి చేస్తాం వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో.. మీకు లైన్ బై లైన్ రాస్తాను..

విద్య :- హాయ్.. ఎంటే సడన్ గా కాల్ చేసావ్.. ఏదైనా అర్జెంటు విషయమా?
నిత్య :- ఏమి లేదే.. నీకు గుర్తు వుందా.. మా అమ్మ నాన్న నా జాతకాన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, సంబంధాలు ఏమైనా చూస్తారు అని.. చాల సంబంధాలు వచ్చాయి కానీ.. ఒక 4  - 5  సంభంధాలకి మాత్రం నా జాతకం సరిపోయింది అంట..
విద్య :-  మంచిది.. ఆ నాలుగింటి లో నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో..
నిత్య :- ఇక్కడే వచ్చింది , అస్సలు చిక్కు అంత. నలుగురు కూడా software ఇంజనీర్ లే.. కాకపోతేయ్ అంత వేరే positions  లో వున్నారు..
విద్య :- అలాగా.. ఐతేయ్ వాళ్ళ పోసిషన్ చెప్పు.. దాన్ని బట్టి నీకు మంచిది చెప్తా..
నిత్య :- మొదటి వాడు.. "manager".
విద్య :-
"manager". యా వద్దే వద్దు.. వాడు ఎప్పుడు పని లేకపోయినా బిజీ గా వున్నట్టు జీవిస్తాడు.కానీ ఒక్క పని కూడా సర్రిగా చెయ్యడు.. కిలో mutton తెచ్చి చికెన్ 65  చెయ్యమంటాడు.. 2  కిలోల బియ్యం తెచ్చి నెల మొత్తం సరిపెట్టమంటాడు. కుదరదు , వీలుకాదు అని చెప్పిన వినడు.. రాత్రి పగలు పని చేస్తేయ్ ఏది కూడా అసాధ్యం కాదు అంటాడు..
నిత్య :- వామ్మో!!!!!!!!!!! ఐతేయ్ వద్దు.. రెండవ వాడు..
"test engineer".
విద్య :- వీడు ఇంకా డేంజర్ అమ్మ మహా తల్లి.. ఎప్పుడు తప్పులు వెతకటం లో బిజీ గా వుంటాడు.. నువ్వు కష్టపడి 10  కూరలు చేసిన.. దేంట్లో ఉప్పు తగ్గిందో చెపుతాడు.. నీకు వళ్ళుమండి "మీరు అస్సలు మెచ్చుకోర.. కరెక్ట్ గా చేసినవి కనిపించవా??" అని అడిగితేయ్.."సారీ తప్పులని పట్టుకోవటమే నా వృతి" అని సమాధానం వస్తుంది.
నిత్య :- అమ్మో ఐతేయ్ వీడు కూడా వద్దు.. మూడవ వాడు
"performance test engineer".

విద్య:- వీడు ఇంకో ఐటెం. నువ్వు ఎంత పని చేసిన.. అదేంటి ఇంత ఎక్కువ టైం తీసుకున్నావ్.. అయిదు నిమిషాలలో చేసే పనిని ఎందుకు 10  నిమిషాలలో చేస్తున్నావ్.. పని చెయ్యటం ముఖ్యం కాదు.. ఎంత తక్కువ టైం లో చేసామన్నదే ముఖ్యం.. అని చీల్చి చెండాడుతాడు.
నిత్య :- ఎంటే.. అస్సలు software  ఇంజనీర్ నే పెళ్లి చేసుకోకూడదా ఏమిటి?
విద్య :- అల అని ఎవ్వరు చెప్పరే.. వీళ్ల లో వుంటారు.. "
developers" అని.. వాళ్లు ఐతేయ్ మనకు సర్రిగా సరిపోతారు..
నిత్య :- కొంచం అర్ధం అయ్యేలా చెప్పవే..
విద్య :- వీళ్ల కోసం నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు.. అన్ని పనులు వాళ్ళ అంతట వల్లే చేసుకుంటారు.. రాక పోతీ .. గూగుల్ సాయం తీసుకుంటారు కానీ.. మాకు రాదూ అని ఏ పని గురించి చెప్పరు..వాళ్ళకి ఎంత పని చెప్పిన ఏమి అనరు.. టైం కి కాఫీ, పిజ్జాలు , ఇస్తేయ్ చాలు.. పని లో బాగా కష్టపడితేయ్, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.. "నువ్వు నిజం గా గ్రేట్, గొప్ప , కత్తి , తురం " అని పది మంది లో పోగిడితేయ్ చాలు.. వద్దు అన్న ఇంకా ఎక్కువ పని చేస్తారు..
నిత్య :- అబ్బః!!!!! సరిగ్గా మనకు కావాల్సిందీ వీళ్ళు..ఇంకా ఇలాంటి సంబంధాల కోసం చూస్తా.. అని చెప్పింది..

ఇదండీ.. ఇద్దరు అమ్మాయిలు.. తాము ఎలాంటి software  మొగుడని చేసుకోవాలో.. జరుపుకున్న మాట మంతి.. బ్లాగ్ ప్రపంచం లో వున్నా పెళ్లి కానీ , తమకు కాబోయే.. శ్రీవారి.. గురించి కలలు కంటున్నా అమ్మాయిలకి ఉపయోగ పడుతుంది అని ఇక్కడ పోస్ట్ చేశా..

నా మాట :- నేను ఎంతో గర్వం గా చెప్పుకొని.. ఫీల్ అయ్యే.. నా డెవలపర్ జాబ్ గురించి అమ్మాయిలలో ఇంత పాజిటివ్ టాక్ వున్నందుకు బాధపడాలో.. ఆనందపడాలో అర్ధం కావటం లేదు.. అయిన హాప్పీస్ .. నా కోసం ఇద్దరు అమ్మాయిలు.. వెతుకుతున్నారు అంటే.. ఆ త్రిల్ ఏ బలే వుంది..
(కొంచం ఎక్కువ ఐతేయ్ మన్నించాలి అని ప్రార్ధన.. )

నోట్:- నాకు ఇది ఇంగ్లీష్ లో మెయిల్ లో వచ్చింది.. తెలుగు లో అనువదించ.. అక్కడక్కడ తప్పితేయ్ , నేను సొంతం గా రాసింది ఏమి ఏమిలేదు( నా మాట నాదే నండోయ్.)