31, డిసెంబర్ 2010, శుక్రవారం

నా మిత్రులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు


2010  నా జీవితం లో ఒక మరుపురాని సంవత్సరం . కాకపోతేయ్ ఆంధ్ర లోనే ఎప్పుడు చుసిన బందులు , గొడవలు... 2011  లో అయినా గొడవలు లేకుండా అందరం సంతోషం గా వుండాలి అని బాబా ని కోరుకుంటున్న  . 

ఇక నా బ్లాగ్ మిత్రులు అయినా, శిశిర, అపర్ణ , శివరంజని , నేస్తం అక్క , రెడ్డి గారికి , వేణు రామ్ , ఆదిత్య , ప్రవీణ్ , హరి , అశోక్ రెడ్డి .. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీకు , మీ కుటుంబాలకి.. అంత మంచి , శుభం జరగాలి అని కోరుకుంటున్న ..

అందరికి శుభం జరగాలి అని విష్ చేస్తూ.. మీ శశిధర్

15, డిసెంబర్ 2010, బుధవారం

అమ్మలార.. జిందాబాద్..




మొన్న ఒక పేపర్ లో చదివిన వార్త ఇది. ఆ వార్త చదివాకా.. మహిళా నీకు జోహారు అని అనకుండా ఉండలేం..

సాదారణం గా ఒక సగటు మనిషి  తట్టుకునే అత్యంత నెప్పి  42   బెల్ల్స్( నెప్పి ని కొలిచే కొలమానం ఇది)  అంట. కానీ ఒక శిశువుని జన్మ నివ్వటానికి ఆడవారు 57 బెల్ల్స్  నెప్పి ని తట్టుకోవాలి.  అందుకే అంటారు ఏమో.. జన్మ ని ఇవ్వటం .. ఆడదానికి పునర్జన్మ లాంటిది అని..

బాపు - రమణ చెప్పినట్టు , మొగుడు - పెళ్లలలో ఇద్దరు సమానమే.. కానీ మొగుడు కొంచం ఎక్కువ సమానం లాగా.. ఇంత నెప్పి ని ఓర్చుకొని జన్మ ని ఇవ్వటం వల్లనేమో.. పిల్లలకి అమ్మ నాన్న మీద సమానమైన ప్రేమ చూపిస్తారు.. కానీ అమ్మ కి ఇంకొంచం ఎక్కువ సమానం అన్నమాట.. :)

7, డిసెంబర్ 2010, మంగళవారం

నాకు తెలిసినంత లో ప్రశాంతం గా వుండటం ఎలా అంటే..???


 మానసిక ప్రశాంతత వుంటే జీవితం సాఫీగా వెళ్ళినట్టే, కానీ మనలో ఎంత మంది ప్రశాంతం గా వున్నారు..లేకపోతేయ్ ఎందుకు లేరు...అస్సలు మన సమస్యలు ఏమిటి అని ఒక్కసారి
అలోచించి మనం ఇలా చిరాకు గా / లేక బెంగ గా  వుంటే అవ్వన్నీ పరిష్కారం అవుతాయి అంటే ఇలాగే చిరాకు గా వుండండి.

ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పక వుంటుంది, పరిష్కారం లేకపోతేయ్ అస్సలు అది సమస్యే కాదు.. నేను ఇక్కడ మీ సమస్యలకి పరిష్కారం ఏమి చెప్పను కానీ , ఆ సమస్యల వల్ల వచ్చే చిరాకులని ఎలా తరమికొట్టాలో చెపుతా...

-->మనసు ప్రశాంతం గా లేకపోతేయ్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ జీవితం లో ఆనందం గా గడిపిన క్షణాలని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.. లేకపోతేయ్ మీ ప్రాణ స్నేహితడుకి మీ సమస్యని చెప్పండి.. దానితో పాటు మీ మనసు కూడా ఏమి బాలేదు అని చెప్పండి..మీ స్నేహితుడు వెంటనే మీకు సాంత్వన కలిగించేయ్ మాట చెపుతారు.. ఇంకా నీకు నేను వున్నా అని చెప్పే స్నేహితుడు మాటలే కొండంత అండగా గా వుంటాయి..

--> మీరు చిరాకు  లో వున్నారు,,అప్పుడు మీ అమ్మ నాన్నలో , మీ ఆవిడో ఫోన్ చేస్తే. వీలు ఐతేయ్ ఫోన్ తీసి , మల్ల చేస్తాను అర్జెంటు పని లో వున్నా అని చెప్పండి.. చాల మంది ఫోన్ కట్ చేయటమో.. లేకపోతేయ్ ఫోన్ ఎత్తి తమ చిరాకు అంత ఫోన్ లో చూపిస్తారు.

--> ఆఫీసు లో ఎక్కువ పని వుంది , మీకు నేను ఈ పనులన్నీ చేయగలన అని ఒక చిన్న అనుమానం వచ్చింది అనుకోండి. వేంటనే మీ కుటుంబం ఫోటో చుడండి.. నన్ను నమ్మండి మీకు వేంటనే కొండతంత బలం రాకపోతేయ్ ఒట్టు.

--> నా లాగా బ్రహ్మచారులు  ఐతేయ్ , ఇంటికి వెళ్ళగానే సుబ్బరంగా వంట వండేసేయండి. స్త్రెస్స్ మొత్తం అల రిలీజ్ అయ్యిపోద్ది.. మీకు పెళ్లి ఐతేయ్ , హ్యాపీ గా వైఫ్ కి వంట లో సాయం చేయండి.. లేకపోతేయ్ వంటిటిలో వుంది కనిసం కబుర్లు అయిన చెప్పండి.. అంతేయ్ కానీ.. టీవీ చూస్తూ విలువైన టైం లో వేస్ట్ చెయ్యవద్దు.

--> వీకెండ్స్ లో ఇంటి పని తప్పితేయ్ ఇంకా వేరే పని పెట్టుకోవ్వదు.పెళ్లి అయిన వారు.. నెల లో రెండు వారలు అయిన మీ బాగస్వామి కి నచ్చేలా ప్లాన్ చేసుకోండి..ఇంకా చిన్న పిల్లలు వుంటే వాళ్ళతో గేమ్స్ ఆడండి.

--> చివరి గా ఒక విషయం, మనం పని చేసీ కంపెనీ కంటే మన కుటుంబం ఎంతో ముఖ్యం .. ఇది కాకపోతేయ్ ఇంకో కంపెనీ.. కానీ కుటుంబం అల కాదు.. జీవితానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదు
ఇంకా చాల .. ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఫాలో ఐతేయ్ మనం ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ వుంటాం..

నోట్:- కొంచం క్లాసు ఎక్కువ పీకానా ??? స్నేహితుడికి నాలుగు నెలలల క్రితం పెళ్లి అయ్యింది.. పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు చూసిన స్త్రెస్స్ స్త్రెస్స్ అంటున్నాడు.. వాడికి ఒక క్లాసు పీకి , అదీ క్లాసు ని ఇక్కడ రేపెఅట్ చేశా.. 

ఈ సారి ఒక కామెడీ సంఘటనతో మీ ముందు కు వస్తా..